DailyDose

2020లో దేశంలో 81.2 లక్షల మరణాలు – సీఆర్‌ఎస్‌ గణాంకాల వెల్లడి

2020లో దేశంలో 81.2 లక్షల మరణాలు – సీఆర్‌ఎస్‌ గణాంకాల వెల్లడి

దేశంలో 2020లో 81.2 లక్షల మరణాలు నమోదయ్యాయని సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) గణాంకాలు తెలిపాయి. అంతకుముందు ఏడాది (2019) తో పోలిస్తే ఈ మృతులు 6 శాతం అధికమని ఆ గణాంకాలు వెల్లడించాయి. 2019లో 76.4 లక్షల మృతులు నమోదయ్యాయని పేర్కొన్నాయి. సీఆర్‌ఎస్‌ డేటాను కేంద్ర వైద్య, కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళళవారం విడుదల చేసింది. 2020లో నమోదైన మొత్తం మరణాల్లో పురుషుల శాతం 60.2 కాగా, మహిళలు 39.8 శాతం ఉన్నారు. దేశంలో కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం వెల్లడించిన (5,23,889) గణాంకాల కన్నా ఇంకా ఎక్కువ మరణాలు సంభవించాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాలను కేంద్రం ఈ సందర్భంగా కొట్టివేసింది. మరణాలను అంచనావేసే విషయంలో వైఖరిని మార్చుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓకు వైద్య మంత్రిత్వశాఖ లేఖ రాసింది. భారత్‌లో నమోదైన మరణాల విషయంలో విశ్వసనీయత, కచ్చితత్వం ఉండే తమ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కాగా దేశంలో జననాలు, మరణాలను నమోదుచేసే ఎప్పటికపుడు నమోదుచేసే ప్రక్రియే సీఆర్‌ఎస్‌.