Movies

అలియా అడుగుపెట్టారు

Auto Draft

మనసుకు నచ్చినవాడిని మనువాడిన ఆనందంలో మరింత మెరిసిపోతున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌. రణ్‌బీర్‌ కపూర్‌తో వివాహం అయ్యాక సినిమా షూటింగ్స్‌కు చిన్న గ్యాప్‌ ఇచ్చారు అలియా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ సెట్స్‌లోకి అలియా అడుగుపెట్టారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌, బరాత్‌ సీన్లను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం వందకు పైగా వింటేజ్‌ కార్లను వాడుతున్నారట. చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కరణ్‌ జోహర్‌ దర్శకుడు.