ScienceAndTech

గద్దలు ఇతర పక్షుల్లా గుంపులుగా ఎందుకు ఎగరవో తెలుసా?

Auto Draft

గద్ద ఆసక్తికరమైన జీవిగా ప్రసిద్ధి చెందింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు అనేక దేశాలలో ఇది మతపరమైన చిహ్నం. అదే సమయంలో కొన్ని దేశాలు దీనిని గృహాలలో సాంప్రదాయ చిహ్నంగా మలచుకున్నాయి. అలా ఉంచడం చాలా మంచిదని వారి నమ్మకం. గద్దలు ఇతర పక్షుల్లా గుంపులుగా ఎగురుతూ మనకు ఎప్పుడూ కనిపించవు. దీనికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పక్షి ఇలా ఎందుకు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జువాలజీ ఎక్స్‌పర్ట్ వెబ్‌సైట్ ప్రకారం, గద్దలు వేటలో ఎంతో నిపుణత కలిగినవి. అవి తమ ఎరను చాలా ఎత్తు నుంచి కూడా చూడగలరు.

గుంపులో ప్రయాణించకపోవడానికి వేటకు సంబంధించిన కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అవి తమ ఎరను ఎలాంటి పరధ్యానం లేకుండా పట్టుకోవడానికి ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడతాయి. గుంపుగా ఎగరడం వల్ల శబ్దం వస్తుందని.. ఇది వాటి దృష్టిని మరలుస్తుందని నిపుణులు తెలిపారు. అలాంటప్పుడు అది ఆహారాన్ని సరిగా ట్రాక్ చేయలేదు. అందుకే ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడతుంది. అవి సంతానోత్పత్తి చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఇతర గద్దల మధ్య కనిపిస్తాయి. గద్ద గురించి శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గద్ద కళ్ల రంగు వాటి వయస్సును బట్టి మారుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పుట్టినప్పటి నుండి లైంగిక పరిపక్వత వరకు, దాని కళ్ళ రంగు గోధుమ రంగులో ఉంటుంది. పెద్దయ్యాక దాని కళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది. అంటే ఈ రంగు వృద్ధాప్యానికి సంకేతం. గద్దలు అతివేగంతో ఎగురుతాయి. గద్ద గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. వాటికి ఈత కూడా తెలుసు. అవి ఈత సమయంలో కూడా తమ ఎరను అందుకుంటాయి