Business

బేర్‌ పంజా దెబ్బకు మార్కెట్‌లు విలవిల – TNI వాణిజ్య వార్తలు

బేర్‌ పంజా దెబ్బకు మార్కెట్‌లు విలవిల  – TNI వాణిజ్య వార్తలు

* ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలను చవిచూసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇంట్రాడేలో 642 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 85 పాయింట్ల నష్టంతో 56,976 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మార్కెట్‌ ముగిసే సరికి 33 పాయింట్ల పతనంతో 17,069 వద్ద నిలిచింది.
*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.
*హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ యాజమాన్యం చేతులు మారుతోంది. విన్‌ఎయిర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ట్రూజెట్‌ (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) ఈక్విటీలో 79 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.200 కోట్లు చెల్లించింది. ట్రూజెట్‌ ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి, విన్‌ఎయిర్‌ సీఎండీ శామ్యూల్‌ తిమోతీ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై గత నెల 26న సంతకాలు చేసినట్టు విన్‌ఎయిర్‌ తెలిపింది.
* కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.
* ఆర్థిక నేరగాళ్ల ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పుడూ బకరాలే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ని నిండా ముంచిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ చేసిన మరో ఘరానా మోసం తాజాగా బయటపడింది. కృత్రిమ వజ్రాలను అసలు సిసలు వజ్రాలుగా చూపి.. ఈ ఘరానా పెద్ద మనిషి ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎ్‌ఫసీఐ)కి రూ.25 కోట్ల మేర టోపీ పెట్టాడు. ఈ వజ్రాలను అసలు, సిసలు వజ్రాలని, వాటి విలువ రూ.34-45 కోట్ల మధ్య ఉంటుందని వాల్యూయర్స్‌ ద్వారా సర్టిఫై చేయించి 2016లో ప్రభుత్వ రంగంలోని ఐఎ్‌ఫసీఐ నుంచి రూ.25 కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌ తీసుకున్నాడు. ఈ లోన్‌ ఎన్‌పీఏగా మారడంతో ఐఎ్‌ఫసీఐ ఈ వజ్రాలను మరో వాల్యూయర్‌ ద్వారా తనిఖీ చేయించింది.

*దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. మార్చి నెలతో పోల్చితే ఏప్రిల్‌లో ఇది 7.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల్లో 9.22 శాతం, పల్లె ప్రాంతాల్లో 7.18 శాతం ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. మార్చిలో పట్టణ ప్రాంతాల నిరుద్యోగిత 8.28 శాతం ఉండగా పల్లె ప్రాంతాల్లో 7.29 శాతం ఉంది. రాష్ర్టాలవారీగా చూస్తే నిరుద్యోగిత హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం ఉండగా 28.8 శాతంతో రాజస్థాన్‌, 21.1 శాతంతో బిహార్‌, 15.6 శాతంతో జమ్ముకశ్మీర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఏప్రిల్‌లో కార్మిక శక్తి భాగస్వామ్యం రేటు, ఉద్యోగిత రేటు రెండూ పెరిగాయని, అది మంచి పరిణామమని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. ఏప్రిల్‌లో ఉద్యోగిత రేటు 36.46 శాతం నుంచి 37.05 శాతానికి పెరిగిందన్నారు.
*సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విటర్‌’లో సమూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌తో పాటు బోర్డు సభ్యులు అందరిని తప్పించి ఎలాన్‌ మస్క్‌ పూర్తిగా కొత్త టీమ్‌ను తెచ్చుకుంటారని సమాచారం. టెస్లా చీఫ్‌ మస్క్‌ ఇటీవలే ట్విటర్‌ను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశారు. కీలక స్థాయిల్లో మార్పులతో పాటు ఖర్చుల తగ్గింపుపైనా మస్క్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ట్విటర్‌ ఉద్యోగుల్లో ఉద్యోగం ఉంటుందా? ఉన్నా ప్రస్తుత జీతాలు కొనసాగుతాయా? లేదా? అనే భయాలు ఏర్పడ్డాయి. కొత్త సీఈఓ, బోర్డు ఏర్పడే వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగుతుందని భావిస్తున్నారు.