Devotional

సింహాచలంలో భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన నరసింహస్వామి

సింహాచలంలో భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన నరసింహస్వామి

సింహాచలంలో నరసింహస్వామి నిజరూప దర్శనం మొదలైంది. ఇప్పటికే దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. తొలి దర్శనాన్ని చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబం చందనం సమర్పించి దర్శనాన్ని చేసుకున్నారు. స్వామిని మరికొందరు మంత్రులు కూడా దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకున్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, అమర్నాథ్ దర్శించుకున్నారు.సింహగిరిపై చందనోత్సవంకు భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. స్వామివారి దర్శనానికి నేడు సాయంత్రం వరకు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
app5
వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వయంగా భద్రత ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భక్తులు పోటెత్తారు.
app1
మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అపరిచితుల కదలికలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్యులకు త్వరితగతిన స్వామి దర్శనం లభించే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం, రూ. 300 టిక్కెట్ తీసుకున్న భక్తులకు 30 నిముషాలు, రూ. 12వందల టిక్కెట్ తీసుకున్నవారికి డైరెక్టుగా స్వామి వారి దర్శనం జరగుతుందని శ్రీకాంత్ తెలిపారు. వీఐపీలకు తెల్లవారు జాము 4 గంటల నుంచి 6 గంటల వరకు.. అలాగే 7 గంటల నుంచి 9 గంటల వరకు మరో సమయం కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.
app1-2
app1-3
app4