Movies

నెంబర్ వన్నే

నెంబర్ వన్నే

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పుడూ ఇచ్చినట్లే మార్చి 2022 కి గాను టాప్ పది తెలుగు హీరో హీరోయిన్ల జాబితా విడుదల చేసింది. హీరోగా, ప్రభాస్ తొలిస్థానంలో ఉండగా , టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫీమేల్ కేటగిరిలో సమంత ముందున్నది. ‘ పుష్ప’లో ఐటమ్సంగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఫ్యామిలీ మ్యాన్ ‘ వెబ్ సిరీస్ పార్ట్ 2 లో నటించి పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు తెలుగులో ‘ శాకుంతలం’, ‘యశోదా ‘ సినిమాల్లో నటిస్తున్నది . ఇవికాక ఇంకొన్ని సినిమాలూ ప్రకటించింది .