Movies

అందుకే వెళ్ళలా

Auto Draft

ఒకనాడు యువతకు గిలిగింతలు పెట్టిన గోవా సుందరి ఇలియానా బాలీవుడ్ ను దున్నేయాలని భంగపడింది. ఇప్పుడు ఆఫర్లు అక్కడా, ఇక్కడా కరువై ఏదో అరకొర అవకాశాలతో సాగుతున్నది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో తెలుగు సినిమాల మధురస్మృతులు నెమరువేసు కుంటూ వుంటుంది. పోకిరి సినిమాలో డోలెడోలె , రాఖీ చిత్రంలో జర జర అన్న పాటలంటే తనకు అమిత ఇష్టం అని చెప్పింది. నిజానికి పాండమిక్ సమయంలో రెండు సినిమాలకు సంతకాలు చేశాను. అప్పటి పరిస్థితుల వల్ల వాయిదాపడ్డాయి. అమెరికా వెళ్ళిపోవాలన్న ఆలోచనకూడా వచ్చిందికాని ఇక్కడ ఎక్కు వచిత్రాల్లో నటించాలన్న కోరికతో వెళ్ళలా అని చెప్పింది .