Movies

హృదయం ముక్కలైంది!

హృదయం ముక్కలైంది!

కాలం చేసే ఇంద్రజాలం ఎలా ఉం టుందో ఎవరూ ఊహించలేరు. తన జీవితంలో కూడా అలాంటి మేజిక్‌ జరిగిందని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. స్కూల్‌రోజుల్లో ఈ భామ బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ను ఎంతగానో అభిమానించేదట. ఆయనతో కలిసి ఓ ఫొటో తీయించుకునేందుకు ‘కోయీ మిల్‌గయా’ సినిమా ప్రీమియర్‌షోకు వెళ్లి నిరాశగా తిరిగొచ్చిందట. ఈ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత అదే హృతిక్‌రోషన్‌ సరసన ‘మొహంజొదారో’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది పూజాహెగ్డే.తన జీవితంలో మధురజ్ఞాపకంగా మిగిలిపోయిన ఈ సంఘటన గురించి పూజాహెగ్డే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘కోయీ మిల్‌గయా’ సినిమా టైమ్‌లో నా వయసు పన్నెండేళ్లు. హృతిక్‌రోషన్‌ అంటే విపరీతమైన అభిమానం ఉండేది. ఆయనతో ఎలాగైనా ఫొటో తీయించుకోవాలని కెమెరాతో ప్రీమియర్‌షోకు వెళ్లాను. హృతిక్‌రోషన్‌ కనిపించగానే పట్టరాని సంతోషం కలిగింది.ఫొటో కోసం ప్రయత్నిస్తుండగానే ఆయన స్టేజీ దిగి వెళ్లిపోయారు. దాంతో ఒక్కసారిగా నా హృదయం ముక్కలైపోయిందనిపించింది. ఆ సినిమా పోస్టర్‌ ఎక్కడ కనిపించినా బాధపడేదాన్ని’ అని చెప్పింది. పదేళ్ల తర్వాత హృతిక్‌రోషన్‌తో కలిసి కథానాయికగా నటించే అవకాశం రావడంతో తన ఆనందానికి అవధులే లేకుండా పోయాయని, నాడు ఫొటో కోసం తపించిన తాను హృతిక్‌ సరసన నాయికగా నటించే అవకాశం సొంతం చేసుకోవడం ఓ అందమైన కలలా అనిపించిందని పూజాహెగ్డే పేర్కొంది.