DailyDose

రమజాన్ పర్వదినం వేళ విషాదం – TNI నేర వార్తలు

రమజాన్ పర్వదినం వేళ విషాదం   – TNI  నేర వార్తలు

*ప్రకాశం జిల్లా: ఒంగోలులోని కీర్తి మెడికల్‌ స్టోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మందులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.

*త్రిపురాంతకం మండలం డీవీఎన్‌ కాలనీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులను యర్రగొండపాలెం మండలానికి చెందిన వెంకటేశ్వర్లు, పోతులూరిగా గుర్తించారు.నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మండలం కరటంపాడు ఈద్గా వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లింలపై తేనెటీగల దాడి చేశాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

*కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక బ్యారేజ్‌ దిగువన స్నానాలు చేస్తూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు మహిళలని రాజమహేంద్రవరం వాసులుగా గుర్తించారు.శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల గురుకుల పాఠశాల వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కరిష్మా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

*శ్రీ సత్య సాయి జిల్లా: కర్ణాటక నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1824 మద్యం ప్యాకెట్లను గుర్తించారు. మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.*శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

*వైఎస్సార్​ జిల్లా: వేంపల్లె పట్టణంలో విద్యుత్ షాక్​కు గురై జూనియర్ లైన్​మెన్ మిథున్ చక్రవర్తి మృతి చెందాడు. కాపువీధిలో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​​కు ఫీజులు వేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఏలూరు జిల్లా: కైకలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వందల లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు.

*మే 2న ఔరంగాబాద్‌లో నిర్వహించిన సభలో విధ్వేష ప్రసంగాలు చేశారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే సహా మరో ముగ్గురు కార్యక్రమ నిర్వాహకులపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి కింద ‘అల్లర్లు సృష్టించే విధంగా విధ్వేష వ్యాఖ్యలు చేయడం’, ‘పది మంది లేదా అంత కంటే ఎక్కువ మందిని నేరం చేసే విధంగా ప్రోత్సహించడం’ వంటి కారణాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 4 లోపు మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను తొలగించాలని లేదంటే మహారాష్ట్ర సత్తా ఏంటో చూపిస్తామని రాజ్ థాకరే అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఒకరోజు ముందే ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. ఇదీ కాకుండా 14 ఏళ్ల నాటి ఒక కేసులో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ సైతం జారీ చేశారు.

* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రంజాన్‌ వేళ విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. శ్మశాన వాటికలో విద్యుద్ఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. అయితే, ఇద్దరు బాలురు మూడు రోజుల కిందట అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలురు ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలోనే ఇద్దరు మృతి చెందారు. మృతులను అబ్దుల్‌ అజీజ్‌ (11), ముల్తాని బాబు (16)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*గుంటూరు: జిల్లాలోని క్రోసూరు మండలం పెరికపాడులో దారుణం చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న బాలికపై మందా నాగరాజు(45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైయ్యారు. నాగరాజునకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది. బీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ వ్యక్తి గాయపరిచాడు. ర్యాష్ డ్రైవింగ్‌తో తప్పు చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసుపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంతోష్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్‌తో కారులో వేగంగా వెళుతూ ఇద్దరిని గాయపరిచాడు. దీంతో అతివేగంగా వెళుతున్న కారును అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. తన కారునే ఆపుతావా?.. అంటూ సంతోష్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో పోలీస్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*హైదరాబాద్‌: నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మృతదేహాల కలకలం రేగింది. కొత్తగూడెం బ్రిడ్జి దగ్గర జంట మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మూడు రోజుల క్రితం హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో మహిళ, యువకుడి మృతదేహాలు పడివున్నాయి. మృతులు కవాడిగూడ వాసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. కాగా.. ఈ చందనోత్సవంలో దొంగల హల్ చల్ చేశారు. స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా మహిళ బ్యాగ్ కట్ చేసి బంగారు నగలను అపహరించారు. బంగారు నగలు పోగొట్టుకున్న మహిళ తూర్పుగోదావరికి చెందిన ఎస్సై భార్యగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు

*ఏలూరు: జిల్లాలోని భీమడోలు మండలం పొలసానిపల్లిలో దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. కూరగాయలు కోసం బయటకు వెళ్లిన మహిళ మెడలో 2.5 కాసుల బంగారు నాన్ తాడును బైక్‌‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న సుమారు 20 అడుగుల లోతైన గుంతలోకి పల్టీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గాయపడ్డారు. హోసనగర తాలూకాలోని నిట్టూరు వద్ద ఈ ఘటన జరిగింది. బెంగళూరు శ్రీనగర లేఔట్‌కు చెందిన కుటుంబం కారులో సిగందూరుకు వెళుతున్న సమయంలో అతి వేగం వల్ల ప్రమాదం జరిగింది. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు

*వ‌న‌స్థ‌లిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇంజాపూర్ వ‌ద్ద సోమ‌వారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన రెండు బైకులు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు యువ‌కులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

*గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేటలో మద్యం తాగిన ఇద్దరు మృతి చెందారు. మద్యం తాగి అస్వస్థతకు గురైన మస్తాన్ షరీఫ్(52), బషీర్ అహ్మద్(35)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్‌, బషీర్‌ ప్రాణాలుకోల్పోయారు. అయితే మృతుల కుటుంబాలను మాజీమంత్రి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే బాటిల్‌ మద్యం తాగిన బషీర్, మస్తాన్ మృతిచెందాదరని చెప్పారు. మృతులు తాగిన చీప్ లిక్కన్‌ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. అలాగే మృతి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

*వైసీపీ నేతల కక్షసాధింపులు, దౌర్జన్యాలు పల్నాడు జిల్లా దాచేపల్లిలో కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం, పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ వాళ్లు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు కుటుంబ సభ్యులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయటంతో చైర్‌పర్సన్‌ భర్త పున్నారావు, ఆమె కుటుంబ సభ్యులు నాగులు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. మద్యం అమ్మకాల విషయమై గతంలోనూ నాగులు, పున్నారావు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పున్నారావు, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలసి నాగులు ఇంటిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్‌ ధ్వంసం చే శారు. నాగులు కుటుంబం ఇంటిలోపల తలుపులు వేసుకొని రక్షణ పొందారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

*కామవరపుకోట మండలం గుంటుపల్లిలో సోమవారం టీడీపీ, వైసీపీల మధ్య జరిగిన ఘర్షణలో గుంటుపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బేతిన వెంకట్రావుపై వైసీపీకి చెందిన కొల్లి రామకృష్ణ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని కాలువ నీటిని వంతుల వారీగా వినియోగించుకునే విషయమై చర్చించేందుకు టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొల్లి రామకృష్ణ, బేతిన వెంకట్రావుల మధ్య మాటా మాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో బేతిన వెంకట్రావుపై వెంకట్రావు కర్రతో దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమయ్యింది. వెంకట్రావును ఏలూరు ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.

*మరో 24 గంటల్లో పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులకు బలైంది. ఆమె ఆత్మహత్యతో పెళ్లింట విషాదం అలుముకుంది. ఈ హృదయవిదారక సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ ఎ.రాములు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్‌ పురపాలిక పరిధిలోని చందాపూర్‌కు చెందిన పద్మమ్మ, వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి(19). ఆమెకు అదే పురపాలిక పరిధిలోని దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. మంగళవారం పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులకు భీమేశ్వరి ఇంట్లోని వెంటిలేటర్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. ఆమె దగ్గర లభించిన లేఖ (సూసైట్‌ నోట్‌)లో.. తనకు నిశ్చితార్థం అయినా చందాపూర్‌కు చెందిన లిక్కి అలియాస్‌ సిరిపి నర్సింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉంది. యువకుడు వేధిస్తున్నట్లు తమతో చెబితే పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవారమని కుటుంబ సభ్యులు విలపించారు. భీమేశ్వరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

*చుంచుపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు నవతన్..భూక్య శ్రీదేవి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై అతికిరాతకంగా గొడ్డలితో యువకుడు దాడికి పాల్పడ్డాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్‎లో అగ్నిప్రమాదం జరిగింది. కీర్తి మెడికల్ షాపులో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మెడికల్ షాపులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు షాపు యజమాని తెలిపాడు.

*వనస్థలిపురం ఇంజాపూర్‌ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*షాపింగ్‌కు వెళ్తాడు.. నచ్చినవన్నీ కొనుగోలు చేస్తాడు. బిల్లు కౌంటర్‌కు వచ్చేసరికి ‘ఫోన్‌పే’ అంటాడు. డబ్బులు వేశాను.. ఇదిగో మెసేజ్‌ అని చూపించి వెళ్లిపోతాడు. షాపు యజమానులకు డబ్బు లు వేసినట్టు మెసేజ్‌ వస్తుంది.. కానీ ఆ సొమ్ము తమ బ్యాంకు ఖాతాలో జమకాదు! ఇలా నకిలీ ‘ఫోన్‌పే’ పేరిట మోసాలకు పాల్పడిన యువకుడి ఉదంతమిది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన అల్లూరి అరవింద్‌ పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని నల్లజర్ల, గంపలగూడెం, తాడేపల్లిగూడెం, కుక్కునూరు, తాళ్లపూడి తదితర పట్టణాల్లోని బంగారం షాపులకు వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసి నకిలీ ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేశాడు.

*అనంతపురం జిల్లా ఆస్పత్రి వైద్యులు రోగులపట్ల నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటైన్‌ డ్రైవర్‌ రాహుల్‌ అగర్వాల్‌(38) ఇక్కడ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. గార్లదిన్నె పోలీసుల కథనం మేరకు, ఆదివారం రాహుల్‌ అగర్వాల్‌ కంటైనర్‌తో శ్రీశైలం వెళ్తూ గార్లదిన్నె మండల తలగాసిపల్లి వద్ద 44వ హైవే పై లారీని ఢీ కొట్టాడు. బాధితులను 108లో అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. రాహుల్‌ అగర్వాల్‌కు అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. ప్రమాదం లేదని చెప్పి వెళ్లిపోవాలని సూచించారు. కానీ తనకు కడుపు నొప్పి తీవ్రంగా ఉందని, నోటి నుంచి రక్తం వస్తోందని, అడ్మిట్‌ చేసుకుని వైద్యం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. కానీ వైద్యులు కనికరం చూపలేదు. ‘మేము చెబుతున్నాం కదా. నీకేమీ కాలేదు.

*విశాఖపట్నం నుంచి తిరువారూరు జిల్లా తిరుత్తురై పూండికి కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని ప్రత్యేక దళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ఆదివారం సాయంత్రం తిరుత్తురైపూండి రౌండ్‌ఠాణా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారును తనిఖీ చేయగా అందులో 150 కిలోల గంజాయి బండిళ్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆ కారు డ్రైవర్‌ దిండుగల్‌ జిల్లా కనవాయ్‌పట్టికి చెందిన మహేశ్వరన్‌ (26)ను అరెస్టు చేశారు. గంజాయి విలువ కోటి రూపాయలుంటుందని వారు తెలిపారు. పోలీసుల తనిఖీలో కారులో మూడు రకాల నంబర్‌ ప్లేట్లు కూడా లభించాయి. ఆ కారును విశాఖ నుంచే తీసుకొస్తున్నట్లు డ్రైవర్‌ తెలిపాడు. అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్‌ నంబరును ఉపయోగించినట్లు వివరించాడు.

*ఫొటో ఫ్రేమ్‌లలో పెట్టి రైలులో తరలించడానికి సిద్ధం చేసిన 12 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పెందుర్తి రైల్వేస్టేషన్‌లో జీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనాథుడు కథనం మేరకు.. పెందుర్తి రైల్వేస్టేషన్‌ వద్ద ఫొటోఫ్రేమ్‌లతో కూడిన బ్యాగ్‌ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేశారు. ఫొటోఫ్రేమ్‌లు బరువుగా ఉండడంతో అనుమానం వచ్చి చూసి మధ్యలో గంజాయి ఉండడాన్ని గుర్తించారు.

*‘రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్‌ నెలలో 26 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. పంటలు దెబ్బతిని, అప్పుల బాధలు భరించలేక వీరంతా ఆత్మహత్య చేసుకొన్నారని పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం సూచిస్తోంది. ఇంత మంది ఆత్మహత్య చేసుకొన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో జరిగిన వ్యూహ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం నరకాంధ్ర ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగం సంక్షోభం-రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, నేరాల సంఘటనలపై విచారణకు పార్టీపరంగా రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీరును సమావేశం సమీక్షించింది.

*తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాపయ్యాడు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా రాజంపేటలోని సరస్వతీపురానికి చెందిన స్వాతి, వెంకటరమణ దంపతులు పదేళ్లుగా తిరుపతిలోని దామినేడులో నివాసముంటున్నారు. వెంకటరమణ తిరుమలలోని ఓ హోటల్‌లో మాస్టర్‌ కాగా, స్వాతి భక్తులకు తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తున్నారు. స్వాతి ఆదివారం తన పనిలో నిమగ్నమై ఉండగా ఆమె వెంట వచ్చిన రెండో కుమారుడు గోవర్ధన్‌ రాయల్‌ (చింటూ)(5)ను ఓ మహిళ వెంట తీసుకెళ్లిపోయింది. ఎంతవెతికినా బిడ్డ కనబడకపోవడంతో కమాండ్‌ కంట్రోల్‌ రూముకు రాత్రి 11 గంటలకు చేరుకుని ఫిర్యాదు చేసింది. అప్పుడు తిరుమలలోను, సోమవారం తిరుపతిలో సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించిన విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు ఓ మహిళ ఆలయం ముందు నుంచి బాలుడిని వెంటతీసుకెళ్లడాన్ని గుర్తించారు. సాయంత్రం 6.15 గంటలకు తిరుమల నుంచి బయలుదేరిన ఆమె రాత్రి 7.05 గంటలకు తిరుపతి బస్డాండ్‌కు చేరుకుంది. 7.50 గంటలకు గోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్లి తిరిగి 8.11 గంటలకు బయటకు వచ్చింది. 8.50 గంటలకు రైల్వేస్టేషన్‌ ముందున్న విష్ణునివాసంలోకి వెళ్లి బాలుడితో కలిసి బస చేసింది. సోమవారం వేకువజామున 4.05 గంటలకు విష్ణునివాసం నుంచి బయటకువచ్చి రైల్వేస్టేషన్‌ చేరుకుని 4.15గంటల సమయంలో టికెట్‌ కొనుగోలు చేసింది. రెండవ, మూడవ ఫ్లాట్‌ఫాంలపై తిరుగుతూ ఉండడాన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఏ రైలు ఎక్కి వెళ్లిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే 94407 96769, 94407 96772 నెంబర్లకు తెలియజేయాలని సీఐ జగన్మోహన రెడ్డి కోరారు.

*చుంచుపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు నవతన్..భూక్య శ్రీదేవి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై అతికిరాతకంగా గొడ్డలితో యువకుడు దాడికి పాల్పడ్డాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*వనస్థలిపురం ఇంజాపూర్‌ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురేదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

* వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ కూలి పనిచేసే రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి మద్యం సేవించిన అనంతరం ఆమె నివాసముండే భవనంపై నిద్రిస్తున్నాడు. తన తల్లితో వివాహేతర సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె.. తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. ఈ క్రమంలో తన ప్రియుడి సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు రామచంద్రారెడ్డిని తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తెనాలి టూటౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

*అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో విషాదం చోటుచేసుకుంది. సర్వీస్‌ వైర్‌పై దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడే ప్రయత్నంలో భార్యకు విద్యుదాఘాతమైంది. అరకులోయలోని విద్యుత్‌ ఉద్యోగుల క్వారర్ట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు సృహ కోల్పో్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు 108కు కాల్‌ చేశారు. అంబులెన్స్‌ రాక ఆలస్యం కావడంతో ఘటనాస్థలంలోనే భార్యాభర్తలు మృతిచెందారు.

*గుంటూరు: జిల్లాలోని క్రోసూరు మండలం పెరికపాడులో దారుణం చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న బాలికపై మందా నాగరాజు(45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైయ్యారు. నాగరాజునకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.