NRI-NRT

2024లో తెదేపా గెలుపే లక్ష్యంగా పని చేస్తాం: తెదేపా యూరప్ బృందం

2024లో తెదేపా గెలుపే లక్ష్యంగా పని చేస్తాం: తెదేపా యూరప్ బృందం

తెదేపా అధినేత చంద్రబాబును తెదేపా యూరప్ బృందం నాయకుడు డాక్టర్ కిషోర్​బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో ఎన్​ఆర్​ఐ యూరప్ బృందం చేపట్టే కార్యక్రమాలు, 2024 ఎన్నికల్లో తమ వంతు సహాయంపై చర్చించారు.

*ఎన్​ఆర్​ఐ తెదేపా యూరప్ బృందం నాయకుడు డాక్టర్ కిషోర్​బాబు మర్యాదపూర్వకంగా తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. 40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, అమరావతిలో ఎన్​ఆర్​ఐ తెదేపా యూరప్ బృందం ఏర్పాటు చేసిన అన్నదానం గురించి కిశోర్ బాబు వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, 2024 ఎన్నికల్లో తమ వంతు సహాయంపై చర్చించారు. 2024లో తెదేపా గెలుపే ప్రధానంగా పని చేస్తామని కిషోర్​బాబు తెలిపారు. త్వరలో ఎన్​ఆర్​ఐ తెదేపా యూరప్ బృందం ఆధ్వర్యంలో చేయబోయే మహానాడు కార్యక్రమాల గురించి మాట్లాడారు.

*తెదేపా 40 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించిన వారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉక్రెయిన్​లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సొంత రాష్ట్రాలకు చేరే వరకు ఎన్​ఆర్​ఐ తెదేపా యూరప్ బృందం చేసిన సహకారాలను ప్రశంసించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, సామాజిక కార్యక్రమాలే కాకుండా ప్రతీ ఒక్క ఎన్​ఆర్​ఐ ఒక వ్యాపారవేత్తగా మారి ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టాలని.. నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించాలి కోరారు. 2024లో పార్టీ గెలుపుకోసం శ్రమించాలని తెలియచేశారు. సేవా కార్యక్రమాలకు పార్టీ తరుపున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఎన్టీఆర్​ శత జయంతి వేడుకలు: వర్జీనియాలో నిర్వహించే నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు వర్జీనియాలోని ఎన్టీఆర్​ అభిమానులు అందరినీ ఆహ్వానించారు.

*”మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు, నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవ వేడుకలకు తెలుగింటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్లను ఆహ్వానిస్తున్నాం. వర్జీనియాలో జరగనున్న అన్న గారి శతజయంతి ఉత్సవాలకు సకుటుంబ సమేతంగా విచ్ఛేయాలి” -వర్జీనియాలోని ఎన్టీఆర్​ అభిమానులు