Movies

లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?

లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?

తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్​ హీరోయిన్ అదితి రావ్​ హైదరీ. ఇటీవల తెలుగులో ‘మహాసముద్రం’ సినిమాతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది. ముంబైలో అత్యంత ఖరీదు చేసే ‘ఆడి క్యూ 7’ లగ్జరీ కారుకు యజమానురాలైంది అదితి. సుమారు ఈ కారు విలువ రూ. 90 లక్షలు ఉంటుంది. అదితి రావు ఈ కారు కొనుగోలు చేసినట్లుగా ఆడి కంపెనీ తన సోషల్​ మీడియా హ్యాండిల్​లో పలు ఫొటోలతో పోస్ట్​ చేసింది. కారుతో అదితి రావు దిగిన అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతున్నాయి. కాగా అదితి రావు హైదరీ 2007లో ‘శృంగారం’ అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. సమ్మోహనం, వి, మహా సముద్రం, హై సినామిక, రాక్​స్టార్, మర్డర్​ 3, వజీర్​, ది గర్ల్​ ఆన్​ ది ట్రైన్​, పద్మావత్ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
https://www.instagram.com/p/CdIJ69np2ZC/?utm_source=ig_embed&ig_rid=35b9f1bd-222c-4c70-91cf-d8a80d0161a2