Movies

అమ్మలా … నాన్నలా …

Auto Draft

బాలీవుడ్ చిన్నది సారా అలీఖాన్ కు తనకంటే ఆరేళ్ళ చిన్నవాడైన తమ్ముడు ఇబ్రహీం అలీఖాన్ ఉన్నాడు . సారాకు పూర్తిగా తల్లి పోలిక అయితే, ఇబ్రహీం అచ్చు తండ్రి సైఫ్ అలీఖాన్ మాదిరి ఉంటాడు . ఈ విషయాన్ని కదిలిస్తూ ” నేను అమ్మలా, తమ్ముడు నాన్నలా ఉండే మాట నిజమే. కాని ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే ఇబ్రహీం చాలా కాముగా, ప్రశాంతంగా ఉంటాడు. చూడ్డానికి నాన్నలా ఉన్నప్పటికీ ప్రవర్తన పూర్తిగా అమ్మలా ఉంటుంది. నేను దానికి వ్యతిరేకం అమ్మ మాదిరి రూపం ఉన్నా నా ప్రవర్తన , చురుకుదనం అన్నీ నాన్నలా ఉంటాయి … ” అంటూ నవ్వే సింది సారా అలీఖాన్ .