Movies

అలాగే పాత్రల ఎంపిక

అలాగే పాత్రల ఎంపిక

చిత్ర పరిశ్రమలోకి ఓ నటిగా ప్రవేశించాక నాకు నచ్చిన పాత్రలే చేస్తా, ఈ తరహా పాత్రలు నేను చెయ్యను అంటూ గిరిగీసుకుని వుంటే కుదర దని ఫ్రాంక్ గా చెప్పింది రష్మిక మండన్నా. ” ఏ తరహా పాత్రలు చేసినా మనం బెస్ట్ ఇవ్వాలి. కొన్ని పాత్రలు ప్రేక్షకులకు వినోదం అందించేం దుకు మాత్రమే పరిమితం అవుతాయి . అభినయా నికి ప్రాధాన్యం ఇచ్చేవి కొన్ని వుంటాయి. ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి.  నేను నా పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానం ఇలాగే వుంటుంది” అని చెప్పింది.