Movies

అటూ ఇటూ …

అటూ ఇటూ …

చాలా చిన్నవయస్సులోనే సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయిన తమన్నా ఒకటిన్నర దశాబ్దాలు గడిచిపోయినా హీరో యిన్ తన హవాను కొనసాగిస్తూనే ఉంది . అభిమానులంతా ముచ్చటగా ‘ మిల్కీ బ్యూటీ ‘ అని పిలుచుకుంటారు . కాని , దక్షిణాదిలో ప్రద ర్శించిన దూకుడు ఉత్తరాదిలో ఊపందుకో లేకపోయింది . నిజానికి హిందీలోనే తొలిచిత్రం చేసింది . అదికాస్తా బాక్సాఫీస్వద్ద పరాజయం పాలై , అక్కడ అవకాశాలు రాలేదు . ఇటువైపుకు వచ్చేసి దూసుకుపోయింది . ఐనా అడపాదడపా ఉత్తరాదిపై మోజు ప్రదర్శిస్తూనే ఉంటుంది . ‘ బోలే చూడియా ‘ సినిమా ఇప్పటికే పూర్తిచేసింది . ‘ బబ్లీ బౌన్సర్ ‘ అనే మరో హిందీ సినిమా కూడా చేస్తోంది .