Politics

బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? – TNI రాజకీయ వార్తలు

బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? – TNI రాజకీయ వార్తలు

* గడిచిన మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబుకు రాష్ట్రం గుర్తు వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019లో చంద్రబాబును ప్రజలు బాదారని గుర్తుచేశారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉన్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. అప్పన్న ఆలయంలో వీడియో తీసిన వారికి బుద్ధి ఉండాలని మండిపడ్డారు. సింహాచలం వీడియో ఘటనపై విచారణ చేసి, నిజనిజాలు వెల్లడిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

*చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే.. జగన్ జనం కోసం పని చేస్తున్నారు: Amarnath
విశాఖనగరంలో ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ కార్యాలయాన్ని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే.. జగన్ మోహన్ రెడ్డి జనం కోసం పని చేస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్ నెట్ అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వర్క్‌ను ఎనర్జీ విభాగం నుంచి పరిశ్రమల విభాగానికి మార్చడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 10 లక్షల కనెక్షన్లు ఏపీలో ఫైబర్ నెట్ వర్క్ ద్వారా అందిస్తున్నామని, ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

*Jagan పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: Buddha Venkanna
ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ state జనరల్ సెక్రటరీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనన్నారు. అన్ని ధరలూ పెంచి ప్రజలపై జగన్‌ భారం మోపారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్.. బీహార్‌ను మించిపోయిందని, ఈ ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడ్డానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు.సీఎం జగన్‌ను విజయ సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు కాబట్టే…ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు. మద్యం షాపులు దగ్గర గూగుల్ పే ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎక్కడా లేని పన్నులు వేస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక రాక్షసుడా? అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని బుద్దా వెంకన్న అన్నారు.

*వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల- ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్‌ మండిపడ్డారు. గురువారం రోజు పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. ఎమ్మెల్యే ఆర్కే తీరుపై పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్‌ ఆరోపించారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా.. ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి కొడుకు యుగంధర్ ఆరోపించారు. దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తమను వేధిస్తున్నాడని యుగంధర్‌ అన్నారు. వైసీపీ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్ తెలిపారు.

*శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: బండి సంజయ్పా
లమూరులో వలసలు లేవని సీఎం కేసీఆర్ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వలసలు ఉన్నాయనీ తానూ నిరూపిస్తే కేసీఆర్ తన కుటుంబంతో సహా రాష్ట్రాన్ని వదిలి పోతారా అని సవాల్ విసిరారు. గ్రూప్ వన్‎లో ఉర్దూను చేర్చడాన్ని వ్యతిరేకమని.. బీజేపీ ఉద్యమిస్తోందన్నారు. పాలమూరు గడ్డ కాషాయ అడ్డాగా ఎప్పుడో రుజువైందని చెప్పారు. పాలమూరులో బీజేపీకి ఆదరణ లభిస్తుంటే కేసీఆర్ కుటుంబానికీ నిద్ర పట్టడంలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్‎, టీఆరెఎస్‎కు చేత కాలేదని ఎద్దేవా చేశారు. చెక్ డామ్‎ల పేరుతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు రూ.120 కోట్లు.. ఇసుక పేరుతో మరొకరు వంద కోట్ల రూపాయలు సంపాదించారని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని బండి సంజయ్ తెలిపారు.

*డబుల్ ఇంజన్ సర్కార్‌ వస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ
పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించకుంటే తెలంగాణ వచ్చేదా.. ఆయన సీఎం అయ్యేవారా అని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. మంగళవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టోగా రూపొందిస్తామని అరుణ తెలిపారు.

*తెలంగాణ ప్రజలకు Kcr పంగనామాలు
రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి Cm Kcrకి చేతకావడం లేదా..? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని ysrtp అధ్యక్షురాలు YS Sharmila ప్రశ్నించారు. మంగళవారం దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొని మీడియాతో మాట్లాడారు.. ‘‘ ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం అయితే… నిరుద్యోగానికి కారణం కేసీఆర్. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.చదువుకున్న పిల్లలు గాలికి తిరగాలి… చేతకాని ముఖ్యమంత్రి బోగాలు అనుభవించాలి. పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి.. చదువుకున్న బిడ్డలు నాశనం అవ్వాలి.పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల పోరాటం చేశాం.25 వారాలుగా నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్నాం.మేము ఉద్యమం చేశాకే ప్రభుత్వానికి ఉద్యోగాలపై సోయి వచ్చింది. ఎవరికోసం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు.ఎవరి కోసం ఆలోచన చేస్తున్నారు.

*టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్ల నియామకం
తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్లను నియమించింది. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు 30మంది కన్వీనర్ల పేర్లును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం రాత్రి ప్రకటించారు. కొండా శంకర్‌రెడ్డి(ఇచ్ఛాపురం), రాగోలు నాగశివ(శ్రీకాకుళం), గోడి నరసింహాచారి(విశాఖసౌత్‌), మళ్ల సురేంద్ర(అనకాపల్లి), వనపర్తి వీరభద్రరావు(ప్రత్తిపాడు), పెండ్ర రమేష్‌(పి.గన్నవరం), కుడిపుడి సత్తిబాబు (రాజమండ్రి సిటీ), కొప్పాడ రవీంద్రనాధ్‌ఠాగూర్‌(నర్సాపురం), చలమోలు అశోక్‌గౌడ్‌(దెందులూ రు), శుక్లబోయిన వెంకట సత్యనారాయణ(పోలవరం), బలే ఏసురాజు(కైకలూరు), అక్కు మహంతి నాగేశ్వరరావు(మచిలీపట్నం), జంపాన శ్రీనివాసరావు(పెనమలూరు), మరుపిళ్ల తిరుమలే్‌ష(విజయవాడ వెస్ట్‌), ఎన్సీ భానుసింగ్‌ (విజయవాడ సెంట్రల్‌), ఎర్రబోతు రమణరావు(విజయవాడ సెంట్రల్‌), ధూళిపాళ్ల ఏసుబాబు(తాడికొండ), కావటి వేణుగోపాల్‌(తెనా లి), తుపాకుల అప్పారావు (చిలకలూరిపేట), గుర్రపుశాల రామకృష్ణ(నరసరావుపేట), పల్లెకొండలక్ష్మణరావు(నెల్లూరు సి టీ), సీఎస్‌ త్యాగరాజన్‌(చిత్తూరు), జి. మునిరాజు(కుప్పం), పెరంబదూర్‌ హరికృష్ణ(కడప టౌన్‌), ఎటగిరి రాంప్రసాద్‌(కడపటౌన్‌), వై నాగేశ్వరయాదవ్‌(డోన్‌), పూల నాగరాజు (రాయదుర్గం), బి.వెంకట నారాయణ(ధర్మవరం), డి.వి.రమణ(రాప్తా డు), పల్లా లక్ష్మీకుమార్‌(హిందూపురం)లను నియమించారు.

* ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు జంకుతుంది: MLA Swamy
రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఆస్పత్రిలో కలిసేందుకు టీడీపీ నేతలని అనుమతించకుండా వైసీపీ ప్రభుత్వం ఎందుకు జంకుతుందో అర్థం కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని బాలవీరాంజనేయస్వామి , ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మీడియాతో మాట్లాడుతూ.. వైద్యం బాగానే అందుతుందని బాధితురాలు చెప్పిందన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితురాలికి 10 లక్షలు ఆర్థిక సాయం, ఐదు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలపై నిందితులు ఎవరున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరపున బాధితురాలికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పంపిన రెండు లక్షల చెక్కును బాధితురాలికి టీడీపీ నాయకులు అందజేశారు.

*ఐదేళ్లు మంత్రిగా ఉండి Jawahar ఏం చేశారు :Mlc Sabzi
మాజీ మంత్రి జవహర్ Cps రద్దు విషయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి మీరు ఏం చేశారని యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి నిలదీశారు. మంగళవారం షేక్ సాబ్జి మీడియాతో మాట్లాడుతూ.. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో అనేక పోరాటాలు చేశామన్నారు.చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్న తమను ప్రోత్సహించాలే కాని విమర్శలు చేయడం తగదన్నారు. ‘మీకు చేతనైతే మీ పార్టీ ద్వారానో వేరే సంఘాల ద్వారా ర్యాలీలు, నిరసనలు చేసి సహకరించండి. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం’ అని అన్నారు. జగన్ మాటలను నమ్మి ఉద్యోగులంతా గంపగుత్తగా ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. కాని జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వెంటనే తన పదవీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జి డిమాండ్ చేశారు.

*కృష్ణుడు చూపిన మార్గంలో యాదవులు నడవాలి: కేంద్ర మంత్రి నిత్యానంద్‌
యాదవులంతా శ్రీకృష్ణుడు భగవద్గీతలో సూచించిన మార్గంలో నడిచి సమాజాభివృద్ధిలో భాగం కావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ పేర్కొన్నారు. ప్రతీ యాదవ విద్యావంతుడు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని చదివించాలని పిలుపునిచ్చారు. యాదవ విద్యావంతుల వేదిక, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖల ఆధ్వర్యంలో నాగోల్‌లో మంగళవారం జరిగిన యాదవ ఆత్మగౌరవ సభలో నిత్యానందరాయ్‌ పాల్గొన్నారు. పశుసంపదను వృద్ధి చేసే గొప్ప సంస్కృతి యాదవులకు ఉందని, నేడు గోమాతలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. యాదవుల్లో ఐక్యత పెరగాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, సదర్‌ ఉత్సవాలను ప్రతీ గ్రామంలో పెద్దఎత్తున నిర్వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ కూడా యాదవులను ప్రోత్సహిస్తున్నారని, సుమారు రూ.250 కోట్ల విలువైన స్థలాన్ని, రూ.5 కోట్ల నిధులను కేటాయించారని వివరించారు. యాదవ విద్యార్థుల కోసం హాస్టల్‌ నిర్మాణానికి యాదవ విద్యావంతుల వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. యాదవులు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఏఐసీసీ ఓబీసీ చైర్మన్‌ అజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

*రాహుల్‌ ఓయూకు వచ్చి పబ్‌ల గురించి చెబుతారా?: మంత్రి ఎర్రబెల్లి
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్‌ల గురించి విద్యార్థులకు చెబుతారా? ఆయన ఓయూకు రావాల్సిన అవసరం ఏముంది? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. మంగళవారం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీ ఓయూను సందర్శించే విషయంలో అనుమతి గురించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనుమతి ఇవ్వడం వీసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ చేపట్టే సభతో ఒరిగేది ఏమిలేదని, ఉనికికోసం ఆ పార్టీ తాపత్రయ పడుతోందన్నారు. మహబూబ్‌నగర్‌లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉపాధి హామీ పనులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. నిధులు ఇవ్వాల్సిన కేంద్రాన్ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

*టీడీపీ వేసిన అభివృద్ధి పునాదులపైనే తెలంగాణ పురోగతి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ వేసిన అభివృద్ధి పునాదుల మీదే తెలంగాణ పురోగతి సాధిస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై టీటీడీపీ నాయకులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ చేసిన అభివృద్ధి గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నేతలకు నిర్దేశించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షించేందుకు ఒక కమిటీ వేయాలని సూచించారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించి కొత్తవారిని ఆహ్వానించాలని చెప్పారు. 7 లక్షల పైచిలుకు ఉన్న పార్టీ సభ్యత్వాన్ని కనీసం 10 లక్షలకు పెంచడానికి శ్రద్ధ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు కోరారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కార్యకర్తల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ టీడీపీ అని పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. 4 వేల మందికిపైగా కార్యకర్తల కుటుంబాలకు బీమా ద్వారా రూ.100 కోట్ల మేరకు ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు.

*రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత మోదీదే: NVSS
రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రైతుల కోసమే రాహుల్ వస్తున్నాడంటే నవ్వుకుంటున్నారని అన్నారు. 1500 మంది యువకుల ఆత్మహత్యకు కారణమైన రాహుల్ ఏ మొహం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని ప్రశ్నించారు. ఏనాడూ తెలంగాణ అంశాన్ని పార్లమెంటులో రాహుల్ మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతోందని తెలిపారు. 5న జేపీ నడ్డా మహబూబ్ నగర్‌లో జరిగే సభకు, 14న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వెల్లడించారు.

* బండి సంజయ్ జూటా మనిషి: Errabelli
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ జూటా మనిషి అని… బీజేపీ జూటా పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడం లేదన్నది నిజమే… కానీ ఆ డబ్బులు ఇచ్చేదెవరూ…? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. నేరుగా ఉపాధి కూలీల డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడతాయని… రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపుతుందని నిలదీశారు. ఉపాధి హామీ పనుల నిధులపై చర్చకు సిద్ధమా..? అని మంత్రి సవాల్ విసిరారు. బండి సంజయ్‌వి అబద్దపు మాటలన్నారు. బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై బండి సంజయ్‌కు అవగాహన లేదన్నారు. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా తెలంగాణలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.