NRI-NRT

గ్రీన్‌ వీసా ఉంటే ఐదేళ్ల ‘నివాస హోదా’.. పర్యాటక వీసాపై 180 రోజులు ఉండొచ్చు

గ్రీన్‌ వీసా ఉంటే ఐదేళ్ల ‘నివాస హోదా’.. పర్యాటక వీసాపై 180 రోజులు ఉండొచ్చు

ప్రపంచంలోని పలు రంగాల నిపుణులను ఆకర్షించేందుకు, తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వీసా నిబంధనలను సరళతరం చేసింది. అలాగే, ఉద్యోగాల కోసం వచ్చే వారి కోసం చట్టబద్ధ ‘నివాస హోదా’ విషయంలోనూ సులభతర నిబంధనలనూ ప్రవేశపెట్టినట్లు యూఏఈ బుధవారం ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్‌ వీసా ఉన్నవారితో పాటు పలు రంగాల నిపుణులు యూఏఈలో ఐదేళ్ల ‘నివాస హోదా’ పొందుతారు. ఇంతకు ముందు ఈ ‘నివాస హోదా’ గడువు రెండేళ్లుగానే ఉండేది. అలాగే, ఐదేళ్ల గడువు ఉండే పర్యాటక వీసాపై యూఈఏకి విదేశీయులు పలుసార్లు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. వారు ఏడాదికి వరుసగా 90 రోజుల చొప్పున యూఏఈలో ఉండొచ్చు. అంతేగాక, మరో 90 రోజులు ఆ వ్యవధిని పొడిగించుకునే అవకాశాన్ని కొత్తగా కల్పిస్తున్నారు.