DailyDose

గంజి ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు – TNI నేర వార్తలు

గంజి ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు – TNI  నేర వార్తలు

* జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడు బజారయ్యను అరెస్టు చేసినట్లు చెప్పారు. జి.కొత్తపల్లిలో ఆధిపత్యపోరు వల్లే గంజి ప్రసాద్‌ను హత్య చేశారన్నారు. గత నెల 26న నిందితుడు సురేష్ కత్తులను సేకరించాడని, గంజి ప్రసాద్‌ను హత్య చేయడానికి రెండు రోజులు నిందితుడు నాగార్జున రెక్కీ నిర్వహించాడని తెలిపారు. బజారయ్య ప్రోద్బలంతోనే ముగ్గురు నిందితులు హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. గంజి ప్రసాద్ హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని, విచారణ తర్వాత వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు.

*శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి హెరాయిన్‌ (Heroin) పట్టుబడింది. జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద మత్తుమందు పట్టుబడింది. గత నెల 26న జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి ఓ ప్రయాణికుడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో పట్టుకున్నారు. నిందితుడు 108 క్యాప్సూల్స్‌ మింగినట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో వాటిని వెలికితీశారు. అవి 1389 గ్రాముల బరువు ఉన్నాయని, వాటి విలువ రూ.11.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామన్నారు.

*ఓ సైబర్ నేరగాడి చేతిలో.. కర్నూలు ఎంపీ మోసపోయారు. ఆయన ఖాతా నుంచి రూ.97 వేలు క్షణాల్లో ఖాళీ అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్న సైబర్ నేరస్థుడు.. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు. కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌.. సైబర్‌ నేరగాడి వలలో పడి మోసపోయారు. మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిందని, వెంటనే పాన్‌ నంబరుతో జత చేసి అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్‌ నంబరు నుంచి ఆయన సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారంతో పాటు లింకు వచ్చింది. ఆయన దానిని నమ్మి లింకులో వివరాలను నమోదు చేసి పంపగా.. ఓటీపీ నంబర్లు వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు.ఆ వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700 ఒకసారి,.. రూ.48,999 మరోసారి డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారాలు వచ్చాయి. అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్‌ చేయగా అసలు విషయం తెలిసింది. దాంతో సైబర్‌ నేరగాడు తనను మోసగించి మొత్తం రూ.97,699 తన ఖాతా నుంచి కాజేసినట్లు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*హైదరాబాద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం మోదినిగూడెంలో పిడుగుపాటుకు లింస్వామి అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం నరేండ్లగడ్లలో పిడుగుపడి రైతు మరణించాడు. ధాన్యంపై టార్పాలిన్‌ కప్పుతుండగా పిడుగుపడి పోచయ్య మృతిచెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు.మద్దూరు మండలంలోని వంగపల్లిలో ఎర్రబచ్చల బిక్షపతి అనే రైతుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగుపాటుకు మరణించాయి. వీటివిలువ సుమారు రూ.లక్షా 50 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి

*కారుకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వాడకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.200 ఫైన్‌ విధించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 05 బీవీ 0666 బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ ఉండడంతో కారును నిలిపారు. అందులో నుంచి దిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ వాడనందుకు రూ. 200 ఫైన్‌ విధించారు. ఈ సందర్భంగా మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను కృష్ణారెడ్డి అభినందించారు.

*సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంకు చెందిన ఆటో డ్రైవర్ వినయ్(27) దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లపూర్ రైల్వే కల్వర్ట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆటో చోరీ విషయంలో వినయ్‌ను ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. *శ్రీ సత్య సాయి: జిల్లాలోని రామగిరి మండలం శేషంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కవిత అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి మహిల… ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామ శివారులోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డింది. మృతులు కవిత(26), సింధు(5), తేజ(3)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని… పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*గన్నవరం మండలం చిన్న అవుటపల్లి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారు పల్టీలు కొట్టింది. ముందు వెళ్తున్న పాల ఆటోను ఢీకొట్టి..ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, హోటల్ నిర్వాహకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి కాసేపటికే విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఏలూరు జిల్లాలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ హత్య, ఆ తరువాత జరిగిన ఘటనల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ద్వారకాతిరుమల ఎస్‌ఐ వెంకట సురేశ్‌ను సస్పెండ్‌ చేశారు. భీమడోలు సీఐ సుబ్బారావుకు చార్జి మెమో ఇచ్చారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 30న ద్వారకాతిరుమల మండ లం జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్‌ దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు ఈ హత్య చేయించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై స్థానికులు దాడి చేశారు. గ్రామంలో నెలకొన్న వర్గపోరుపై ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలున్నాయి.

*బాలికపై అత్యాచారా నికి పాల్పడిన యువకుడు పీఎంపీ వేగి రమేష్‌పై కేసు నమోదు చేసినట్టు నగరం ఇన్‌చార్జి ఎస్‌ఐ కృష్ణమాచారి తెలిపారు. మండలంలోని ఓ గ్రామా నికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలికకు బి.దొడ్డవరానికి పీఎంపీ వైద్యుడు వేగి రమేష్‌ మాయమాటలు చెప్పి సోమవారం రాత్రి నాన్న మ్మతో నిద్రిస్తున్న సమయంలో బాలికపై అత్యా చారం చేశాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో బాలిక తండ్రి రమేష్‌ను పట్టుకున్నాడు. జరిగిన సంఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు నగరం ఏఎస్‌ఐ ఎస్‌.అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

*కడప జిల్లాలో ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బంధువులు, స్థానికుల కథనం మేరకు.. మాలేపాడుకు చెందిన మేకల రవితేజ రెడ్డి (26), అతని తల్లి దస్తగిరమ్మ, మరికొందరితో కలిసి మాలేపాడు-నిడుజువ్వి రస్తాలో ఉన్న పొలానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌లో వస్తుండగా చెంచెన్న కోనేరు మోరీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న రవితేజ రెడ్డి, కొందరు మహిళలు ఎగిరి కిందపడ్డారు. ఈ క్రమంలో తలపై టిప్పర్‌ ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ అరబండి ఓబులమ్మ(25)తో పాటు, మరో ఇద్దరిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. ఓబులమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కలమల్ల ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.*పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించారం టూ కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 25 మంది టీచర్లు, ఒక అటెండర్‌, కర్నూలు జిల్లాలో ఐదుగురు యువకులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. వివరాలు… ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు జెడ్పీ పాఠశాలలో లెక్కల టీచరుగా పనిచేస్తున్న బి.రత్నకుమార్‌ వాట్సప్‌ నంబరు నుంచి కృష్ణాజిల్లా పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసే టీచర్లకు ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జవాబులతో కూడిన కాపీలను పసుమర్రు పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న డోకిపర్రు ఉన్నత పాఠశాలకు తీసుకువెళ్తున్నట్టు వెల్లడైంది. మండవల్లి పాఠశాలలో పనిచేసే 8మంది టీచర్లు ప్రశ్నలకు జవాబులు రాసి, వాటిని ప్రింట్లు తీసి అటెండర్‌ ద్వారా ప్రతి గదికి తీసుకువెళ్లి విద్యార్థులకు ఇస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో పసుమర్రుకు చెందిన ఆరుగురు, మండవల్లికి చెందిన ఒక ఉపాధ్యాయుడిని సోమవారమే సస్పెండ్‌ చేశారు. నిందితులకు ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. కాగా, టెన్త్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించారంటూ ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు 10మంది ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14రోజులు రిమాండ్‌ విధించారు. కాగా, కర్నూలు జిల్లాలో టెన్త్‌ గణిత ప్రశ్నపత్రం లీకైన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజులు తెలిపారు. ఆలూరు మండలం మరకట్టు గ్రామానికి చెందిన కృష్ణతో పాటు కురవళ్లి, ఆలూరు ప్రాంతాలకు చెందిన వెంకటేశ్‌, ఉమ, అజిత్‌, నాగేశ్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

* పటమటలంకలో మృతదేహం కలకలం సృష్టించింది. పార్కింగ్ చేసిన CARలో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కారు డోర్ ఓపెన్ చేసి చూడగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. AP37 BA 5456 ఇండిగా కారుగా గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే కారులో మృతదేహం ఉన్న తీరును బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మూడు రోజులుగా రహదారిపై కారు నిలిచి ఉందని స్థానికులు అంటున్నారు. పెట్రోలింగ్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు.

*చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం ఎం కొత్తూరులో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. *ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇద్దరిని ఢీకొనడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై ఓ కారు డ్రైవర్‌ దాడి చేశాడు. జిల్లా కేంద్రమైన భీమవరంలోని బీవీ రాజు పార్క్‌ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గునుపూడికి చెందిన బొబ్బనపల్లి ప్రభుసంతోష్‌ రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఇద్దరిని గాయపరిచాడు. అయినప్పటికీ అదే వేగంతో వెళ్లిపోతుండగా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సతీ్‌షకుమార్‌ చూసి ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్‌ సంతోష్‌.. ఏ ఊరు నుంచి వచ్చా వంటూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడిచేశాడని వన్‌టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్‌కు చికిత్స చేయించి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

*ఏలూరు జిల్లాలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ హత్య, ఆ తరువాత జరిగిన ఘటనల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ద్వారకాతిరుమల ఎస్‌ఐ వెంకట సురేశ్‌ను సస్పెండ్‌ చేశారు. భీమడోలు సీఐ సుబ్బారావుకు చార్జి మెమో ఇచ్చారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 30న ద్వారకాతిరుమల మండ లం జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్‌ దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు ఈ హత్య చేయించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై స్థానికులు దాడి చేశారు. గ్రామంలో నెలకొన్న వర్గపోరుపై ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలున్నాయి.

*మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్న కొడుకును తండ్రి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేశాడు. రంజాన్‌ పండుగ రోజు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌ఎల్వీ టాకీస్‌ వెనకనివాసం ఉంటున్న షేక్‌ జాఫర్‌ సాబ్‌కు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. ఆయన వయసు సుమారు 92 ఏళ్లు. వడ్రంగి పనిచేస్తూ, ఐదో కుమారుడు షేక్‌ ఖలీల్‌ (42)తో కలిసి ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌ అయిన ఖలీల్‌కు గుంతకల్లు పట్టణానికి చెందిన షకీలా బానుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. మూడేళ్ల కిత్రం భార్యకు ఖలీల్‌ విడాకులిచ్చాడు. పిల్లలు తల్లితోనే ఉంటున్నారు. ఖలీల్‌ మాత్రం తండ్రితో ఉంటూ.. మద్యానికి డబ్బులివ్వాలని రోజూ గొడవ పడేవాడు. లేదంటే చంపుతానని బెదిరించేవాడు. ఇటీవల ఆటో కూడా మానేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఖలీల్‌ మద్యం సేవించి వచ్చి భోజనం కావాలని తండ్రితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి షేక్‌ జాఫర్‌సాబ్‌, పక్కన ఉన్న ఇనప రాడ్‌తో ఖలీల్‌ తలపై మోదాడు. తీవ్రంగా గాయపడిన ఖలీల్‌, అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం జాఫర్‌సాబ్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

*తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి భార్యాభర్తలు మృతి చెందారు. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ పరిధి కంఠబౌంసుగుడ గ్రామానికి చెందిన గొల్లోరి డొంబుదొర (37), భార్య పార్వతి (35), కుమార్తె వింధ్య (3)తో కలిసి నాలుగేళ్లుగా ఎలక్ట్రికల్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. డొంబుదొర జీసీసీ సోప్‌ యూనిట్‌లో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగె (పక్క క్వార్టర్‌ సర్వీస్‌ వైర్‌) తగలడంతో బిగ్గరగా అరిచి కింద పడిపోయాడు. ఆ కేక విని పార్వతి పరుగున వెళ్లి భర్తను పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. స్థానికులు వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపి వేసి వారిద్దరినీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా పార్వతి గర్భిణి అని తెలిసింది.

*చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం ఎం.కొత్తూరులో మంగళవారం సాయంత్రం పిడుగు పాటుకు ఎం.బుజ్జమ్మ(45), వై.బుజ్జమ్మ(40) మృతిచెందారు. వీరిద్దరూ పొలంలో ఉన్న సమయంలో ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది. వీరి సమీపంలోనే పిడుగు పడటంతో వై.బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. అపస్మారకస్థితిలో ఉన్న ఎం.బుజ్జమ్మను గ్రామస్థులు తీర్థం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

*కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక పర్యాటక ప్రాంతంలో గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు వలంటీర్లు ప్రమాదవశాత్తు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి రాజ్యలక్ష్మి (22), జుట్టా శ్రీదేవి (23) గ్రామ సచివాలయాల్లో వలంటీర్లుగా చేస్తున్నారు. మంగళవారం ఉదయం మరో వలంటీరు కన్నా మార్కండేయ మనోజ్‌కుమార్‌(23)తో కలిసి వాకింగ్‌ చేసుకుంటూ పిచ్చుకలంక చేరుకున్నారు. గోదావరి స్నానం చేస్తూ గల్లంతయ్యారు. మనోజ్‌కుమార్‌ స్థానికులకు, బంధువులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సహాయంతో గాలింపు చేపట్టగా, సాయంత్రానికి రాజ్యలక్ష్మి, శ్రీదేవి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

*కడప జిల్లాలో ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బంధువులు, స్థానికుల కథనం మేరకు.. మాలేపాడుకు చెందిన మేకల రవితేజ రెడ్డి (26), అతని తల్లి దస్తగిరమ్మ, మరికొందరితో కలిసి మాలేపాడు-నిడుజువ్వి రస్తాలో ఉన్న పొలానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌లో వస్తుండగా చెంచెన్న కోనేరు మోరీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న రవితేజ రెడ్డి, కొందరు మహిళలు ఎగిరి కిందపడ్డారు. ఈ క్రమంలో తలపై టిప్పర్‌ ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ అరబండి ఓబులమ్మ(25)తో పాటు, మరో ఇద్దరిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. ఓబులమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కలమల్ల ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఆవును చంపారనే అనుమానంతో ఆదివాసీ కుటుంబంపై 15-20 మంది వ్యక్తులు కోపంతో రగిలిపోయారు. వారి ఇంటికి వెళ్లి మరీ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆదివాసీ కుటుంబంలో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకరు ఆస్పత్రిలో చికత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాఽధితుల ఇంట్లో 12 కిలోల మాంసం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి సంబంధించి అనుమానితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు