Movies

లైంగిక వేధింపులపై పోరాటం

Auto Draft

క్రీడారంగంలో జరుగుతున్న అన్యాయాలు, లైంగికవేధింపులపై ఓ యువతి చేసిన పోరాటం కథాంశంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘జనతాబార్‌’. రాయ్‌లక్ష్మిప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌లోగోని, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతరమణ మొగిలి మాట్లాడుతూ ‘నాలుగు పాటలు మినహా చిత్రం పూర్తయింది. ఈ నెల ఎనిమిది నుంచి రామోజీఫిల్మ్‌ సిటీలో ఆ పాటలను చిత్రీకరిస్తాం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈచిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా ఉంది. రాయ్‌లక్ష్మి పాత్ర, ఆమె నటనప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి’ అని తెలిపారు.  శక్తి కపూర్‌, ప్రదీప్‌ రావత్‌, సురేశ్‌, అనూష్‌ సోని, అమన్‌ ప్రీత్‌, భూపాల్‌రాజ్‌, విజయభాస్కర్‌, దీక్షాపంత్‌తదితరులు ఈ చిత్రంలో నటించారు.