Movies

థ్రిల్లింగ్‌గా ఉంది..

Auto Draft

తన రాబోయే చిత్రాలన్నీ ఆసక్తికర కథలలోతెరకెక్కుతుండటం థ్రిల్లింగ్‌గా ఉందని చెబుతున్నది బాలీవుడ్‌ నాయిక కియా రాఅద్వానీ. ఈ సినిమాలన్నీ తనకు నటి గా పేరుతో పాటు బాక్సాఫీస్‌ విజయాలను అందిస్తాయనిఆమె నమ్ముతున్నది. ‘కబీర్‌ ‘గుడ్‌న్యూస్‌’, ‘లక్ష్మీ’, ‘ఇందూకీ జవానీ’,‘షేర్షా’లాంటి చిత్రాలన్నీ ఆమెను బిగ్‌ లీగ్‌లోచేర్చాయి. ఈ క్రేజ్‌ను మరింత పెంచేలా తన కొత్త సినిమాలు ఉండటం సంతోషాన్నిఇస్తున్నదని చెబుతున్నదీ తార. తాజాగా కియారా అద్వానీ మాట్లాడుతూ…‘నాకొత్త సినిమా ‘భూల్‌ భులయ్యా 2’ రిలీజ్‌కురెడీగా ఉంది. ఈ నెల 20న తెరపైకి వస్తున్నది. చిత్రీకరణలో ఉన్న ‘గోవింద్‌నామ్‌ మేరా’, ‘జుగ్‌ జుగ్‌ జీయో’ సినిమాలువేటికవి భిన్నమైనవి. ‘గోవింద్‌ నామ్‌ మేరా’ఒకకొత్త తరహా సినిమా. దీన్ని ఫలానా జానర్‌ సినిమా అని పిలవలేం. ఈ ప్రయోగాత్మకచిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. ‘జుగ్‌జుగ్‌ జీయో’మానవ సంబంధాల నేపథ్యంతో సాగే సినిమా. మన కథేఅనిపిస్తుంది. ‘ఆర్సీ 15’నా తొలి పాన్‌ ఇండి యా మూవీ. రామ్‌ చరణ్‌,దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’అనిచెప్పింది.