Business

హోండా నుంచి న్యూ మోడల్‌ కారు – TNI వాణిజ్య వార్తలు

హోండా నుంచి న్యూ మోడల్‌ కారు – TNI వాణిజ్య వార్తలు

*హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ కొత్త మోడల్‌ కారును లాంచ్‌ చేసింది. నాగోల్‌ గ్రీన్‌ హోండా షోరూమ్‌ వద్ద బుధవారం ‘ఈ–హెవ్‌’ మోడల్‌ కారును హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు (హెచ్‌ఎమ్‌ఎస్‌ఎస్‌) ఎండీ ఎం.దానకిశోర్‌ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్‌ హెడ్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్‌’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనమని చెప్పారు. మెయిన్‌ స్ట్రీమ్‌ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్‌తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్‌ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా

*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.

*రెయిన్‌బో హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభించింది. ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 2,05,14,617 షేర్లను విక్రయించాలని నిర్ణయించగా.. 25,49,03,787 (25.49 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలైనట్లు రెయిన్‌బో హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కంచర్ల తెలిపారు. అంటే 12.43 రెట్లు అధికంగా ఇష్యూకు స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగంలో 38.9 రెట్ల షేర్లకు దరఖాస్తు చేశారు. ఈ విభాగంలో 57,75,605 షేర్లుండగా.. 22,46,97,591 షేర్లకు దరఖా స్తు చేశారు. కార్పొరేట్‌ కంపెనీల వంటి సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 3.73 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

*మల్టిపుల్‌ మైలోమా వంటి కొన్ని రకాల కేన్సర్ల చికిత్సలో వినియోగించే బార్టిజోమిబ్‌ ఇంజెక్షన్‌ జనరిక్‌ను అమెరికా మార్కెట్‌లోకి గ్లాండ్‌ ఫార్మా విడుదల చేసింది. ‘వెల్‌కేడ్‌’ బ్రాండ్‌తో అమెరికాకు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్స్‌ విక్రయిస్తున్న ఔషధానికి ఇది బయోఈక్వలెంట్‌ అని కంపెనీ తెలిపింది. 3.5 ఎంజీ/వయల్‌, సింగిల్‌ డోస్‌ వయల్‌ను గ్లాండ్‌ ఫార్మా విక్రయిస్తుంది. మార్చితో ముగిసిన ఏడాదికి అమెరికా మార్కెట్‌లో వెల్‌కేడ్‌ విక్రయాలు 117.2 కోట్ల డాలర్లుంది.

*హైదరాబాద్‌కు చెందిన ఏఐ/ఎంఎల్‌, డేటా ఇంజినీరింగ్‌, అనలిటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌ సేవల కంపెనీ అపరా డిజిటల్‌ను సిగ్నిటీ టెక్నాలజీస్‌ సొంతం చేసుకోనుంది. ‘రౌండ్‌స్క్వేర్‌’ బ్రాండ్‌తో అపరా డిజిటల్‌ సేవలను అందిస్తోంది. 48 లక్షల డాలర్లకు (దాదాపు రూ.36 కోట్లకు) అపరాను కొనుగోలు చేస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్‌ సీఈఓ శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

*మార్చితో ముగిసిన మూడు నెలలకు రెయిన్‌ ఇండస్ట్రీస్‌ రూ.277 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితంతో పోలిస్తే లాభం 34 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2021 ఏడాది మొత్తానికి రూ.580 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

*డాక్టర్‌ రెడ్డీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌సలో ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించారు. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, లారస్‌ ల్యాబ్స్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఫార్మా కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు ఈ హబ్‌లో అత్యాధునిక ఫ్లో కెమిస్ట్రీ ఎక్వి ప్‌మెంట్‌ ఉంటుంది. ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సహ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా పాల్గొన్నారు.

*ఎల్‌ఐసీ బాహుబలి ఐపీఓకు పాలసీదారుల నుంచి అద్భుత స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లు సహా మిగిలిన వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించలేదు. రూ.21,000 కోట్ల ఈ మెగా ఇష్యూ తొలి రోజే పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ అవుతుందన్న మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా తొలి రోజు సాయంత్రానికి 67 శాతం షేర్లకు మాత్రమే బిడ్స్‌ అందాయి. పాలసీదారులు, ఉద్యోగులు మాత్రం ఎగబడ్డారు. దీంతో పాలసీదారుల కోటా 1.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఉద్యోగుల కోటా కూడా పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ అయినట్టు సమాచారం. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా కూడా సగానికిపైగా సబ్‌స్ర్కైబ్‌ అయింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 నుంచి రూ.60 డిస్కౌంట్‌ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం. రూ.902-949 ప్రైస్‌ బ్యాండ్‌తో జారీ చేస్తున్న ఈ ఐపీఓ ఈ నెల 9న ముగుస్తుంది. షేర్లు ఈ నెల 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్టయ్యే అవకాశం ఉంది.

*అంతర్జాతీయ ట్రెండ్‌లకు అనుగుణంగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.134 తగ్గి రూ.50,601 చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. మునుపటి ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం రూ.50,735 వద్ద స్థిరపడింది. వెండి కిలో రూ.62,956 ఉండగా.. రూ.169 తగ్గి రూ.62,787కు చేరుకుంది. రూపాయి బుధవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే 8 పైసలు పెరిగి రూ. 76.40 వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయానికి ముందు RBI రెపో రేటును పెంచింది. COMEX వద్ద స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు డాలర్ 1,869 వద్ద స్వల్పంగా పెరగడంతో యూఎస్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. బుధవారం వెండి ఔన్స్‌కు 22.61 డాలర్లుగా ఉంది.

*మార్చితో ముగిసిన మూడు నెలలకు రెయిన్‌ ఇండస్ట్రీస్‌ రూ.277 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితంతో పోలిస్తే లాభం 34 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2021 ఏడాది మొత్తానికి రూ.580 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

* మూవీ ఈవెంట్స్‌, ప్రమోషన్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేయాస్‌ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపింది. 2011లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో 1,500కు పైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. తాజాగా దుబాయ్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. సమీకరించిన నిధులను పశ్చిమాసియా, అమెరికా సహా భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు శ్రేయాస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. సినిమా ఈవెంట్స్‌కు అనుబంధంగా కొత్త విభాగాల్లో ప్రవేశించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని వివరించారు. కాగా 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్‌, 120 మూవీ ప్రమోషన్స్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

*ప్రింట్‌ మీడియాకు కొత్త ఆర్థిక సంవత్సరం కష్టకాలంగా కనిపిస్తోంది. అడ్వర్‌టైజ్‌మెంట్లు పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్‌ మీడియా ఆదాయాల్లో 25 శాతం వృద్ధి ఏర్పడినా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన న్యూస్‌ ప్రింట్‌ ధరలు లాభదాయకతకు గండి కొడతాయని ఇండియా రేటింగ్స్‌ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ప్రింట్‌ మీడియా రంగంలోని సంస్థల లాభదాయకత 3 శాతానికే పరిమితం కావచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు దిగుమతి న్యూస్‌ ప్రింట్‌ ధర 80ు పెరిగిందని, వచ్చే ఆరు నెలల్లో మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. 2021లో వినియోగించిన న్యూస్‌ప్రింట్‌లో 60ు దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. న్యూస్‌ప్రింట్‌ సరఫరాలో 38ు వాటాతో రష్యా ప్రథమ స్థానంలో ఉండగా 26ుతో కెనడా రెండో స్థానంలో ఉంది. యుద్ధానికి ముందు మన న్యూస్‌ప్రింట్‌ దిగుమతి 52ు ఉంది. ఇది దశాబ్ది కనిష్ఠ స్థాయి. కాగా దేశీయ ఉత్పత్తిదారుల నుంచి న్యూస్‌ప్రింట్‌ సరఫరా పెరగడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని తెలిపింది. దేశం కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకుని పేపర్ల సర్క్యులేషన్‌ పెరగడంతో న్యూస్‌ప్రింట్‌ డిమాండ్‌ కరోనా ముందు కాలం నాటికి పెరిగిపోయిందని పేర్కొంది. దీనికి తోడు ప్రకటనలు కూడా పెరుగుతుండడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో న్యూస్‌ప్రింట్‌ వినియోగం మరింత పెరగవచ్చని నివేదిక తెలిపింది

*నాలుగో త్రైమాసికం లాభం 47 శాతం పెరిగిన నేపథ్యంలో… టాటా స్టీల్ ‘టెన్-టు-వన్’ స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించింది. కంపెనీ బోర్డు మార్చి 31 తో ముగిసిన ఆర్థికసంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 51 డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలోకంపెనీ నికర లాభం రూ. 9,756 కోట్లుగా నమోదైంది. స్టాక్ స్ప్లిట్‌… విభజన నియంత్రణ మరియు చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఉంటుందని, రికార్డు తేదీని బోర్డు నిర్ణయిస్తుందని, ఎక్స్ఛేంజీలకు త్వరలోనే తెలియజేస్తామని టాటా స్టీల్ మంగళవారం వెల్లడించింది. కాగా… స్టాక్ స్ప్లిట్ నేపథ్యంలో రిటైల్ పెట్టుబడిదారులకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని భావిస్తున్నారు.