NRI-NRT

కువైత్‌లో ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరలు

కువైత్‌లో  ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరలు

గల్ఫ్ దేశం కువైత్‌లో విమాన ఛార్జీలు ఆకాశాన్నంటాయి. కొన్ని రూట్లలో విమాన టికెట్ల ధరలు ఏకంగా 70 నుంచి 150 శాతం వరకు పెరగడం గమనార్హం. ఈ ఏడాది సుదీర్ఘ సెలవుల నేపథ్యంలో కువైత్ నుంచి భారీ సంఖ్యలో ప్రయాణీకులు యూకే, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్‌కు వెళ్లారు. దీంతో ఆయా మార్గాల్లో విమాన టికెట్ ధరలకు ఆటోమెటిక్‌గా బాగా డిమాండ్ పెరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణికులు వివిధ దేశాలకు రాకపోకలు కొనగసాగించడంతో ఇలా ఒక్కసారిగా విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చేశాయని కువైత్ ఎయిర్‌వేస్ కార్పొరేషన్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ వేల్ అల్ హసావి తెలిపారు. ఇక ఈద్ సందర్భంగా ఏర్పడిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రూట్లలో డిమాండ్‌ను తగ్గట్లుగా విమానాల సంఖ్యను పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు 2,800 విమాన సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు