Politics

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది – TNI రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్ కంస మేనమామ లా, శకుని మేనమామలా తయారయ్యారన్నారు. 3, 4, 5 తరగతులను ఎలిమెంటరీ విద్య నుంచి విడగొట్టి హైస్కూల్ విద్యలో కలపడం ఒక పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. దీని వలన డ్రా పౌట్స్ పెరుగుతాయన్నారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఒక చారిత్రిక తప్పిదమని అన్నారు. మాతృ భాష అయిన తెలుగు.. మృత భాష అవుతుందన్నారు. పదో తరగతి పరీక్షల్లో లీకేజీలు, మాస్ కాపింగులు నిత్య కృత్యమయ్యాయని, దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతులను హై స్కూల్ విద్యలో విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

*హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు
జగన్ అసమర్థత పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మానవత్వం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మానవత్వం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా సంగంలో ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం దురదృష్టకరమన్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు వరుస సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. హృదయం లేని జగన్ రెడ్డి పరిపాలనలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్విట్టర్లో చంద్రబాబు దుయ్యబట్టారు.

*నేరస్తులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా నడుస్తోంది: వర్ల రామయ్య
రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయని..నేరస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయని..నేరస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. రేపల్లె ఘటనలో ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శకు వెళ్లిన వర్లను అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగటంతో అనుమతిచ్చారు. బాధితులకు పరిహారం ఎంత ఇచ్చారో కూడా తెలియదన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. హోంమంత్రి వనిత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

*విద్యార్థుల భవిష్యత్తుతో.. జగన్ చెలగాటమాడుతున్నారు: ప్రత్తిపాటి
ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. విద్యాదీవెన నిధుల్ని కళాశాలలకు, తల్లిదండ్రులకు సక్రమంగా ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు.విద్యాదీవెన నిధుల్ని కళాశాలలకు, తల్లిదండ్రులకు సక్రమంగా ఇవ్వకుండా సీఎం జగన్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నిర్వాకంతో 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆరోపించారు. దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం న్యాయస్థానం ఆదేశాలను తుంగలోతొక్కిన వైకాపా ప్రభుత్వం.. అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో వెళుతోందని మండిపడ్డారు.18 ఎంపీటీసీ స్థానాలకు తెదేపా 9, జనసేన 1 స్థానం గెలిస్తే.. వైకాపాకు ఎంపీపీ పీఠం ఎలా దక్కుతుందని పుల్లారావు ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసి ఎంపీపీ పీఠం దక్కించుకున్నా.. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే తీరుతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డిలో నిరాశానిస్పృహలు, అసూయద్వేషాలు పెరిగిపోబట్టే.. ప్రతిపక్షంపై, ప్రసారమాధ్యమాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు

*హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడితే… యాదాద్రి గుడి కూలిపోయేది: Komatireddy
నిన్నటి వర్షానికి యాదగిరి గుట్ట వద్ద రోడ్లు కొట్టుకుపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. గతేడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడితే యాదగిరిగుట్ట గుడి కూడా కూలిపోయేదని అన్నారు. రెండు గంటల వర్షానికే క్యూ లైన్లు, రోడ్లు, గుడికి ఎదురుగా ప్రాంతం జలమయమైందని తెలిపారు. ఎనిమిదేళ్లుగా ఇరవై సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ ఏం పరిశీలించారని ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్ డైరెక్టర్‌కు పని అప్పగించి మంచి యాదగిరిగుట్టను రెండు వేల కోట్లు రూపాయలతో నాశనం చేశారని విరుచుకుపడ్డారు. యాదాద్రి పనులపైన సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు… దోచుకుంది ఎవరు, నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాయనున్నట్లు తెలిపారు. ఈఓ గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరువు తీశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు

*ఇలాంటి ఘటన ఇంట్లో జరిగితే.. ఇలాగే మాట్లాడతారా? – లోకేశ్
ఆడబిడ్డలు బలైపోతుంటే సీఎం జగన్ రెడ్డి మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మండిపడ్డారు. ఆడబిడ్డలు బలైపోతుంటే సీఎం జగన్ రెడ్డి మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మండిపడ్డారు. ఇలాంటి ఘటన ముఖ్యమంత్రి ఇంట్లో జరిగితే.. ఇంతే వెటకారంగా మాట్లాడతారా అని నిలదీశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి పెంపకంలో తేడా వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళల్ని అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.

*బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. బుధవారం ఆయన.. మహబూబ్‌నగర్‌లో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. అరగంట పాటు చర్చలు జరిపారు. అంతకుముందు బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డితో మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం జితేందర్‌రెడ్డితో కలిసి సంజయ్‌ వద్దకు వెళ్లారు. తండ్రీ, కొడుకులు (కేసీఆర్‌, కేటీఆర్‌)లను గట్టిగా ఎదుర్కొనేలా పాదయాత్ర సాగుతోందని విశ్వేశ్వర్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. పాదయాత్ర అద్భుతంగా సాగుతోందని.. కొనసాగించాలని సూచించారని పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్‌నగర్‌లో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి విశ్వేశ్వర్‌రెడ్డికి బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ‘నా చేరిక బీజేపీ చేతల మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ భేటీపై కొండా ఆచితూచి మాట్లాడారు. బీజేపీ ఇంకా పుంజుకుంటే అనేకమంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నెల 14న సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభ తుక్కుగూడలో జరుగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రానున్నారు. ఆయన సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి.. బీజేపీలో చేరతారని సమాచారం. అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా కమలం పార్టీలో చేరతారని తెలుస్తోంది.

*Vizagలో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతాం: Chandrababu
తన కాన్వాయ్‌ నిలిపివేయడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని, తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్‌లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని Chandrababu హెచ్చరించారు.

*అది విద్యా దీవెన కాదు… వంచన..: MP Raghurama
అది జగనన్న విద్యా దీవెన కాదని, వంచన అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వసతి దీవెన కూడా సగం మాత్రమే వస్తోందని, చాలా మందికి బెనిఫిట్ రావడం లేదని అన్నారు. తల్లి అకౌంట్‌లో డబ్బులు వేసి దాన్ని కాలేజీలకు ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఓట్ల కొనుగోలులో భాగమా ఇది? అని అన్నారు. విద్యా దీవెన అర్ధం లేని ఆలోచనని అన్నారు.సీఎం జగన్ సమావేశాలకు జనం రావడం లేదని, శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన చేస్తుంటే జనాలు మీద పడుతున్నారని రాఘురామ అన్నారు. టీడీపీ సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున్న వస్తున్నారు… జగన్ సభకు జనాలు రావాలి, చప్పట్లు కొట్టాలని వైసీపీ నేతలు అడుగుతున్నారన్నారు. ఇకనైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి కాలేజీలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ ఓట్ల కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు.

*చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి Amarnath
టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఏం ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ముఖ ద్వారం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తు నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో విశాఖ వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేశారు. సిగ్గు లేకుండా మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారో తెలియడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అనే కంటే తెలుగుదేశం బాధలే బాధలు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని యెద్దేవా చేశారు. చంద్రబాబు తను తన కొడుకు కోసమే తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్ని కష్టాలలో ఉన్నా ప్రజల‌ సంక్షేమమే ముఖ్యమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు భరోసా కల్పించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతపెంచారో ప్రజలు ఇప్పటికీ మరిచి పోలేదని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని.. అది కలగానె మిగిలిపోద్దని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

*కుయ్..అంటూ తిరిగే 108 వాహనాలు ఏమయ్యాయి: Sailajanath
రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌లు దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు. కుయ్..కుయ్..అంటూ తిరిగే 108 వాహనాలు ఏమయ్యాయని నిలదీశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. పబ్లిసిటీ పిచ్చితో జెండా ఊపిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయోని జగన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని శైలజానాథ్ అన్నారు.

*జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి: Lokesh
రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశామని టీడీపీ నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూశామన్నారు. ఉదయగిరిలో పోస్టుమార్టం కోసం రూ.15వేలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుందన్నారు. బిడ్డ మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ లేక బైక్‌పైనే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి జగన్‌? అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు.

*టీఆర్‌ఎస్‌ పాలనలో వరి రైతులు ఆగం
టీఆర్‌ఎస్‌ పాలనలో వరి రైతులు ఆగమయ్యారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం దండగై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 75వ రోజు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు కొమ్ముగూడెంలో ప్రారంభమైన పాదయాత్ర రాంచంద్రాపురం, బొగ్గంరాజులగుంపు, మొద్దులగూడెం క్రాస్‌రోడ్‌ గ్రామాల మీదగా నాయడుపేటకు చేరుకుంది. నాయుడుపేటలో రైతుగోస ధర్నాలో షర్మిల మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, పంట నష్టపోతే నష్టపరిహారమూ దక్కడం లేదన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి కేసీఆర్‌ బాఽధ్యుడు కాదా అని ప్రశ్నించారు. దమ్మపేట మండలంలోని తాటిసుబ్బన్నగూడెంలో మాట-ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించేందుకే తెలంగాణలో పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గతేడాది అక్టోబరు 20న చేవెళ్లలో పాదయాత్రను ప్రారంభించిన వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల.. గురువారం నాటికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని వైఎ్‌సఆర్‌టీపీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 76 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయికి చేరుకుంటున్నట్లు తెలిపింది

*లీకులపై సీఎం స్పందించాలి: రామకృష్ణ
పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం డిమాండ్‌ చేశారు. ‘‘హిందీ, ఇంగ్లీషు, లెక్కల ప్రశ్నపత్రాలు లీకైనట్లు తెలుస్తోంది. దానికి కారకులుగా భావించి 13 మందిని అరెస్ట్‌ చేశారు. అయితే విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నపత్రాలు లీక్‌ కాలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు 16 మందిని ఎందుకు అరెస్ట్‌ చేశారు? సీనియర్‌ మంత్రి బొత్స వ్యాఖ్యలు అటు విద్యార్ద్థులను ఇటు తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ఇదీ ఒక ప్రభుత్వమా?’’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

*మా రాష్ట్రాన్ని చూడండి-దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు బుద్దా వెంకన్న ఆహ్వానం
‘‘రాష్ట్రాన్ని జగన్మోహన్‌రెడ్డి ఎలా నాశనం చేశారో స్వయంగా చూసేందుకు రావాలని తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నాం. వారికున్న అనుభవంతో జగన్‌ను సరిదిద్దుతారన్న ఆశతోనే ఆ సీఎంలకు ఈ ఆహ్వానం’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రం అధఃపాతాళానికి వెళ్లిపోయిందన్నారు.

*కొందరు చేసిన పనిని ప్రభుత్వానికి అంటగట్టొద్దు: BOSTA
కట్టుదిట్టంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని MINISTER BOSTA SATYANARAYANA ఓ ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల చిన్న సంఘటనలను రాజకీయంగా వివాదం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. TDP హయాంలో PAPER LEAKS, మాస్ కాపీయింగ్ చేసినా చర్యలు లేవన్నారు. తాము అన్ని విభాగాలను అలెర్ట్ చేసి చర్యలు చేపట్టామని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేపర్‌లో లీక్‌ వ్యవహారంలో 38 మంది ప్రభుత్వ టీచర్లు, 22 మంది ప్రైవేట్‌ స్కూళ్ల సిబ్బంది, పలువురిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయని, కొందరు స్వార్థం కోసం చేసిన పనిని GOVERNMENTకి అంటగట్టొద్దన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

*అడ్డం, పొడవు మాట్లాడుడు కాదు.. అభివృద్ధిలో పోటీ పడుదాం
‘టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ వచ్చేదా? టీబీజేపీ, టీపీసీసీలు ఎక్కడివి? వీరికి మాట్లాడే పరువు ఉండేనా? ఉమ్మడి రాష్ట్రంలో గంజిలో ఈగలా తీసేయలేదా? రోడ్లపై అడ్డం, పొడవు మాట్లాడుడు కాదు.. అభివృద్ధిలో పోటీ పడుదాం’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్‌ విసిరారు. సిరిసిల్ల పట్టణంతోపాటు ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు తెలంగాణ వచ్చేనా? అని మాట్లాడారు. ఇప్పుడు దళితబంధు, రైతుబీమా, మన ఊరు-మనబడి ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా అయ్యేనా? అంటూ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్మవిశ్వాసం ఎక్కువ. ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న వారు కేసీఆర్‌ కాలి గోటికి సరిపోరు’’ అని వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధిలోనూ కేంద్ర నిధులున్నాయంటూ ఒకాయన మాట్లాడుతున్నారని పేర్కొంటూ మరి తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠదామాలు, గోదాములు, ఇంటింటికీ నీరు వంటి సౌకర్యాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దేశంలో 6 లక్షల పల్లెలు ఉన్నాయని, తెలంగాణలోని పథకాలు, ప్రగతిని ఆ గ్రామాల్లో చూపిస్తారా? అని సవాల్‌ విసిరారు.

*రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌
రైతుల కష్టం క‘న్నీటి’ పాలవుతుంటే సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌ ప్లీనరీలు, ఫాంహౌ్‌సలలో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ దరిద్రపు పాలనకు దయనీయ స్థితి ఇదన్నారు. ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యత వహించాలని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ పురుగును తరిమికొట్టేందుకే వరంగల్‌లో రైతు సమస్యలపై రాహుల్‌గాంధీ సభను నిర్వహిస్తున్నామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 6న జరిగే రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేందుకు 15 పీసీసీ కమిటీలు సబ్‌ కమిటీలు వేసుకున్నట్లు చెప్పారు

*గప్పాలు కొట్టిన అభివృద్ధి..ఒక్క వానతో పోయింది: ఠాగూర్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గప్పాలు కొట్టి గొప్పగా చెప్పుకొన్న యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం ఒక్క వానతో తుడిచిపెట్టుకుపోయిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో యాదాద్రిలో దెబ్బతిన్న రోడ్లు, కట్టడాల ఫొటోలను పోస్ట్‌ చేశారు.

**డీలిమిటేషన్‌ ప్రక్రియను ఒప్పుకునే ప్రసక్తే లేదు: ముఫ్తీ
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్‌ కమిషన్‌ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్‌ తుది ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని అసెంబ్లీస్థానాల సంఖ్యను 83 స్థానాల నుంచి 90 స్థానాలకు పెంచాలని కమిషన్‌ ప్రతిపాదించింది.జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్‌లో 1స్థానం కమిషన్‌ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు 9 సీట్లు కేటాయించింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఆర్డర్‌ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.