NRI-NRT

యూకేలో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

యూకేలో ఎన్టీఆర్  జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకల కోసం యూకేలోని ఎన్నారైలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ మహానాడు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 28న యూకేలోని Atrium, Lamptom school, Lampton avenue, Hounslow TW3 4EP వేదికగా మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జయ్ కుమార్ గుంటుపల్లి, పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎన్నారై టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.