DailyDose

విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు – TNI నేర వార్తలు

విదేశీ వనిత కేసులో ఇద్దరికి అర్ధ జీవిత ఖైదు – TNI  నేర వార్తలు

* విదేశీ పర్యటనకు వచ్చిన వనితపై లైంగిక దాడికి యత్నించిన మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌అబీద్‌లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి.సుమ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. లిథువేనియా దేశానికి చెందిన ఓ విదేశీ వనిత శ్రీలంకకు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఏడాది మార్చి 7న చెన్నైకి చేరుకున్నారు.అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్‌ దిగి పొమ్మన్నారు. బస్సులో ఉన్న సాయికుమార్‌ గమనించి ఆమెకు నగదు సాయం చేసి బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను బద్దవోలు వెంకన్నపాలెంలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తన స్నేహితుడు అబీద్‌తో కలిసి విదేశీ వనితను సైదాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ లైంగిక దాడికి యత్నించారు. ఆమె తప్పించుకుని రోడ్డుపై వెళ్తున్న స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించి కేసును దిశ పోలీసులకు అప్పగించారు. విదేశీ వనిత కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్‌ చేసింది. దర్యాప్తు అనంతరం 10 రోజుల్లో కోర్టులో చార్జ్‌ షీటు దాఖలు చేసింది. కేసుపై ప్రత్యేక దృష్టి సారించి 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాధుప్రసాద్‌ కేసు వాదించారు. జిల్లాలో అతి తక్కువ రోజుల్లో కేసు విచారణ చేసి తీర్పు వెలువరించడం గమనార్హం.

*తిరువూరు మండలం కాకర్ల గ్రామ శివారులో ఆటోను ఢీకొన్న వ్యాన్..ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది కూలీలు..మండలంలోని రాయిగూడెం నుండి పోలిశెట్టిపాడు మామిడి కోతలకు వెళ్తున్న కూలీలు..ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు..ప్రమాదానికి కారణమైన వ్యానుతో సహా డ్రైవర్ పరార్.

*పెనుగంచిప్రోలు దారుణం… యువకుడి పై కత్తితో దాడి… అక్రమ సంబంధమే కారణమా…?ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో దారుణ ఘటన చోటుచేసుకుంది.స్థానికంగా ఉన్న తుఫాన్ కాలనీలో వద్ద ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. తన తల్లితో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తోందిడేరంగుల తిరుపతిరావు అనే యువకుడి పై రాజేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.పెనుగంచిప్రోలు గ్రామంలో తుఫాన్ కావాలి వద్ద తిరుపతి రావు అనే వ్యక్తిపై రాజేష్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.గొంతు, కడుపులో కత్తితో పోడవడంతో తిరుపతి రావు కు తీవ్ర గాయాలయ్యాయి.అతడిని 108 సహాయంతో పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి యువకుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారునిందితుడు రాజేష్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు

*సిద్దిపేట: జిల్లాలోని కొమురవెల్లి మండలం గురవన్నపేటలో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుచ్చెలి కుమార్‌ అనే భార్య కాపురానికి రావడంలేదంటూ ఎల్లమ్మ ఆలయం దగ్గర గొంతుకోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. కుమార్‌ స్వస్థలం చేర్యాల మం నాగపురిగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని నందిగామ ఎక్సైజ్ ఆఫీస్ వెనుక వైపు ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. స్థానికుల ద్వారా సమచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నందిగామ వాసి మేకపోతుల శివగా గుర్తించారు. ఒంటిపై తీవ్రగాయాలు, రక్తపుమడుగులో మృతదేహం పడి ఉంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కల్వకుర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

*మెదక్: జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీ భేటీ రాములు(45) మృతి చెందాడు. ఈనెల 2న హత్యాయత్నం కేసులో రాములును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌‌కు తరలించారు. ఈ క్రమంలో రాములుకు ఛాతినొప్పి రావడంతో జైలు సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా రాములు మరణించడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు

*హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్-మియాపూర్ మెట్రో స్టేషన్ లింక్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ రాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు సంఘటనా
స్థలంలోనే కారుని వదిలేసి పరారయ్యారు. కారు వివరాలతో ప్రమాదానికి కారణం అయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

*ప్‌నపంచంలోనే మూడవ అతిపెద్ద ప‌ర్వ‌తం నేపాల్‌లోని కాంచ‌న‌గంగ వ‌ద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్న‌ది. ఆ ప‌ర్వ‌తంపై భార‌తీయ ప‌ర్వ‌తారోహ‌కుడు 52 ఏళ్ల నారాయ‌ణ‌న్ అయ్య‌ర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాంచ‌న‌గంగ‌పై సుమారు 8200 మీట‌ర్ల ఎత్తు వ‌ద్ద అయ్య‌ర్ తుది శ్వాస విడిచారు. ఆ ప‌ర్వ‌తం ఎత్తు 8,586 మీట‌ర్లు. ఇద్ద‌రు గైడ్లు అత‌నికి స‌హ‌క‌రించినా.. అయ్య‌ర్ కోలుకోలేద‌ని ప‌ర్వాతారోహ‌క కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. అయ్య‌ర్ కుటుంబానికి మ‌ర‌ణ‌వార్త చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

*ప్ర‌పంచంలోనే మూడవ అతిపెద్ద ప‌ర్వ‌తం నేపాల్‌లోని కాంచ‌న‌గంగ వ‌ద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్న‌ది. ఆ ప‌ర్వ‌తంపై భార‌తీయ ప‌ర్వ‌తారోహ‌కుడు 52 ఏళ్ల నారాయ‌ణ‌న్ అయ్య‌ర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాంచ‌న‌గంగ‌పై సుమారు 8200 మీట‌ర్ల ఎత్తు వ‌ద్ద అయ్య‌ర్ తుది శ్వాస విడిచారు. ఆ ప‌ర్వ‌తం ఎత్తు 8,586 మీట‌ర్లు. ఇద్ద‌రు గైడ్లు అత‌నికి స‌హ‌క‌రించినా.. అయ్య‌ర్ కోలుకోలేద‌ని ప‌ర్వాతారోహ‌క కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. అయ్య‌ర్ కుటుంబానికి మ‌ర‌ణ‌వార్త చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

* వీధికుక్కల దాడిలో 12 మేక పిల్లలు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. మండలంలోని ఆసుపాకలో కొందరు కాపరులు నారాయణపురం రహదారిలో దొడ్డిని ఏర్పాటు చేసుకుని రాత్రి జీవాలను ఉంచుతున్నారు. ఇదే తరుణంలో బుధవారం రాత్రి సమయంలో వీధికుక్కలు జీవాలపై దాడి చేసి 12 మేక పిల్లలను చంపివేశాయి. గ్రామానికి చెందిన కొప్పుల పుల్లారావుకు చెందిన నాలుగు మేక పిల్లలు, లక్ష్మణరావుకు చెందిన నాలుగు పిల్లలు, సుబ్బారావుకు చెందిన రెండు పిల్లలు, వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పిల్లలు మొత్తం 12 పిల్లలు మృతిచెందాయి. మేకపిల్లల మృతితో రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. మేక పిల్లలు చనిపోయిన ప్రాంతాన్ని సర్పంచ్‌ లింగయ్య సందర్శించి రైతులను పరామర్శించారు.

*నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన పోలా రామకృష్ణ అనే కౌలు రైతు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి, మినుము, మొక్కజొన్న సాగు చేశా డు. సాగు కోసం తెచ్చిన అప్పు వడ్డీతో కలిసి రూ.12 లక్షలకు చేరింది. అప్పు తీర్చే మార్గంలేక గురువారం పురుగులమందు తాగిన అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

* తిరునల్వేలి జిల్లా పత్తమడైలో ఆటోపై చెట్టు పడిన ఘటనలో మహిళ సహా ఇద్దరు మృతిచెందారు. పాళయంకోట నుంచి అంపాసముద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ఓ చెట్టు తొలగించే సమయంలో హఠాత్తుగా రోడ్డుపై ఒరిగి పోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ ఖాదర్‌, రహమత్‌ అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డు విస్తరణ పనులపై అధికారులు ఎటువంటి హెచ్చరిక లేకుండానే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ ఆరోపిస్తూ మృతుల బంధువులు రాస్తారోకో చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు, రెవెన్యూ, రహదారులశాఖ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

*జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. రాజు అనే కార్మికుడిపై పైపు విరిగిపడింది. దీంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ విషయాన్ని బయటకు రానీయకుండా జెన్కో అధికారులు రహస్యంగా కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రాజెక్ట్ -1 వ దశలో బాటమ్ యాష్ దగ్గర ఈరోజు ఉదయం షిఫ్ట్‌లో కె.రాజు అనే ఆర్టిజన్ కార్మికుడు పనిచేస్తుండగా ప్రమాదం జరిగింది.

*కడప: జిల్లాలోని పోరుమామిళ్ల తహసీల్దార్ ఆఫీ‌స్‌లో చెన్నారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే రైతు తమ భూమిని ఆన్‌లైన్ చేయలేదని మనస్తాపానికి గురయ్యాడు. చాలాకాలంగా ఆఫీసు చుట్టూ తిరిగినా.. భూమి ఆన్‌లైన్‌ చేయలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు… బాధితుడిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

*నెల్లూరు: జిల్లాలోని డక్కిలి మండల పరిధిలో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 సంవత్సరాల బిసి మైనర్‌పై సుబ్బయ్య, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికకు రెండు, మూడు నెలలుగా బహిష్టు కాకపోవడంతో తల్లిదండ్రులు పరీక్ష చేయించారు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో ఐదురోజుల క్రితం అబార్షన్ చేయించారు. ఈ ఘటనపై డక్కిలి పోలీసుస్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో యాక్ట్ క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.

*వీధికుక్కల దాడిలో 12 మేక పిల్లలు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. మండలంలోని ఆసుపాకలో కొందరు కాపరులు నారాయణపురం రహదారిలో దొడ్డిని ఏర్పాటు చేసుకుని రాత్రి జీవాలను ఉంచుతున్నారు. ఇదే తరుణంలో బుధవారం రాత్రి సమయంలో వీధికుక్కలు జీవాలపై దాడి చేసి 12 మేక పిల్లలను చంపివేశాయి. గ్రామానికి చెందిన కొప్పుల పుల్లారావుకు చెందిన నాలుగు మేక పిల్లలు, లక్ష్మణరావుకు చెందిన నాలుగు పిల్లలు, సుబ్బారావుకు చెందిన రెండు పిల్లలు, వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పిల్లలు మొత్తం 12 పిల్లలు మృతిచెందాయి. మేకపిల్లల మృతితో రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. మేక పిల్లలు చనిపోయిన ప్రాంతాన్ని సర్పంచ్‌ లింగయ్య సందర్శించి రైతులను పరామర్శించారు.

*సరూర్‌నగర్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సరూర్‎నగర్‎లో బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. యువతిని పక్కకు నెట్టివేసి యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు nagaraju అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో పరువు హత్యగా గుర్తించారు. ఇద్దరు నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.

*భార్య నుంచి విడాకులు ఇప్పించాలని ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన గురువారం రేగోడులో చోటుచేసుకుంది. మండలంలోని సంగమేశ్వర తండాకు చెందిన గోపాల్‌(35)కు, పెద్ద తండాకు చెందిన రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారితో కలిసి గోపాల్‌ హైదరాబాద్‌లో ఉంటూ, ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గోపాల్‌ మద్యానికి బానిస కావడంతో ఏడాది క్రితం రాధ తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన గోపాల్‌ గురువారం ఉదయం రేగోడు పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కాడు. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని, లేదంటే దూకుతానంటూ హల్‌చల్‌ చేశాడు. ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది నచ్చజెప్పినా వినలేదు. అల్లాదుర్గం సీఐ జార్జి చేరుకొని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. అనంతరం భార్యభర్తలకు పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

*వీధికుక్కల దాడిలో 12 మేక పిల్లలు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. మండలంలోని ఆసుపాకలో కొందరు కాపరులు నారాయణపురం రహదారిలో దొడ్డిని ఏర్పాటు చేసుకుని రాత్రి జీవాలను ఉంచుతున్నారు. ఇదే తరుణంలో బుధవారం రాత్రి సమయంలో వీధికుక్కలు జీవాలపై దాడి చేసి 12 మేక పిల్లలను చంపివేశాయి. గ్రామానికి చెందిన కొప్పుల పుల్లారావుకు చెందిన నాలుగు మేక పిల్లలు, లక్ష్మణరావుకు చెందిన నాలుగు పిల్లలు, సుబ్బారావుకు చెందిన రెండు పిల్లలు, వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పిల్లలు మొత్తం 12 పిల్లలు మృతిచెందాయి. మేకపిల్లల మృతితో రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. మేక పిల్లలు చనిపోయిన ప్రాంతాన్ని సర్పంచ్‌ లింగయ్య సందర్శించి రైతులను పరామర్శించారు.

*రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు(27) మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసు ఎస్‌ఐ కొండప్ప నాయు డు కథనం మేరకు…శ్రీకాళహస్తి పట్టణ శివారు స్కిట్‌ కళాశాల సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గూడూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటనా స్థలంలో పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు సరైన ఆధారాలతో వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని ఎస్‌ఐ కొండప్పనాయుడు తెలిపారు

*నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన పోలా రామకృష్ణ అనే కౌలు రైతు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి, మినుము, మొక్కజొన్న సాగు చేశా డు. సాగు కోసం తెచ్చిన అప్పు వడ్డీతో కలిసి రూ.12 లక్షలకు చేరింది. అప్పు తీర్చే మార్గంలేక గురువారం పురుగులమందు తాగిన అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

*రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు(27) మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసు ఎస్‌ఐ కొండప్ప నాయు డు కథనం మేరకు…శ్రీకాళహస్తి పట్టణ శివారు స్కిట్‌ కళాశాల సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గూడూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటనా స్థలంలో పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు సరైన ఆధారాలతో వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని ఎస్‌ఐ కొండప్పనాయుడు తెలిపారు.

*గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని హత్యకు గురయ్యారు. ప్రియుడు సాధిక్ హత్య చేశాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఓ కాలేజీలో ఫార్మసీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఇటుకల ఫ్యాక్టరీ షెడ్డులో ఆమె మృతదేహం లభ్యమైంది. తమ కూతురికి మాయమాటలు చెప్పి సాధిక్‌ హత్య చేశాడంటూ పీఎస్‌ ఎదుట మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆందోళనకారులతో డీఎస్పీ రమాకాంత్ చర్చలు జరుపుతున్నారు. గ్యాంగ్ రేప్ చేసి చంపి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అన్ని విషయాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.

*వైకాపా నాయకులు వేధిస్తున్నారని నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి వద్ద జిల్లా ఎస్పీకి రాయించుకున్న ఓ లేఖ లభించింది. బాధితుల బంధువుల కథనం మేరకు.. లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు నాటుసారా కాస్తున్నారని గ్రామ వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పోలీసులు కేసులు పెడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వైకాపా మద్దతుదారులే నాటుసారా తయారు చేస్తున్నా.. ఈ దంపతులనే కొట్టి ఒప్పించి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఊరు విడిచి వెళ్లిపోతామన్నా, వైద్యం కోసం గుంటూరు వెళ్లినా పోలీసులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. వీరి 2.90 ఎకరాల పొలాన్ని వైకాపా నాయకుడు తన బంధువుల పేరిట రాయించుకున్నారని వీరి వద్ద లభించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అడుగడుగునా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తమకు ఏం జరిగినా వైకాపా నాయకులు, పోలీసులే బాధ్యులని రాయించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను వారి కుమారుడు శివసతీష్‌కుమార్‌ బనగానపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంటపాటు వైద్య సేవలందించి మెరుగైన చికిత్సకు నంద్యాల జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

*అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరెళ్ళ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటిలో ఉండే సాయి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. ఎవరో లాకెళ్ళి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని బాలిక చెబుతోంది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

*భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల దుండగులు చోరీకి తెగబడ్డారు. రెండు వైన్ షాపు లు, గోల్డ్ షాప్, మెడికల్ షాప్‌లలో దొంగల ముఠా చోరీలు చేసింది. భారీగా నగదును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.