DailyDose

వాలంటీర్ల వ్యవస్థ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ల వ్యవస్థ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అర్హులకు రాజకీయ కక్షతో వైఎస్సార్ చేయూత పథకం నిలిపివేయడంపై గానుగపాడు గ్రామానికి చెందిన 26 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. గ్రామస్థుల తరఫున అడ్వకేట్ అరుణ్ శౌరి వాదించారు. ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటి అని ధర్మాసనం ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కదా! డబ్బులు ఎలా ఇస్తారు? అని హైకోర్టు ప్రశ్నించింది. పెన్షన్ దారుల సొమ్ముతో వాలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రిక వార్తలను హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తావించారు. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారుడుని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటని న్యాయస్థానం నిలదీసింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది….