Business

జీవితకాల కనిష్ఠానికి రూపాయి పతనం.. డాలర్‌పై మారకంలో ఎంతో తెలుసా?- TNI వాణిజ్య వార్తలు

జీవితకాల కనిష్ఠానికి రూపాయి  పతనం.. డాలర్‌పై మారకంలో ఎంతో తెలుసా?- TNI వాణిజ్య వార్తలు

* దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం మరింత పతనమైంది. మధ్యాహ్న ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా డాలర్‌తో మారకంలో ఏకంగా 76.97 స్థాయికి దిగజారింది. అయితే శుక్రవారం Trading ముగింపు సమయానికి కాస్తంత కోలుకుని 76.85 వద్ద స్థిరపడింది. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ చర్యలు రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతుండడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బ్యారెల్ ఆయిల్ ధర 110 డాలర్ల స్థాయికి చేరడంతో డాలర్‌పై మారకంలో అధిక వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనమవుతున్నాయి.
బలహీన ఆరంభంక్రితం ట్రేడింగ్ రోజు 76.26 వద్ద ముగిసిన రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌లో 76.64 వద్ద బలహీనంగా ఆరంభమైంది. యూఎస్ మార్కెట్ల పతనం ప్రతికూల ప్రభావం చూపింది. ట్రెజరీ బాండ్ల లాభాలు పెరగడంతో ఈ సురక్షిత అసెట్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఈ ఫలితంగానే యూఎస్ డాలర్ బలపడింది. కాగా మార్చి 17న రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయి డాలర్‌పై మారకంలో 76.97 ను తాకిన విషయం తెలిసిందే. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ జోక్యం చేసుకుంది. ఫలితంగా ఒక్క నెలలోనే 20 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. కాగా రూపాయి మారకపు విలువలో అనిశ్చితిని నియంత్రించేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. కరెన్సీ స్థాయిని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోదు.
*హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ యాజమాన్యం చేతులు మారుతోంది. విన్‌ఎయిర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ట్రూజెట్‌ (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) ఈక్విటీలో 79 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.200 కోట్లు చెల్లించింది. ట్రూజెట్‌ ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి, విన్‌ఎయిర్‌ సీఎండీ శామ్యూల్‌ తిమోతీ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై గత నెల 26న సంతకాలు చేసినట్టు విన్‌ఎయిర్‌ తెలిపింది.
*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.
*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.
*ఈ ఏడాది భారత కార్యకలాపాల కోసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55,000 మందిని ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ 9,800 మందిని నియమించుకుంది. తద్వారా కంపెనీ మొత్తం ఉద్యోగులు 3.40 లక్షలకు చేరుకున్నారు. ఫ్రెషర్లతో పాటు అవసరాన్ని బట్టి అనుభవజ్ఞుల నియామకాలనూ చేపట్టనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌తో పాటు ఉద్యోగుల వలసలు కూడా ఊపందుకోవడంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రాంగణ నియామకాల జోరును పెంచాయి. అమెరికన్‌ కంపెనీ అయినప్పటికీ, కాగ్నిజెంట్‌కు చెందిన 75 శాతం ఉద్యోగులు భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 11.48 శాతం వృద్ధితో 56.3 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆదాయం దాదాపు 10 శాతం పెరిగి 482 కోట్ల డాలర్లకు ఎగబాకింది. ఈ ఏడాది ఆదాయాన్ని 2,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని కాగ్నిజెంట్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
*రిటైల్‌ రుణాలు మరింత భారం కానున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు 0.40 శాతం పెంచడంతో బ్యాంకులూ అదే స్థాయిలో వడ్డింపులు ప్రారంభించాయి. కేంద్ర బ్యాంక్‌ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తమ రెపో ఆధారిత రుణాల కనీస వడ్డీ రేట్లు 0.4 శాతం చొప్పున పెంచేశాయి. దీంతో ఈ రెండు బ్యాంకుల రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటు వరుసగా 8.10 శాతం, 6.90 శాతానికి చేరాయి. ఈ వడ్డీ రేట్ల పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని రెండు బ్యాంకులు ప్రకటించాయి. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ) కూడా తమ రెపో ఆధారిత రుణాల కనీస వడ్డీ రేట్లను 7.25 శాతానికి పెంచాయి. రెపో రేటు ఆధారిత వడ్డీ రేటుతో పాటు బ్యాంకులు క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం పేరుతో మరో 2.5 శాతం వరకు వడ్డిస్తుంటాయి.
*టాటా మోటార్స్‌.. మార్కెట్లో కి మినీ ట్రక్‌ ‘ఏస్‌’ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసు కువచ్చింది. గురువారం నాడిక్కడ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఏస్‌ ట్రక్‌ ను టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్యాసింజర్‌ కార్ల విభాగంలో పలు ఎలక్ట్రిక్‌ మోడళ్లను తీసుకురాగా, వాణి జ్య వాహన విభాగంలో ఎలక్ట్రిక్‌ బస్సులను విడుదల చేసినట్లు చెప్పారు. తాజాగా పికప్‌ విభాగంలో మినీ ట్రక్‌ ఏస్‌తో ఈ-కార్గో మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. ఏస్‌ ఈవీతో దేశంలోని ఔత్సాహికులందరీకి విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన ఫలాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరినట్లయిందని చంద్రశేఖరన్‌ తెలిపారు. కాగా ఈ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, సిటీ లింక్‌, ఫ్లిప్‌కార్ట్‌, డీఓటీ వంటి సంస్థలకు 39 వేల ఏస్‌ ఈవీలను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
* ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు రెండో రోజునే పూర్తి సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 16,20,78,067 షేర్లను అమ్మకానికి పెట్టగా.. ఇష్యూ రెండో రోజైన గురువారం నాటికి 1.03 రెట్లకు సమానమైన (16,68,60,765) షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి. ఎల్‌ఐసీ ఇష్యూకు పాలసీదారుల నుంచి భారీ స్పందన లభించింది. వారికి కేటాయించిన షేర్లకు ఇప్పటికే మూడు రెట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన షేర్లకు సైతం 2.21 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఇష్యూలో రిటైల్‌ మదుపర్లకు 6.9 కోట్ల షేర్లను కేటాయించగా.. అందులో 93 శాతం షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులు (క్యూఐబీ), సంస్థాగతేతర పెట్టుబడిదారుల (ఎన్‌ఐఐ) స్పందన మాత్రం అంతంత మాత్రంగా ఉంది. క్యూఐబీలకు రిజర్వ్‌ చేసిన షేర్లకు ఇప్పటివరకు 40 శాతం, ఎన్‌ఐఐల నుంచి 47 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ నమోదైంది. ఐపీఓలో భాగంగా ఎల్‌ఐసీలోని 3.5 శాతం ఈక్విటీ వాటా విక్రయం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని రూ.902-949గా నిర్ణయించింది. ఒక్కో షేరుపై పాలసీదారులకు రూ.60, ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్‌ లభించనుంది. ఎల్‌ఐసీ ఐపీఓ ఈ నెల 9న (సోమవారం) ముగియనుంది. సక్సె్‌సఫుల్‌ బిడ్డర్లకు ఈ నెల 12న షేర్ల కేటాయింపు జరగనుంది. 17న షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నారు.
*మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రా పేపర్‌ వాటాదారులకు 75 శాతం తుది డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ7.5 డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కంపెనీ నికర లాభం ఆకర్షణీయంగా 77 శాతం పెరిగి రూ.32.34 కోట్ల నుంచి రూ.57.44 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం రూ.367 కోట్ల నుంచి రూ.442 కోట్లకు పెరిగింది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,425 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
*మల్టిపుల్‌ మైలోమా వంటి కొన్ని రకాల కేన్సర్ల చికిత్సలో వినియోగించే బార్టిజోమిబ్‌ ఇంజెక్షన్‌ జనరిక్‌ను అమెరికా మార్కెట్‌లోకి గ్లాండ్‌ ఫార్మా విడుదల చేసింది. ‘వెల్‌కేడ్‌’ బ్రాండ్‌తో అమెరికాకు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్స్‌ విక్రయిస్తున్న ఔషధానికి ఇది బయోఈక్వలెంట్‌ అని కంపెనీ తెలిపింది. 3.5 ఎంజీ/వయల్‌, సింగిల్‌ డోస్‌ వయల్‌ను గ్లాండ్‌ ఫార్మా విక్రయిస్తుంది. మార్చితో ముగిసిన ఏడాదికి అమెరికా మార్కెట్‌లో వెల్‌కేడ్‌ విక్రయాలు 117.2 కోట్ల డాలర్లుంది.
*హైదరాబాద్‌కు చెందిన ఏఐ/ఎంఎల్‌, డేటా ఇంజినీరింగ్‌, అనలిటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌ సేవల కంపెనీ అపరా డిజిటల్‌ను సిగ్నిటీ టెక్నాలజీస్‌ సొంతం చేసుకోనుంది. ‘రౌండ్‌స్క్వేర్‌’ బ్రాండ్‌తో అపరా డిజిటల్‌ సేవలను అందిస్తోంది. 48 లక్షల డాలర్లకు (దాదాపు రూ.36 కోట్లకు) అపరాను కొనుగోలు చేస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్‌ సీఈఓ శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.
*డాక్టర్‌ రెడ్డీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌సలో ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించారు. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, లారస్‌ ల్యాబ్స్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఫార్మా కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు ఈ హబ్‌లో అత్యాధునిక ఫ్లో కెమిస్ట్రీ ఎక్వి ప్‌మెంట్‌ ఉంటుంది. ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సహ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా పాల్గొన్నారు.
*గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్‌లో చేరిన వ్యాపారాల వృద్ధి సహా ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో… 20 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఎగుమతులను సాధించే క్రమంలో తమ లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు భారత్ సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం పనిచేస్తోన్న అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఏజెన్సీలు ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారతదేశంలోని తన ప్లాట్‌ఫారమ్ నుండి 2025 నాటికి ఎగుమతులు 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. కంపెనీ 202 నాటికి 10 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతిని సులభతరం చేయాలని 2020 జనవరిలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2022 ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు కాగా… అమెజాన్ 2015 లో ఈ-కామర్స్ ఎగుమతి కార్యక్రమం గ్లోబల్ సెల్లింగ్‌ను ప్రారంభించింది, దీనికి లక్ష మందికి పైగా పైగా ఎగుమతిదారులున్నారు.