Devotional

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ఆసక్తికర విషయాలు – TNI ఆధ్యాత్మికం

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ఆసక్తికర విషయాలు – TNI ఆధ్యాత్మికం

1. భారత దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. అసలు ఈ యాత్ర మొదట ఎలా ప్రారంభమైంది… చార్ ధామ్ విశేషాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం.అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్ధనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ వంటి గమ్యస్థానాలు ఉంటాయి. శ్రీ ఆది శంకరాచార్య సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఈ తీర్ధయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల్లో తెరిచే నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, మంచు కారణంగా ఈ ఆలయాల ద్వారాలను మూసి వేస్తారు.
*యమునోత్రి
గర్హ్వాల్ హిమాలయాల యొక్క పశ్చిమ దేవాలయం, పవిత్ర యమునా నది ఉద్భవించిన ప్రదేశం యమునోత్రి. ఇక్కడ కొన్ని వేడి నీటి బుగ్గలు ఉంటాయి. యమునా ఆలయం వైపు పాదయాత్ర ప్రారంభించే ముందు యాత్రికులు ఈ నీటిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. చాలా కాలం క్రితం తెహ్రీ గర్హ్వాల్ కు చెందిన మహారజా ప్రతాప్ షా నదీ దేవత మందిరాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ప్రదేశంలో సూర్య కుండ్ అని పిలువబడే వేడి నీటి బుగ్గ కూడా ఉంది. యాత్రికులు ఈ నీటిలో స్నానం చేసేందుకు పోటీపడుతుంటారు.
*గంగోత్రి
యమునోత్రికి అవతల ఉత్తర కాశీలో గంగోత్రి ఉంది. ఇది గంగా దేవత యొక్క పవిత్ర నివాసం. వేసవి తీర్ధ యాత్ర కొరకు యమునా మందిరం తెరిచే రోజునే ఈ ఆలయాన్ని కూడా తెరుస్తారు. ఈ ఆలయం నది ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛత, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మానసిక ప్రశాంతతను అందించడం ద్వారా గొప్ప ఆకర్షణను కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో భోజ్ బాసా, గంగ్నాని, కేదార్తల్, భైరోంగ్ హతి, జల్ మగ్న శివలింగ, తపోవన్ వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి.
*గౌముఖ్
ఈ ఆలయం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గౌముఖ్ ప్రదేశం ఉంది. ఇక్కడి హిమానీనదం గంగా నది యొక్క మూల స్థానంగా భావిస్తారు. దేవప్రయాగ్ లో అలకనందతో గంగా నది కలిసే ముందు వరకు కూడా ఇక్కడ గంగను భాగీరధి అని భక్తులు పిలుస్తారు.
*బద్రీనాథ్
అలాకానంద నదికి ఎడమ వైపున ఉన్న బద్రీనాథ్ విష్ణువుకు అంకితం చేసిన పుణ్య క్షేత్రం. శ్రీ మహా విష్ణువు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడి రూపంలో ఇక్కడ తపస్సు చేస్తూ జీవించినట్లు నమ్ముతారు. బద్రీనాథ్ పుణ్య క్షేత్రానికి దగ్గరగా వ్యాస గుహ ఉంది. ఇక్కడ వేద వ్యాస మహర్షి మహా భారతం మరియు ఇతర గ్రంధాలను రాశారు. భారత దేశపు చివరి గ్రామమైన మనా కూడా బద్రీనాథ్ ఆలయాన్ని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. మనా గ్రామానికి అవతల ఉన్న సతోపంత్ సరస్సును సందర్శించేందుకు చాలా మంది యాత్రికులు సుదీర్ఘ ట్రెక్ కు వెళుతుంటారు.
*కేదార్ నాథ్
కొన్ని వేల సంవత్సరాల నాటి కేదార్ నాథ్ మందిరం ఒక ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడికి కఠినమైన పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. గురాలపై, డోలీలో కూడా కొందరు వెళుతుంటారు. ఈ ఆలయం పరమ శివుడికి అంకితం చేయబడింది. ఇందులో భగవంతుడు లింగం రూపంలో పూజలందుకుంటున్నాడు. కేదార్ నాథ్ సందర్శనను యాత్రికులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ ఆది శంకరాచర్య సమాధి, కాళీమఠ్, గౌరి కుండ్ మరియు సోన్ ప్రయాగ్ వంటి అనేక పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.

2. పల్లికొండేశ్వరుడి ఆలయ హుండీ లెక్కింపు
నాగలాపురం మండలం సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ జూనియర్‌ అసిస్ట్టెంట్‌ శరవణ తెలిపారు. ఈ ఆదాయం 40రోజులకు సంబంధించి భక్తులు హుండీలో చెల్లించుకున్న కానుకలని చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఇన్‌చార్జ్‌ ఈవో రామచంద్రారెడ్డిఆలయ ఛైర్మన్‌ ఏ.వి.ఎం మునిశేఖర్‌రెడ్డితిరుపతి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ దినేష్‌ నేతృత్వంలో బోర్డు సభ్యులు జయప్రకాష్‌ రాయల్‌ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

3తిరుమల వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన రెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ వరప్రసాద రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అధికారులు వారికి ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

4. తిరుమల శ్రీవారికి గురువారం బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. కోల్‌కతాకు చెందిన సుమిత్‌ సారీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ ప్రకాష్‌ చౌదరి ఈ వాహనాలను అందజేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన 10 వాహనాలకు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులతో పాటు తిరుమల ట్రాన్స్‌పోర్టు డీఐ జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.

5. పల్లికొండేశ్వరుడి ఆలయ హుండీ లెక్కింపు
నాగలాపురం మండలం సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో హుండీ ఆదాయం 2లక్షల 98వేల 409 రూపాయలు వచ్చిందని ఆలయ జూనియర్‌ అసిస్ట్టెంట్‌ శరవణ తెలిపారు. ఈ ఆదాయం 37రోజులకు సంబంధించి భక్తులు హుండీలో చెల్లించుకున్న కానుకలని చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఇన్‌చార్జ్‌ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ ఛైర్మన్‌ ఏ.వి.ఎం మునిశేఖర్‌రెడ్డితిరుపతి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ దినేష్‌ నేతృత్వంలో బోర్డు సభ్యులు జయప్రకాష్‌ రాయల్‌ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.