DailyDose

16న వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల – TNI తాజా వార్తలు

16న వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల – TNI తాజా వార్తలు

* ఖరీప్ సీజన్‌లో ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్షించారని, మే 16 న వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డి తెలిపారు. జూన్‌లో 3 వేల ట్రాక్టర్లతో సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీకి సీఎం ఆదేశించారని తెలిపారు. జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల పంపిణీకి, రైతు కోరిన కంపెనీతో డ్రిప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కాకాని గోవర్దన్‌రెడ్డి తెలిపారు

*ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆందళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, విశాఖలో ఏవో జరిగాయంటూ.. జగన్‌రెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడారని తప్పుబట్టారు. ఆడబిడ్డలను అవమానించేలా జగన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. అత్యాచార బాధితులకు డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆనంద్‌బాబు తెలిపారు.

*రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు 4.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 61,300 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. 3,679 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. 7.80 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 8 కోట్ల బ్యాగుల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ తుది దశకు వచ్చిందన్నారు.

*హజ్‌ యాత్ర-2022 డ్రాలో ఎంపికైన వారు తమ పాస్‌పోర్టు అందజేయాలని తెలంగాణ హజ్‌ కమిటీ సూచించింది. పాస్‌పోర్టుతో పాటు డౌన్‌లోడ్‌ చేసిన హజ్‌ దరఖాస్తు, డిక్లరేషన్‌ పత్రం, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, నగదు చెల్లింపు రసీదు, రెండు ఫొటోలు, కొవిడ్‌-19 ధ్రువపత్రం, బ్యాంకు వివరాలు శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని హజ్‌ కమిటీ కార్యనిర్వాహక అధికారి బి.షఫీ ఉల్లా తెలిపారు. ఇతర వివరాలకు 040-2329 8793 నంబరును సంప్రదించవచ్చన్నారు.

*రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికిపెరిగిందని, ఇది మరింత పెరిగే అవకాశం వుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటీఆర్ కిట్లను అందజేస్తున్నందున పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడ ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. శుక్రవారం జంటనగరాల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించారు. అలాగే కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు.

*ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి (YSRCP) ఊహించని రీతిలో షాక్ తగిలింది. పెద్దాపురానికి చెందిన కీలక నేత బొడ్డు వెంకటరమణ చౌదరి వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాల పర్యటనలో బిజిబిజీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నవరంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీలో చేరారు. తెలుగుదేశం కండువా కప్పిన Chandrababu.. వెంకటరమణను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశమే తనకు శిరోధార్యమని చెప్పుకొచ్చారు.
*అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో CC కెమెరా ల ఏర్పాటు.

జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ కర్నూల్ DIG కిరణ్ కుమార్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కి కార్యాలయ సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు తప్ప ఇతర అనధికార వ్యక్తుల కు ప్రవేశం లేదని… అలాంటి వారిపై CC కెమెరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రజలు తమ దస్తావేజు ను తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో PDE పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా వారి ఆస్తి క్రయ విక్రయ మరియు ఇతర వివరాలు నమోదు చేసుకుని వచ్చినట్లైతే త్వరగా వారి దస్తావేజులు రిజిస్టర్ చేసుకుని వెళ్ల వచ్చని … కావున దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలు ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు.

*తెలంగాణలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటనకు మరో షాక్‌ తగిలింది. చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు అనుమతి లభించలేదు జైల్లో NSUI నేతలను కలిసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనుమతి కోరారు. అందుకు జైలు సూపరింటెండెంట్ నిరాకరించారు. కాగా ఇప్పటికే రాహుల్‌ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతించలేదు. దీనిపై నిరసన తెలుపుతూ ఎన్ఎస్‌యూఐ నేత‌లు నిర‌స‌న‌కు దిగారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. జైల్లో వారితో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌‌ను అనుమతించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జైలు సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. అందుకు ఆయన నిరాకరించారు.

* కాంగ్రెస్ పార్టీ రైతులు, నిరుద్యోగులకు వ్యతిరేకమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గుంటే కాంగ్రెస్ నేత రాహుల్ ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోవాలన్నారు. హుజురాబాద్‌లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ది రాదా.? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయరా?.. ప్రపంచ శాంతి దూత వస్తే కనీస సెక్యూరిటీ లేదా.? అని పాల్ ప్రశ్నించారు.

*రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరం: లోకేష్‌
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి, రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరమని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నో కీలక నిర్ణయాల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలువైన సలహాలు ఇచ్చిన వ్యూహకర్త అని లోకేష్‌ తెలిపారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్‌లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.

*రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు Chandrababu పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఈ సందర్భంగా బాబు తేల్చిచెప్పేశారు…!!

*దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. రోజు వారి కేసులు భారీగా పెరిగిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,24,002కి చేరింది. అలాగే, 3549 మంది డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీలో 1365 కేసులు నమోదు అయినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

*Shamshabad Airportకు కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi చేరుకున్నారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ నుంచి కాసేపట్లో హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’కు సర్వం సిద్ధమైంది. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరగనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా Revanth Reddyని నియమించిన తర్వాత రాహుల్‌ గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో రేవంత్‌ సహా పార్టీ అగ్రనేతలంతా హనుమకొండకు చేరుకొని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

*తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పెద్దయెత్తున జరుగుతున్నాయని తెలంగాణ పౌరసరఫరాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 25 జిల్లాల్లో 4387 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కమిషనర్ Anil kumar తెలిపారు.శుక్రవారం నాటికి 75,495 మంది రైతులనుంచి రూ.1088 కోట్ల విలువ చేసే 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇందులో 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగింది. కొనుగోళ్లకు ప్రస్తుతం 7.96 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు.

*లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా దాసరి భాగ్యలక్ష్మి నియామకం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థ స్థానిక గన్నవరం న్యాయవాది శ్రీమతి దాసరి భాగ్యలక్ష్మి ని న్యాయ సహాయ న్యాయవాదిగా నియమించింది.స్థానిక గన్నవరం కోర్టులనందు గల క్రిమినల్ కేసులలో అర్హులైన ముద్దాయిలకు లేదా ఎవరైనా క్రిమినల్ కేసులో అరెస్టు కాబడి రిమాండ్ లో ఉన్నచో ఆ వ్యక్తి గాని వారి తరపువారు గాని ఉచిత న్యాయ సహాయం కోసం తనను సంప్రదించవచ్చు అని…ఆర్టికల్ 39 a ప్రకారం షెడ్యూల్డ్ కులము లేక తెగకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటి వారు సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల వంటి విపత్తులలో చిక్కుకున్నవారు…పారిశ్రామిక కార్మికులు, ఇమ్మెరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956 లో సెక్షన్ 2 (జి) లో తెలిపిన “నిర్బంధము”, లేక బాలనేరస్తుల న్యాయ చట్టము 1986 సెక్షన్ 2 (జె) లో తెలిపిన నిర్బంధము లేక మెంటల్ హెల్త్ చట్టము 1987 సెక్షన్(జి)లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సా లయములో తెలిపిన “నిర్బంధము”లో ఉన్న వ్యక్తులు మరియు వార్షిక ఆదాయం రూ. 3,00,000 మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చును అని తెలిపారు

* వైఎస్సార్‌ రైతుభరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు.

*‘పద్మ’ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
గణతంత్ర దినోత్సవం–2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్‌ నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లను ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్‌ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్‌ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.

*విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఈ మూడు కిలోల క‌ణితిని తొల‌గించేందుకు 3 గంట‌ల పాటు శ్ర‌మించారు. ప్ర‌స్తుతం బాధితురాలు కోలుకుని, ఆరోగ్యంగా ఉంది.వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లే అమెరికా నుంచి ఓ మ‌హిళ(30) తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డింది. దీంతో ఏప్రిల్ 18న నిజాంపేట్‌లోని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి వెళ్లి వైద్యుల‌ను సంప్‌‌దించింది. డాక్ట‌ర్లు ఆమెకు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, గ‌ర్భాశ‌యంలో పెద్ద క‌ణితి ఉన్న‌ట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో గైన‌కాల‌జిస్ట్ డాక్ట‌ర్ శిల్పా గ‌ట్టా, లాప్రోస్కోపిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ శిరీష మ‌ల్లమూరి క‌లిసి బాధితురాలికి శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. మూడు గంట‌ల పాటు శ్ర‌మించి, 3 కిలోల క‌ణితిని గ‌ర్భాశ‌యం నుంచి తొల‌గించారు.ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ శిల్పా గ‌ట్టా మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం బాధితురాలు అమెరికాలో సిజేరియ‌న్ చేయించుకుంది. ఆ స‌మ‌యంలో ఆమె గ‌ర్భాశ‌యంలో వైద్యులు క‌ణితిని గుర్తించ‌లేదు. ఆ త‌ర్వాత క‌ణితి క్ర‌మ‌క్ర‌మంగా పెరిగింది. అయితే ఓ శిశువు స్థాయిలో ఉన్న క‌ణితిని తొల‌గించేందుకు మూడు గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు

*రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై బీజేపీ కోర్‌ కమిటీ చర్చించింది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో హైదరాబాద్‌లో గురువారం కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ అంశాన్ని తీసుకుని ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించింది. మహిళా మోర్చా నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టిన విషయాన్ని కొందరు నేతలు ప్రస్తావించారు. అయితే, పార్టీ మరింత దూకుడు పెంచి అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే దిశగా పటిష్ఠమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ, కేంద్ర పథకాలకు జగనన్న స్టిక్కర్లు వేసుకోవడంపైనా చర్చ జరిగింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ విజయనగరం జిల్లాలో సేకరించిన సమాచారం ఢిల్లీకి చేరడంతో రాష్ట్ర పార్టీ తరఫున ఒక నివేదిక పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూన్‌ మొదటి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్న తరుణంలో భారీ బహిరంగ సభ, మేధావుల సదస్సు నిర్వహించే విషయమై కోర్‌ కమిటీ చర్చించింది.

*మాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తు న్న దేవదాయ శాఖ అధికారులకు ఆర్టీఐ కమిషన్‌ చీవాట్లు పెట్టింది. ‘ఎక్కడైనా ఓకే… అక్కడ సమాచారం ఇవ్వరు’ పేరుతో ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ అధికారులకు మొట్టికాయలు వేసింది. ఓ అర్జీ అప్పీలుకు సంబంధించి దేవదాయ అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌, ఆర్టీఐ అధికారి శోభారాణి ఆర్టీఐ కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. వాటి విచారణ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురితమైన కథనాన్ని ఆర్టీఐ కమిషనర్‌ ప్రస్తావించారు. ఇప్పటికే ఆర్టీఐ విషయంలో ఎన్నోసార్లు అధికారులను హెచ్చరించినా తీరు మార్చుకోలేదని, చివరికి మీ పనితీరు ఎలా ఉందో ‘ఆంధ్రజ్యోతి’లో స్పష్టంగా రాశారని వ్యాఖ్యానించింది. దేవదాయ శాఖలో ఆర్టీఐ అధికారిగా ఉ న్న శోభారాణి ఇతర సెక్షన్లు, పెనుగంచిప్రోలు ఆలయం ఈవో బాధ్యతలు చూ స్తూ ఆర్టీఐని నిర్లక్ష్యం చేశారు. ఏడాది దాటిన అర్జీలకూ సమాధానం ఇవ్వకుం డా జాప్యం చేశారు. ఇటీవల కమిషనర్‌ సమీక్ష చేస్తాననడంతో గతేడాది అర్జీలను సంబంధిత సెక్షన్లకు పంపారు. ఆమె తీరుతో ఆర్టీఐ కమిషన్‌ అనేకసార్లు దేవదాయ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకోకపోవడం దేవదాయ వర్గాలను విస్మయపరుస్తోంది.

*కర్నూలు జిల్లా చిప్పగిరి మండలానికి చెందిన వైసీపీ, టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. చిప్పగిరికి చెందిన మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మకు అనుచరుడు. ఇతను ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలసి వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్‌ తనకు కేటాయించాలంటూ కోరినట్లు సమాచారం. గుంతకల్లుకు చెందిన వైసీపీ నాయకుడు, బెల్డోన సింగిల్‌ విండో సొసైటీ అధ్యక్షుడు వైకుంఠం నిరంజన ప్రసాద్‌తో కలసి టీ తాగేందుకు వెళ్లారు. ఈ సమయంలో వారి మధ్య ఆలూరు టీడీపీ టికెట్టు విషయంమై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మీనాక్షి నాయుడుపై నిరంజన్‌ ప్రసాద్‌ దాడి చేశాడు. ఆ తర్వాత నిరంజన్‌ ప్రసాద్‌ వర్గంపై మీనాక్షినాయుడు వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో నిరంజన్‌ ప్రసాద్‌, ఉమాపతి, మంజునాథ్‌ చౌదరి గాయపడ్డారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

*నీట్‌ పీజీ-2022 పరీక్ష వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. గురువారం ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకి లేఖ రాశారు. ‘‘కొవిడ్‌ కారణంగా గత ఏడాది నీట్‌ పరీక్ష నిర్వహణ, కౌన్సిలింగ్‌ ఆలస్యమైంది. దీంతో తదుపరి సెషన్‌కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ విద్యార్థుల ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తి కాలేదు. దీంతో వారికి నీట్‌ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్షకు హాజరవుతున్న 1.7 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ‘‘మే 21నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు కావాలో లేక పరీక్ష కోసం సిద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలి’’ అని ఆ లేఖలో లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

* పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పాత జిల్లా కేంద్రాలు 13 చోట్ల మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటుచేశారు. మూల్యాంకనం జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి విడుదల చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ జరుగుతున్న కాలంలో డీఈవోలు ఆ కేంద్రం వదిలి వెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష పత్రాల సమాధానాల బండిళ్లను స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలకు తీసుకురావడం, అక్కడ జాగ్రత్తగా ఉంచడం తదితర అంశాలపైనా నిర్దేశాలు జారీచేశారు.

*ఇంటర్మీడియెట్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 10,01,058 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఐదు లక్షల మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు ఐదు లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. ప్రతి జిల్లాకు ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేశామని, వాటిని ఆర్‌ఐవోలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని వివరించారు.

*యాదాద్రి ఆలయ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని రోడ్లు, భవనాల ముఖ్య కార్యదర్శిని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభ రెడ్డి గురువారం ఒక లేఖలో కోరారు. వందల ఏళ్లు నిలవాల్సిన ఆలయం ఎండాకాలం వర్షానికే అతలాకుతలమైందన్నారు. ఎండాకాలం వర్షానికే ఈ పరిస్థితి ఉంటే వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే ఆలయ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆరు సంవత్సరాలుగా రూ.1200 కోట్లుఖర్చు పెట్టి పనులు పూర్తి చేశారన్నారు.

*తెలంగాణకు హరిత హారం పేరుతో ప్రభుత్వం చేపట్టిన మొక్కల పెంపకం కోసం బాయిలర్ల రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ సర్టిఫికెట్‌లను జారీ చేసే సమయంలో ఇక నుంచి హరిత నిధిని వసూలు చేయనున్నారు. కార్మిక ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాయిలర్ల రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ సర్టిపికెట్‌ల కోసం ఫీజు చెల్లించే సమయంలో ఫీజులో 10ు చెల్లించాల్సి ఉంటుంది. 10ు ఫీజు మొత్తం ఎక్కువగాఉంటే రూ.1000కు మించకుండా హరితనిధి చెల్లించాల్సి ఉంటుంది.

*ఇక మీదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించనున్నామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పీహెచ్‌సీల పని తీరుపై గురువారం డీఎంఅండ్‌హెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందితో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్సీడీ స్ర్కీనింగ్‌, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్తుల్లో సీ-సెక్షన్ల రేటు, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్‌, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, డయాగ్నోస్టిక్‌, ఐహెచ్‌ఐపీ తదితర వైద్య సేవలను జిల్లాలు, పీహెచ్‌సీలవారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన నెల రోజుల్లో పురోగతి సాధించిన జిల్లాలు, అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించామని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దీనికి అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు, వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ప్రజారోగ్య సంచాలకుడిని ఆదేశించారు.

* తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 12న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఈనెల 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే, అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సంఖ్యా బలం అధికంగా ఉన్న దృష్ట్యా ఈ ఎన్నిక ఏక గ్రీవం అయ్యే అవకాశం ఉంది. బండా ప్రకాశ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

*చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు, ఇతర విద్యార్థులను కలిసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి అనుమతి ఇవ్వాల్సిందిగా జైళ్లశాఖ డీజీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం రేవంత్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డీజీ జితేందర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. తమ వినతిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని డీజీ చెప్పారన్నారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ఉస్మానియా వర్సిటీలోరాహుల్‌ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ గతంలోనే వీసీని కలిసి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. కానీ, అనుమతి ఇవ్వకపోవడమేగాక విద్యార్థులపై ప్రభుత్వం కేసులు బనాయించి జైలుకు పంపిందని ఆరోపించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆ విద్యార్థులను కలవడానికి రాహుల్‌కు అనుమతి ఇవ్వాలని జైళ్లశాఖ డీజీని కోరినట్లు చెప్పారు. ఎలాంటి ఖైదీలనైనా కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. మొత్తం 18 మంది విద్యార్థులు జైల్లో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే అనుమతి కోరుతున్నామన్నారు. అయితే అధికారులపై నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, అధికారం వారికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

*రైతుల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టే ప్రతి రూ.100లో రైతులకు ఇచ్చేది రూ.5 మాత్రమేనని, ప్రచారానికి పెడుతున్నది రూ.95 అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనతీరు ఇలా ఉందని విమర్శించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సది గ్రాఫిక్‌ పాలన అని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని, అయితే అప్పుడు తాము రూపాయి ప్రచారం మాత్రమే చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం ఉచిత విద్యుత్తుకు ఎంత ఖర్చవుతుందో ప్రచారానికీ అంతే ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రూ. లక్ష మేరకు వ్యవసాయ రుణమాఫీ తామూ చేశామని గుర్తు చేశారు. పంట రుణాల మాఫీని అమలు చేయకున్నా చేసినట్లు కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పది పైసల పనికి వంద రూపాయల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ‘‘కాంగ్రెస్‌ ఏం చేసిందని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు.