Devotional

తెరుచుకున్న ‘బద్రినాథ్​’

తెరుచుకున్న ‘బద్రినాథ్​’

ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్​​ ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం ఉదయం 6.15 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజర్యయారు. ఆలయం తలుపులు తెరిచాక.. బద్రినాథుడికి తాపడంగా చేసిన నెయ్యిని పంచిపెట్టారు. బద్రినాథుడి ఆలయంతో పాటు సుభాయ్​ గ్రామంలోని భవిష్య బద్రి ధామ్​ ఆలయ తలుపులు తెరిచారు. కుబేరుడి డోలీ శనివారం రాత్రి బామణి గ్రామానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు బద్రినాథుడి ఆలయానికి తీసుకొచ్చారు. బద్రినాథ్​-కేదార్​నాథ్​ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్​, ఉపాధ్యక్షుడు కిశోర్​ పన్వార్​, మాజీ ఎమ్మెల్యే మహేంద్ర భట్​ సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. చార్​ధామ్​ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీన, కేదార్​నాథ్​ ఆలయం ఈనెల 6వ తేదీనే తెరుచుకున్నాయి.


6
7