DailyDose

బొంగుకల్లు @ కొత్తగూడెం భదాద్రి

బొంగుకల్లు @ కొత్తగూడెం భదాద్రి

ఉవ్విళ్లురించే తాటికల్లు, ఈత కల్లును బీట్ చేస్తూ ప్రస్తుతం బొంగులో కల్లుకు క్యూ కడుతున్నారంతా. బొంగులో కల్లుకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో గౌడన్నలు సేకరణపై దృష్టి సారించి రెట్టింపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు.

కల్లు కావాలా.. అయితే ఓ మూడు రోజుల ముందే బుక్ చేసుకోండి.. అలా కాదని పొలిటికల్ రిఫరెన్సులతో వచ్చి బుక్కెడు కావాలన్నా గరిటంత కూడా దొరకదు. ఉన్నదంతా అడుగంటే వరకు క్యూలైన్‌లోనే నిలబడి ఉంటారు. బొంగులోది కల్లుకి ఇంత డిమాండా.. అనుకుంటున్నారా? అవును ఆ కల్లు బొంగులోది కాబట్టే అంత డిమాండ్.. ఇది ఎక్కడో కాదు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉంది. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో బొంగులో కల్లు కోసం జనాలు బారులు తీరుతున్నారు. కార్యమేదైనానా కల్లుతోనే విందు చేసుకుంటారు తెలంగాణ వాసులు. ముఖ్యంగా తెలంగాణలో,ఫ్రెండ్స్‌తో దావత్‌ చేసుకోవాలన్నా, ఇంట్లో శుభకార్యాలకైనా కల్లుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు.
bk1
**అనారోగ్యం బారిన పడకుండా..
మద్యం ప్రియులకు వేసవికాలం మహా గడ్డుకాలం. భారీగా నమోదయ్యే ఉష్ణోగ్రతలకు ప్రతి రోజూ సేవించే మద్యంతో వారి శరీరం హీటెక్కుతుంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా వాంతులు, విరోచనాలు, నిరసం వంటి బారిన పడుతుంటారు. అయితే తెలంగాణ మద్యం ప్రియులు మాత్రం ప్రత్నామ్నాయంపై దృష్టి సారిస్తున్నారు. వేసవికాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉంటూనే తక్కువ ధరను వెచ్చిస్తూ ఎక్కువ రుచిని ఆస్వాదిస్తున్నారు. అదే బొంగులో కల్లు. మాములుగా కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. అయితే ఇప్పుడు తాటికల్లు, ఈత కల్లులతో పాటు ఈ బొంగులో కల్లుని ఇష్టంగా తాగుతున్నారు.

**వెదురు బొంగులో నుంచి..
ఒక్కో తాటి చెట్టుకు మట్టి కుండలకు బదులు.. పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. అప్పుడు చెట్టు నుంచి వచ్చే కల్లు నేరుగా వెళ్లి బొంగుల్లోకి చేరుతుంది.. అనంతరం కిందకు దించుతారు. అయితే ఇలా వెదురు బొంగులో నుంచి తయారు చేసిన కల్లు.. మట్టి కుండల కల్లు కంటే రుచిగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కల్లుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇంతగా ఉవ్విళ్లురించే తాటికల్లు, ఈత కల్లును బీట్ చేస్తూ ప్రస్తుతం బొంగులో కల్లుకు క్యూ కడుతున్నారంతా. బొంగులో కల్లుకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో గౌడన్నలు సేకరణపై దృష్టి సారించి రెట్టింపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు.
కుండల్లో కన్నా వెదురు బొంగుల ద్వారా తాటి చెట్ల నుంచి సేకరించే కల్లు అత్యంత చల్లగా ఉండటంతో పాటు రెట్టింపు రుచిని ఇస్తుందని చెబుతున్నారు కల్లు ప్రియులు. బొంగులో కల్లును అడ్వాన్స్ గా బుక్ చేసుకుని బొంగులోదా మజాకా అంటూ ఎంచక్కా తాగేస్తున్నారు.