DailyDose

12న పోలవరానికి కేంద్ర జలసంఘం – TNI తాజా వార్తలు

12న పోలవరానికి కేంద్ర జలసంఘం  – TNI తాజా వార్తలు

* పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులను పరిశీలించేందుకు 12న కేంద్ర జలసంఘం, 17న డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ) బృందాలు రానున్నాయి. రాష్ట్ర జల వనరుల శాఖ చేపట్టిన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు సీనియర్‌ అధికారి షరీఫ్‌ ఆధ్వర్యంలో జలసంఘం, ఏబీ పాండ్యా నేతృత్వంలో డీడీఆర్‌పీ బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి

*దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించింది.అల్పపీడనం ఆదివారం సాయంత్రానికి బలపడి తుపాను (Cyclone)గా మారుతుందని అధికారులు తెలిపారు. వచ్చే వారం నాటికి ఇది వాయవ్యంగా ముందుకు కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. ఒకవేళ ఇది తుపానుగా రూపాంతరం చెందితే దానికి ‘ఆశాని’ (Asani)గా నామకరణం చేస్తారు.

*ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం తెలుగు రాష్ట్రాలకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రెండు ప్రత్యేక రైళ్లను ఈనెల 9న నడపనున్నారు. ఈ మేరకు నైరుతి రైల్వేజోన్‌ బెంగళూరులో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాండవపుర నుంచి కాకినాడ పట్టణానికి ప్రత్యేక రైలు ఈనెల 9న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి వెళుతుంది. 10న రాత్రి 7 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఈ రైలుకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌, కృష్ణరాజపురం, బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో స్టాప్‌లు ఉంటాయి. కాగా 9న మైసూరు నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక రైలు హైదరాబాద్‌కు బయల్దేరుతుంది. ఈ రైలు సిటీ రైల్వేస్టేషన్‌, బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్‌, కర్నూలు, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌లో స్టాప్‌లు ఉంటాయని రైల్వే ప్రకటన పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్‌ చార్జీలు 30 శాతం అధికంగా ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

*మంత్రి కాకాణి సాక్ష్యాల చోరీ కేసును.. సీబీఐకి ఇవ్వాలని సీఎం జగన్‌కు ఎందుకంత ఆత్రుత? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. దీనిని కూడా వివేకా హత్య కేసులానే సాగ తీయొచ్చనా? అని నిలదీశారు. లేదంటే అసలు దోషులే దొరక్కుండా చేయొచ్చనా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు

*మంత్రి కాకాణి సాక్ష్యాల చోరీ కేసును.. సీబీఐకి ఇవ్వాలని సీఎం జగన్‌కు ఎందుకంత ఆత్రుతఅని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. దీనిని కూడా వివేకా హత్య కేసులానే సాగ తీయొచ్చనాఅని నిలదీశారు. లేదంటే అసలు దోషులే దొరక్కుండా చేయొచ్చనాఅని వర్ల రామయ్య ప్రశ్నించారు

*త‌మిళ‌నాడులో డీఎంకే ప్ర‌భుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్ర‌భుత్వ బ‌స్సులో ప్ర‌యాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న క‌రుణానిధి స్మార‌కం, అన్నా మెమోరియ‌ల్‌కు చేరుకునేందుకు స్టాలిన్ బ‌స్సులో ట్రావెల్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వ బ‌స్సుల ప‌నితీరును త‌నిఖీ చేశారు. ప్రయాణికులు, కండక్ట‌ర్‌తో ముచ్చ‌టించారు. బ‌స్సు సౌక‌ర్యాల‌పై ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.

*దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి నేటి (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెహబూబ్‌ సుభాని షేక్‌ (ఎస్‌.ఎం.సుభాని)ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈనెల నాలుగోతేదీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుభాని పేరును కేంద్రానికి పంపింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అదే సమావేశంలో ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని, పట్నా హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.

*ఆంధ్రప్రదేశ్‌ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెండో నెల వాయిదాగా రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.86,201 కోట్లుండగా.. అందులో 14 రాష్ట్రాలకు పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు(పీడీఆర్‌డీ) గ్రాంట్‌ రెండో నెలవారీ వాయిదాను శుక్రవారం కేంద్రం విడుదల చేసింది. 2022ృ23కి ఆంధ్రప్రదేశ్‌కు సిఫార్సు చేసిన పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.10,549 కోట్లు కాగా, రెండో నెల విడతగా రూ.879.08 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అందించింది

*ఎన్‌ఎస్‌ఈ పరిపాలన నిర్వహణ లోపాలకు సంబంధించిన కేసులో ఆ సంస్థ మాజీ చీఫ్‌ రవి నారాయణ్‌కు శాట్‌లో ఊరట లభించింది. రవి నారాయణ్‌కు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) స్టే విధించింది. అది కూడా నాలుగు వారాల్లోపు సెబీ వద్ద రూ.50 లక్షలు డిపాజిట్‌ చేయాలని, ఈ షరతుకు లోబడే తమ ఉత్తర్వుల అమలు ఆధారపడి ఉంటుందన్న షరుతు విధించింది.

*దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఓమందూర్‌ ఎస్టేట్‌లో 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. జూన్‌ 3వ తేదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా కరుణానిధి జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఓమందూర్‌ ఎస్టేట్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విగ్రహం తయారీ పనులు ప్రస్తుతం తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరులో జరుగుతున్నాయి. కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఉపరాష్ట్రపతిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానించారు. ఇటీవల వెంకయ్యనాయుడిని ఆయన చెన్నైలోని గృహంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రి దురైమురుగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు కలుసుకున్నారు. కరుణానిధి విగ్రహం పీఠం అమర్చేందుకు గ్రానైట్‌ రాళ్లు ఎంపిక చేసేందుకు అధికారులు జైపూర్‌ వెళ్లారు. విగ్రహ తయారీ పనులు 15 రోజుల్లో పూర్తికానున్నాయి.

*తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకుపోతానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన గద్దర్…‘‘రాహుల్‌ను నా మనవడు’’ అంటూ సంబోధించారు. తెలంగాణ సాధించుకున్నాక కూడా ఎవరు సంతృప్తిగా లేరని తెలిపారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రాలేదని అన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ని స్వాగిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలని సూచించారు. యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలన్నారు. రాహుల్ యువతను నడిపించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మాదిరి దేశం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి రాహుల్ సిద్ధం కావాలని గద్దర్ పేర్కొన్నారు

*భారీ వర్షాల కారణంగా జిల్లాలోని సత్తెనపల్లిలో గల వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం నేలకొరిగింది. గుడిలోని రేకుల షేడ్‌పై ధ్వజస్తంభం ఒరిగింది. కాగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 42 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.

*పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు తార్నాకలోని టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక హాస్పిటల్‌లో వైద్యం అందించకపోవడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. ఆర్టీసీ రిటైర్డ్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ఈ పిటిషపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీలో పుట్టి, అక్కడ చదువుకున్నారన్న (ఏపీ స్థానికత) కారణంగా వైద్యం తిరస్కరిస్తున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది తెలిపారు. ఏపీలో స్థానికత కలిగినంత మాత్రాన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైద్యం తిరస్కరించడం చట్టవిరుద్ధమని, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్‌ అయిన వారికి సైతం వైద్యం అందడం లేదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన వైద్య సేవలు తిరస్కరిస్తున్నారో వివరణ ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.

*తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పెద్దయెత్తున జరుగుతున్నాయని తెలంగాణ పౌరసరఫరాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 25 జిల్లాల్లో 4387 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కమిషనర్ Anil kumar తెలిపారు.శుక్రవారం నాటికి 75,495 మంది రైతులనుంచి రూ.1088 కోట్ల విలువ చేసే 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇందులో 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగింది. కొనుగోళ్లకు ప్రస్తుతం 7.96 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు.

* జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రాష్ట్రంలోని 21 జిల్లాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో)ను కేటాయిస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఈ నెల 9 నుంచి జూన్‌ 10 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ సెలవుల్లో సింగిల్‌ బెంచ్‌లతో కేసుల విచారణ చేపడతామని కమిషన్‌ కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌.వి. రమణమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

*మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికితోడు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా శుక్రవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలోని అనేకచోట్ల ఎండతీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఎక్కువచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చీమకుర్తిలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

*ఏపీ న్యాయవాది మెహబూబ్‌ సుభానీ షేక్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అలాగే ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదులను, పట్నా హైకోర్టుకు ఏడుగురు న్యాయాధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నెల 4న సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26గా ఉంది.

*హైకోర్టు ఆదేశాల అమలును నిర్లక్ష్యం చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్‌ అధికారులు పూనం మాలకొండయ్య, హెచ్‌.అరుణ్‌కుమార్‌, జి. వీరపాండ్యన్‌కు నెల రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. కోర్టుకు హాజరైన వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, పౌరసరఫరాల సంస్థ ప్రస్తుత ఎండీ జి.వీరపాండ్యన్‌ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య సకాలంలో కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరి కోసం నిరీక్షించవని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

*హైకోర్టు ఆదేశాల అమలును నిర్లక్ష్యం చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్‌ అధికారులు పూనం మాలకొండయ్య, హెచ్‌.అరుణ్‌కుమార్‌, జి. వీరపాండ్యన్‌కు నెల రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. కోర్టుకు హాజరైన వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, పౌరసరఫరాల సంస్థ ప్రస్తుత ఎండీ జి.వీరపాండ్యన్‌ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య సకాలంలో కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరి కోసం నిరీక్షించవని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

*పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులను పరిశీలించేందుకు 12న కేంద్ర జలసంఘం, 17న డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ) బృందాలు రానున్నాయి. రాష్ట్ర జల వనరుల శాఖ చేపట్టిన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు సీనియర్‌ అధికారి షరీఫ్‌ ఆధ్వర్యంలో జలసంఘం, ఏబీ పాండ్యా నేతృత్వంలో డీడీఆర్‌పీ బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి

*హైదరాబాద్‌.. రుచికరమైన బిర్యానికి మాత్రమే కాదు.. పెట్టుబడులకు ఇంక్యుబేటర్‌ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వినూత్న ఆవిష్కరణల కోసం ఆలోచనలు చేసే వారికి అద్భుత అవకాశాలు, ప్రోత్సాహమందించే నగరం హైదరాబాద్‌ అని పేర్కొన్నారు. నీరు, పారిశుధ్య నిర్వహణకు సంబంధించి సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి ప్రభు త్వం తరఫున అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. పురపాలక శాఖ, అస్కి సంయుక్తాధ్వర్యంలో నానక్‌రాంగూడలో జరిగిన ఇంక్‌వాష్‌ 3.0 ముగింపు సమావేశంలో మాట్లాడు తూ ఉపాధి, మెరుగైన జీవనం, విద్య, వైద్యసేవలు, నాణ్యమైన జీవనం కోసం నగరాలకు వెళ్లేందుకు గ్రామీణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వచ్చే 50 యేళ్లలో మానవ చరిత్రలో లేనంతగా పట్టణీకరణ పెరుగుతుందని, ఈ క్రమంలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కా పాడుకోవడం కీలకమన్నారు. క్లీన్‌ టెక్‌, శానిటేషన్‌ హబ్‌ల ఏర్పాటుకు ప్రభు త్వం ప్రోత్సాహమిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు సంపద సృష్టికి అవకాశం కలుగుతుందన్నారు. కఠిన చట్టాలు అమలులో ఉండే దేశాలకు వెళితే.. అక్కడి నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, కానీ ఇక్కడ మాత్రం అలాంటి నిబంధనలను పెద్దగా పట్టించుకోమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

*డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘డీఈఈసెట్‌’కు ఈ నెల 9 నుంచి జూన్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.

*రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 25న పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. రూ.6,160 కోట్ల వ్యయంతో ఏటా రూ.1.27లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంగల ఎరువుల కర్మాగారానికి 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. 2021 మార్చి 23న పరిశ్రమలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఈనెల 25న ప్రధాని కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.

*హైకోర్టు ఆదేశాల అమలును నిర్లక్ష్యం చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్‌ అధికారులు పూనం మాలకొండయ్య, హెచ్‌.అరుణ్‌కుమార్‌, జి.వీరపాండ్యన్‌కు నెల రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. కోర్టుకు హాజరైన అరుణ్‌కుమార్‌, వీరపాండ్యన్‌ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్‌ చేసిన న్యాయమూర్తి.. కోర్టుకు హాజరు కాని పూనం మాలకొండయ్య విషయంలో తీర్పును నిలుపుదల చేయడానికి నిరాకరించారు. గతంలో తనను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2గా కర్నూలు డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌.మదనసుందర్‌ గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు… పిటిషనర్‌ పేరును విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పరిగణించాలని 2019 అక్టోబరు 22న ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, అప్పటి కలెక్టర్‌ జి.వీరపాండ్యన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి… ముగ్గురు అధికారులకు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ పూనం మాలకొండయ్య శుక్రవారం అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయగా.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.

*జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు అకాల వర్షాలు మనోవేదనకు గురిచేశాయన్నారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, మిర్చి, మామిడి, నిమ్మ, సపోటాతో పాటు ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గత మూడేళ్లుగా అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ఓ వైపు గిట్టుబాటు ధరలు లేక.. మరోవైపు ప్రకృతి విపత్తులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు.