HealthKids

ఐస్‌క్రీం అతిగా తింటున్నారా..?

ఐస్‌క్రీం అతిగా తింటున్నారా..?

ఐస్‌ క్రీమ్‌ అంటే ఇష్టం లేదని చెప్పే వారు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మంది ఐఎస్‌ క్రీంను ఇష్టపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అంతా ఐస్‌ క్రీంను తినాలి అనుకుంటారు. ముఖ్యంగా వేసవి తాపానికి చల్లగా ఉండే ఐస్‌ క్రీం తింటే ఆ ఫీలింగ్‌ వేరు.. అలాగని వేసవిలో ఎక్కువగా ఐస్‌ క్రీం తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే..?
*సాధారణంగా ఐస్‌ క్రీమ్‌ తినడానికి వయసు ఏమాత్రం అడ్డురాదు. ఇక వేసవిలో దీని డిమాండ్‌ మరింత పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువగా తినేస్తుంటారు. కొంతమంది రోజులో నాలుగు కంటే ఎక్కువ ఐస్‌ క్రీమ్‌ తినేస్తారు. అయితే ఐస్‌ క్రీమ్‌ ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐస్‌ క్రీంలో పాలు, చాక్లెట్‌, అనేక రకాల డ్రైఫ్రూట్స్‌, చెర్రీస్‌ వంటివి వాడతారు.
*వైద్య నిపుణులు చెప్పిన నివేదిక ప్రకారం. ఐస్‌ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు మూడు ఐస్‌క్రీమ్‌లు తింటే 1000కి పైగా క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. దీంతో బరువు పెరుగుతారు.
* ఐస్‌ క్రీంలో కార్బ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో అధిక శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగం కారణంగా బొడ్డులో కొవ్వు పేరుకుపోతుంది. పిండి పదార్థాలు శక్తిని అందిస్తాయి. కాబట్టి ఐస్‌ క్రీంను మితంగా తీసుకోవాలి. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకునేవారవుతారు.
* ఐస్‌క్రీమ్‌లో పరిమిత కొవ్వు ఉంటుంది. ఐస్‌ క్రీం అతిగా తింటే.. ట్రైగ్లిజరైడ్స్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి. ఎవరికైనా అధిక రక్తపోటు, అధిక బరువు ఉంటే రోజూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక కప్పు వెనిల్లా ఐస్‌క్రీమ్‌లో 10 గ్రాముల వరకు ధమని- అడ్డుపడే సంతృప్త కొవ్వు, 28 గ్రాముల చక్కెర ఉంటుంది.
*సాధారణంగా ఐస్‌క్రీమ్‌లో చాలా షుగర్‌ ఉంటుంది. వీటిని తీసుకున్న తర్వాత బ్లడ్‌ షుగర్‌ స్థాయి పెరుగుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమితంగా ఐస్‌ క్రీం తీసుకోవాలి. ఐస్‌క్రీమ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
*సాధారణంగా ఇది ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర రాదు. ముఖ్యంగా నిద్ర పోయే ముందు అస్సలు ఐస్‌ క్రీం తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా తింటేటఅది అరగక.. చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
* అయితే పరిమితికి మించకుండా వేసవిలో ఐస్‌ క్రీం తినడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి అంటున్నారు. వేసవి కాలంలో ఐస్‌ క్రీం తినడం వల్ల రిఫ్రెష్‌, కూల్‌ ఫీలింగ్‌ వస్తుంది. చాక్లెట్‌ ఐస్‌ క్రీం తినడం వల్ల చాక్లెట్‌లో ఉండే పోషకాల వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఐస్‌క్రీమ్‌లో పాలు, డ్రై ఫ్రూట్స్‌, చెర్రీస్‌ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి.
*పాల వల్ల కాల్షియం, విటమిన్‌ ఎ, డి, ప్రొటీన్ల లోపం ఉండదు. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఐస్‌క్రీం తింటే మనసుకు ఆనందం, ఒత్తిడి దూరమవుతుంది. మూడ్‌ మంచిగా మారుతుంది. అల్సర్ల వల్ల ఇబ్బంది పడుతుంటే, ఐస్‌ క్రీం తినడం వల్ల మంట, నొప్పి తగ్గుతుంది.