Food

హైదరాబాద్ అస్లీ ఐస్ క్రీం C/O ఎంజే మార్కెట్

హైదరాబాద్ అస్లీ ఐస్ క్రీం C/O ఎంజే మార్కెట్

బజారులో దొరికే బ్రాండ్ ఐస్క్రీంల రుచి మనకు తెలిసిందే! అలాకాకుండా హైదరాబాద్ అస్లీ ఐస్క్రీం రుచి చూడాలంటే ఎంజే మార్కెట్కి వెళ్లాల్సిందే. నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మొజంజా పేరుతో నిర్మించిన ఎంజే మార్కెట్లోని గ్రానైట్ రాళ్ల కట్టడానికి ఎంత పేరుందో అంతకంటే ఎక్కువగా అక్కడ దొరికే ఐస్క్రీంలకు ఉంది. ఆయా సీజన్లలో దొరికే పండ్లతో ఐస్ క్రీంలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. తక్కువ ధరకి దొరుకుతాయి. మహమ్మద్ హలీం ప్రారంభించిన ఫేమస్ ఐస్క్రీం పార్లర్కి ఆదరణ పెరిగిన తర్వాత బిలాల్, షా, కపూర్ పార్లర్లూ తోడయ్యి ఇక్కడి ఐస్క్రీంలకు మరింత ఆదరణ తెచ్చిపెట్టాయి. వేసవి రోజుల్లో సాయంత్రాలు ఇక్కడ కూర్చుని మామిడి, లిచీ, సపోటా, ద్రాక్ష, మస్క్ మిలన్తో చేసిన హిమక్రీ ముల రుచి చూడ్డానికి పోటీపడతారు.
Whats-App-Image-2022-05-08-at-8-57-45-AM-2
Whats-App-Image-2022-05-08-at-8-57-46-AM