Health

వేసవి తాపానికి లస్సీ

వేసవి తాపానికి లస్సీ

లస్సీలో ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది మనం తినే ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. రోజూ లస్సీ తాగితే అజీర్తి సమస్యే ఉండదు. అంతే కాదు జీర్ణానికి సంబంధించి కలిగే అన్ని రకాల అనారోగ్యాలనూ లస్సీ పోగొట్టగలదు.
*వేసవిలోనే కాదు ఎప్పుడైనా సరే అలసిపోయినట్టుగా అనిపిస్తే… వెంటనే లస్సీ తాగండి. అయితే ఇంట్లో తయారుచేసుకునే లస్సీ చాలా మంచిది. అలా వీలుకానప్పుడు మాత్రమే రెడీమేడ్‌ లస్సీ తాగడం మేలు. లస్సీలో కాల్షియం, ప్రోటీన్స్‌ ఉంటాయి. ఇవి మన కండరాలకు శక్తిని, పెరుగుదలను ఇస్తాయి. అంటే లస్సీ తాగినప్పుడు ఇక ఆకలి వెయ్యదు. అధిక బరువు పెరగరు. అదే సమయంలో కండరాలు బలంగా అవుతాయి.
*జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. పొట్టలో అనారోగ్యాలు, గ్యాస్‌ ఇతరత్రా సమస్యలు పరిష్కారం అవుతాయి.
*లస్సీలో ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. అవి మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోకుండా ఉంటుంది. శరీరంలో వేడి పెరిగితే ప్రమాదం అది క్రమంగా జలుబు, దగ్గు, జ్వరానికి దారి తీస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత లస్సీ తాగితే శరీరంలో వేడి బ్యాలెన్స్‌ అవుతూ చలవ చేస్తుంది.
*కొంత మందికి పొట్టలో గడబిడ ఉంటుంది. అలాగే ఏం తిన్నా అరగకుండా గొంతు దగ్గరే ఉన్న ఫీల్‌ కలుగుతుంది. రొమ్ము దగ్గర మంటలా అనిపిస్తుంది. ఇక యాసీడీటీ సమస్యలు ఉండనే ఉంటాయి. వీటన్నింటికీ సరైన పరిష్కారం లస్సీ.
*లస్సీలో లాక్టిన్‌, విటమిన్‌ ఈ ఉంటాయి. అవి మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. మీ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. అడ్డమైన వైరస్‌లు బాడీలోకి రాకుండా చేస్తాయి.
*లస్సీ ఒకవేళ సిద్ధంగా లేకపోతే కనీసం పెరుగో, మజ్జిగో తాగడం మేలు. లస్సీలో ఉండే గుణాలు చాలా వరకు పెరుగులోనూ ఉంటాయి. అందువల్ల ఏదో ఒకటి మిస్సవకుండా వాడుతూ ఉంటే ఆరోగ్యమే.