Sports

క్రీడ నా జీవితాన్ని మార్చేసింది

క్రీడ నా జీవితాన్ని మార్చేసింది

బాక్సింగ్‌ అంటే చాలా కాలం అబ్బాయలకు మాత్రమే సంబంధించిన క్రీడగా ఉంది. మేరీ కోమ్‌ రంగప్రవేశం చేసి ఒలిపింక్స్‌లో గెలుపొందిన తర్వాత ఆ ఆలోచనలో కాస్త మార్పు వచ్చింది. అదే బాటలో ఎంతో మంది అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. వారిలో మన తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్‌ కూడా ఉంది. ఆమె ఓ బాక్సర్‌గా తన విజయాన్ని తనకు తానుగా చెప్పుకోవాలనే పట్టుదలతో ఉంది. తన జీవితంలో గెలుపొందడం, ఓడిపోవడం మధ్యలో ఉన్న ప్రతిదాని గురించి మనతో ఇలా పంచుకుంటుంది.

*బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రితో కలిసి అర్బన్‌ గేమ్స్‌ జరుగుతున్న స్టేడియంలోకి వెళ్లారు. అక్కడ ఆమె కొన్ని బాక్సింగ్‌ బౌట్‌లను చూసింది. రింగ్‌లో మహిళలు ఎందుకు లేరని అమాయకంగా తన తండ్రిని అడిగింది. దానికి తండ్రి ఇచ్చిన సమాధానం ‘ఇది అబ్బాయిలకు మాత్రమే సంబంధించిన క్రీడ’. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయింది. బాక్సింగ్‌లో మహిళలు ఉన్నారని, అయితే మహిళలు సాధారణంగా బలహీనులుగా పరిగణించబడుతున్నందున వారిని పెద్దగా ప్రోత్సహించడం లేదని, ఈ క్రీడ ఆడే సమయంలో శారీరక గాయాల ముప్పు ఉందని ఆమె తండ్రి ఆమెకు చెప్పారు.
తండ్రి సౌదీలో ఉద్యోగం వదిలి

* ”మహిళలు బలహీనంగా ఉన్నారని, వారు బాక్సింగ్‌లో పాల్గొంటే వివాహం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారనే సామాజిక భావన నన్ను ఈ క్రీడలో పాల్గొనాలని నిర్ణయించుకుంది” అని ఆమె గుర్తుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిఖత్‌ స్కూల్‌ సర్క్యూట్‌లో అనేక పోటీల్లో గెలుపొంది అథ్లెట్‌గా శిక్షణ పొందుతోంది. నిఖత్‌కు తమ పట్టణంలో కోచ్‌తో పాటు క్రీడకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి సౌదీ అరబిక్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
జిల్లా నుండి మొదటి అమ్మాయి

*ఆమె తండ్రి ఒకప్పుడు ఔత్సాహిక క్రీడాకారుడు. అందుకే ఆ తండ్రి తన కుమార్తె ప్రతి కలను సాకారం చేయాలని నిశ్చయించుకున్నాడు. అదే ఆమెను అథ్లెటిక్స్‌ నుండి బాక్సింగ్‌ వరకు ఎదిగేలా చేసింది. అర్బన్‌ గేమ్‌ సందర్శన ఆమె క్రీడలో, జీవితంలోనే మార్పు తీసుకొచ్చింది. అయితే మొదట్లో ఆమె బాక్సింగ్‌లోకి ప్రవేశించడం సవాళ్లతో కూడుకున్నది. ”బాక్సర్‌ కావడానికి శిక్షణ పొందిన వారిలో నా జిల్లా నుండి నేను మొదటి అమ్మాయిని. నేను అబ్బాయిలతో శిక్షణ పొందాను. వారిచే కొట్టబడ్డాను. అకస్మాత్తుగా అందరి చూపు నాపై పడింది. బాక్సర్‌గా మారడానికి, రింగ్‌లో దెబ్బలు తింటూ గాయపడే ఇంటి ఆటకు నన్ను ఎందుకు అనుమతిస్తున్నారని మా బంధువులు, మా నాన్న స్నేహితులు ఎన్నో సార్లు ఆయన్ని ప్రశ్నించారు. వారి ఆలోచనల ప్రకారం నాకు క్రీడల కోటలో ఉద్యోగం రావాలి. అలాగే నన్ను పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని వారి భావన” ఆమె చెప్పింది.

*వ్యతిరేకించిన వారే…
మా మత సంఘం నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి ”ఒక ముస్లిం మహిళ పర్దాలో ఉండాలని నాతో చెప్పేవారు. మరి నేను పొట్టి బట్టలు ఎలా ధరించగలను అని అడిగాను. వాళ్ళ మాటలేవి నన్ను ప్రభావితం చేయనివ్వలేదు. బాక్సింగ్‌పై దృష్టిపెట్టి కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. బాక్సింగ్‌ని ఎంచుకునపుడు నన్ను వ్యతిరేకించిన వ్యక్తులే పతకాలు సాధించినప్పుడు ఫోటోలు, సెల్ఫీలు అడుగుతూ మన దగ్గరకు తిరిగి వస్తారు” అని ఆమె జతచేస్తుంది.
ఒక్క ఏడాదిలోనే…
క్రీడలోకి ప్రవేశించిన ఒక సంవత్సరంలోనే అంటే 2010లో నిఖత్‌ జూనియర్‌ నేషనల్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. 2011లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. అలాగే టర్కీలో జరిగిన A×దీA మహిళల జూనియర్‌, యూత్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫ్లైవెయిట్‌ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుంది. నిఖత్‌ హోమ్‌ ఫేవరెట్‌ టర్కిష్‌ బాక్సర్‌ ఉల్కు డెమిర్‌తో తలపడింది. అంతే కాదు 2019లో స్ట్రాండ్జా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన 73వ స్ట్రాండ్జా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఒలింపిక్‌ రజత పతక విజేత బుసెనాజ్‌ కాకిరోగ్లుపై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా కోబ్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ప్రతి విజయం నిఖత్‌కు సంతోషకరమైన క్షణం. ”నేను పోడియంపైకి ఎక్కేటప్పుడు భారత జెండా ఎత్తుగా ఎగురవేయడం, జాతీయ గీతం ప్లే చేయబడటం ఎంతో అద్భుతంగా అనిపించేవి’ అని ఆమె చెప్పింది.

*మనం అనుకున్నట్టుగా మనం
2017లో నిఖత్‌ భుజం కాస్త దెబ్బతిన్నది. దాంతో ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందలేకపోయింది. ”నేను ఇంత పెద్ద గాయాన్ని తట్టుకోలేకపోయాను. నా శిక్షణను కోల్పోతున్నాను. కానీ ఈ దశ నాకు మానసికంగా దృఢంగా ఉండడం నేర్పింది. నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన సైకాలజిస్ట్‌ నన్ను సానుకూల వైపు చూడమని నన్ను ప్రోత్సహించారు. పోడియంపై నిలబడి ఒలింపిక్‌ పతకాన్ని అందుకోవడం, నేను ఏమి సాధించాలనుకుంటున్నానో దానిని ఊహించుకోమని ఆమె నాకు చెప్పారు. మనం అనుకున్నట్టుగా మనం అవుతామని నేను నమ్ముతున్నాను” అని ఆమె చెప్పింది.

*కష్ట సమయంలో ఆదుకున్నారు
లాక్డౌన్‌ సమయంలో వృత్తిపరమైన శిక్షణకు ఎటువంటి ఆధారం లేక నిఖత్‌ వెల్స్పన్‌ సూపర్‌ స్పోర్ట్‌ ఉమెన్‌ ప్రోగ్రామ్‌ (ఔూూఔ) నుండి సహాయం కోరింది. ఇది ఆమెకు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడింది. కష్ట సమయంలో సంస్థ అందించిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె దృష్టి మేలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందడం. ఆ తర్వాత పారిస్‌ 2024 వరకు గెలుపొందడంపై ఉంది. ”నేను నా జీవితాన్ని క్రీడల వైపు ఒక్కో అడుగు వేయిస్తున్నాను” అని నిఖత్‌ చెప్పింది.

*ఆమెను ట్రయల్స్‌లో ఎదుర్కొన్నాను
మేరీ కోమ్‌ సాధారణంగా 48-డివిజన్‌ విభాగంలో పోటీపడుతుంది. అయితే నాది ఫ్లైవెయిట్‌. ఒలింపిక్‌ నిబంధనల కారణంగా ఆమె తప్పనిసరిగా ఫ్లైవెయిట్‌ విభాగంలో పోటీపడాలి. నేను ఆమెను కలిసి ట్రయల్స్‌లో ఎదుర్కొనే అవకాశం కలిగింది. ఆమె నాకు గొప్ప స్ఫూర్తి. నేను నా తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాను. ఇప్పుడు పారిస్‌ 2024 కోసం ఎదురు చూస్తున్నాను.