Movies

పెళ్లి ముహూర్తం ఖరారు…

పెళ్లి ముహూర్తం ఖరారు…

ఎట్టకేలకు సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార , విఘ్నేష్ శివన్ ( Vignesh Sivan) పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే చాలాసార్లు వీరు పెళ్లి చేసుకోబోతున్నారని.. సీక్రెట్‌గా పెళ్లి కూడా జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నయనతార వరకు చేరడంతో, తానే స్వయంగా స్పందించారు. ‘నా పెళ్ళికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లే. నేను అందరీ చెప్పే పెళ్ళి చేసుకుంటాను. అప్పటి వరకు ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయవద్దు’ అని లేడీ సూపర్‌స్టార్ తెలిపారు. పెళ్లి ముహూర్తం ఖరారు…అయితే.. తాజా సమాచారం ప్రకారం జూన్-09న నయనతార-విఘ్నేష్ శివన్‌లు పెళ్ళి పీటలెక్కబోతున్నారు. ఈ రోజు (మే-07) ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమలలోనే వీరి వివాహం జరగబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఇందుకుగానూ వివాహ వేదికను బుక్ చేసేందుకు తిరుమలకు నయనతార, విఘ్నేష్ వచ్చారు. ఎన్నో నెలలుగా నయన్ పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులు ఈ విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక నయన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే కాబోయే భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన కాథు వాక్కుల రెండు కాదల్ ( తెలుగులో కణ్మని రాంబో ఖతీజా) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా, మలయాళంలో గోల్డ్ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తున్నారు.