DailyDose

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ – TNI తాజా వార్తలు

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ – TNI తాజా వార్తలు

*ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించనున్నారు.

*మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు చనిపోగా సుమారు 20 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నారట. అయితే రాయ్‌గఢ్‌లోని గోన్సే ఘాట్ సమీపంలో ప్రయాణిస్తుండగా బస్సు అదుపు తప్పి 60 ఫీట్ల లోయలో పడిపోయిందని గాయపడిన ప్రయాణికులు తెలిపారు. ఆ సమయంలో బస్సు అదుపు కోల్పోయినట్లు డ్రైవర్ తెలిపాడు

*హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌‎ను Narcotic Control Bureau అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్‌ జైన్‌ డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ ఫార్మసీ, జేఆర్‌ ఇన్‌ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఆశీష్ అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్‌ ఆర్డర్లను పంపినట్లు సమాచారం. ఆశీష్‌ నుంచి కీలక సమాచారం ఎన్‌సీబీ సేకరించింది. బిట్‌కాయిన్స్‌, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది.

*ఆంధ్రోప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు ఆదివారం బదిలీ అయ్యారు. ప్రభుత్వం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక, జవహర్‌రెడ్డిని సీఎంవో ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. మరోవైపు.. బదిలీల అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవీ బాధత్యలు తీసుకోనున్నారు

*ఆంధ్రతప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు ఆదివారం బదిలీ అయ్యారు. ప్రభుత్వం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక, జవహర్‌రెడ్డిని సీఎంవో ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. మరోవైపు.. బదిలీల అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవీ బాధత్యలు తీసుకోనున్నారు

*రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ను విమర్శించారు.నీగురించి గానీ నీ పార్టీ గురించి గానీ రాహుల్ మాట్లాడలేదు.అయినా నీ కడుపు ఎందుకు నొప్పిలేస్తుందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(shabbir ali)ప్రశ్నించారు. నువ్వు బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ వని రుజువైందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కు బ్రోకర్ వి అంటూ అసదుద్దీన్ ఓవైసీ(asaduddin owaisi)ని విమర్శించారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టవు? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒక్కటేనని షబ్బీర్ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటో, గౌరవం ఏందో మొన్నటి ఎన్నికల్లో తేలిందని ఎద్దేవా చేశారు.

*కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో రెండ్రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీ (TRS Party)పై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందుకు స్పందించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఆదివారం నాడు హనుమకొండలో మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. టీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ టూరిస్టులని.. ఎన్నికలప్పుడే ప్రజల్లో తిరుగుతారని విమర్శలు గుప్పించారు.

*తాగునీటి కోసం ఇంట్లోకొచ్చిన జింకను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలోని కొండ ప్రాంతాల్లో అధికసంఖ్యలో జింకలున్నాయి. కొద్దికాలంగా ఎండ తీవ్రతతో కొండ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో జంతువులు సమీపంలోని జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తిరువణ్ణామలై కొండ దిగువన ఉన్న పుదువానియంకుళం వీధిలోని ఓ ఇంటికి శనివారం ఉదయం ఓ జింక వచ్చింది. ఆ సమయంలో వీధికుక్కల దాడిలో జింకకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని జింకను స్వాధీనం చేసుకొని చికిత్సలు అందించి మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

*ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మహిళా ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. గత నెలలో డొనేషన్ కౌంటర్ వద్ద నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ.1116 చెల్లించారు. అయితే అతనికి మహిళ ఉద్యోగి రూ.216 రసీదు ప్రింట్ చేసి పెన్నుతో సరిచేసి ఇచ్చింది. నిత్యాన్నదాన భవనం వద్ద రసీదుపై కొట్టివేతలు ఉండడంతో సిబ్బంది ఆన్‌లైన్‌లో పరిశీలించారు. రూ.216 చెల్లించినట్లు ఉండడంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

*వినుకొండలో వైసీపీ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య అరాచకాని పాల్పడ్డాడు. మున్సిపల్ ఎన్నికలో ఓట్లు వేయలేదని ఓ కుటుంబంపై వేదింపులకు దిగాడు. సురేష్ మహాల్ ముందు పాల బూత్ ఎత్తివేయాలని వత్తిడి చేశాడు. కౌన్సిలర్ అనుచరులు పాల బూత్‌పై దాడి చేశారు. పాల బూత్ నిర్వాహకులైన అప్పారావు , అతని కొడుకులకు గాయాలయ్యాయి. కౌన్సిలర్ భార్య పాల బూత్ నిర్వాహకుడి భార్యను చెప్పుతో కొట్టింది. పోలీసు స్టేషన్ ఎదుటే దాడి ఘటన జరగడం విశేషం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌‎ను Narcotic Control Bureau అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్‌ జైన్‌ డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ ఫార్మసీ, జేఆర్‌ ఇన్‌ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఆశీష్ అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్‌ ఆర్డర్లను పంపినట్లు సమాచారం. ఆశీష్‌ నుంచి కీలక సమాచారం ఎన్‌సీబీ సేకరించింది. బిట్‌కాయిన్స్‌, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది.

*డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ హాస్పటల్‌ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మేయర్ భాగ్యలక్ష్మి, వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్స్ ఆసుపత్రిని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి కీ హోల్ సర్జరీ తెలుగు ప్రజలకు వరుణ్ అందుబాటులోకి తెచ్చారన్నారు. బైపాస్ సర్జరీ కాకుండా కీ హోల్ సర్జరీ ద్వారా గుర్తింపు పొందారని కొనియాడారు. అతి తక్కువ కాలంలో వంద ఆపరేషన్లను విజయవంతంగా చేయడం అభినందనీయమన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించి ఆదర్శంగా నిలిచారన్నారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేశారని, ప్రపంచీకరణ నేపథ్యంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆయుష్ మాన్ భారత్ ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అదిస్తున్నాయని, డాక్టర్ వరుణ్.. పేద, మధ్య తరగతి ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలని కోరుతున్నానని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.

*ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు. ప్రస్తుతం అడిషనల్ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి. టీటీడీ ఈఓగా ఉన్న జవహర్ రెడ్డిని రిలీవ్ చేసిన ప్రభుత్వం. ఇక నుంచి సీఎం కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతల్లో కొనసానున్న జవహర్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డి. గా ఎస్. సత్యనారాయణ . సెర్ప్ సీఈఓగా ఉన్న ఎమ్. డి. ఇంతియాజ్ మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

*గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పునర్విభజన కానుంది. ఆ ప్రకారం 22 శాసససభ శాసనభ నియోజకవర్గాల పరిధిలో 23 మండలాలు (జోన్‌లు) ఏర్పాటుకానున్నాయి. చెన్నై కార్పొరేషన్‌లో 2011లో 155 వార్డులు, 10 మండలాలు ఉండేవి. ఆ తర్వాత కార్పొరేషన్‌లో వార్డుల సంఖ్యను 200లకు పెంచారు. తిరువళ్లూర్‌, కాంచీపురం మున్సిపాలిటీల్లో కొన్ని ప్రాంతాలను చెన్నై కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో మండలాల సంఖ్యను 10 నుంచి 15కు పెంచారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో 22 శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో 16 నియోజకవర్గాలు చెన్నై జిల్లాల్లో ఉండగా, మిగిలినవి చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నై కార్పొరేషన్‌లోని శాసనసభ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకొని మండలాల సంఖ్య పెంచనున్నట్లు శాసససభ సమావేశాల్లో మంత్రి కేఎన్‌ నెహ్రూ ప్రకటించారు. ఆ ప్రకారం కార్పొరేషన్‌ను 23 మండలాలుగా పునర్విభజన చేయనున్నారు. 22 శాసనసభ నియోజకవర్గాలకుగాను 23 మండలాలు ఏర్పాటవుతాయి. అందుకోసం వార్డుల విభజన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కొత్త మండలాలు, వాటిలో కలవనున్న వార్డుల వివరాలతో కూడిన ప్రతిపాదన జాబితా విడుదలైంది. ఆ ప్రకారం మొదటి మండలంలో 18 వార్డులు, రెండవ మండలంలో 15 వార్డులు, మూడవ మండలంలో 7, నాలుగవ మండలంలో 7, 5వ మండలంలో 7, 6వ మండలంలో 6, 7వ మండలంలో 6, 8వ మండలంలో 6, 9వ మండలంలో 6, 10వ మండలంలో 13, 11వ మండలంలో 7, 12వ మండలంలో 6, 13వ మండలంలో 7, 14వ మండలంలో 7, 25వ మండలంలో 7, 16వ మండలంలో 6, 17వ మండలంలో 15, 18వ మండలంలో 12, 19వ మండలంలో 7, 20వ మండలంలో 7, 21వ మండలంలో 8, 22వ మండలంలో 11, 23వ మండలంలో 9 వార్డులు ఏర్పాటుచేసే ప్రతిపాదన సిద్ధమైంది

*దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. 15-49 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 32% మంది ఉపాధి రంగంలో అవకాశాలు పొందుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సరే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)-5 పేర్కొంది. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-4లో వెల్లడైన (31ు) దాని కన్నా ఈసారి ఒకశాతం పెరిగిందని తెలిపింది. అయితే వీరిలో 83ు మంది మహిళలే వేతనాలు పొందుతున్నారని, 15ు మందికి వేతనం అందడంలేదని పేర్కొంది. మరోవైపు ఇదే వయసు కలిగి ఉద్యోగాలు చేస్తున్న మగవారు 98ు ఉన్నారని, వీరిలో వేతనం పొందుతున్న వారి సంఖ్య కూడా 91ు నుంచి 95 శాతానికి పెరిగింది.

*దేశంలో 3,805 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవగా, 22 మరణాలు సంభవించాయి. మృతుల్లో 20 మంది కేరళవారే ఉన్నారు. యా క్టివ్‌ కేసులు మరో 615 పెరగడంతో వాటి మొత్తం సంఖ్య 20,303కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించిన టీకా డోసుల సంఖ్య 190 కోట్లు దాటింది. ఢిల్లీలో అత్యధికంగా 1,656 మందికి ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయింది. మరోవైపు చైనా రాజధాని బీజింగ్‌లో కొవిడ్‌ ఉధృతి తగ్గడం లేదు. అక్కడ శనివారం 78 కొత్త కేసులు నమోదయ్యాయి.

*సుప్రీంకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌ పర్దీవాలా, జస్టిస్‌ ధులియా నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో అన్ని ఖాళీలను(34) భర్తీ చేసినట్లయింది. 2019 నవంబరు తర్వాత సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తులు భర్తీ కావడం ఇదే మొదటిసారి.

*‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌లో మాట్లాడిన ప్రసంగ పాఠమంతా ప్రగతి భవన్‌ నుంచే వచ్చింది. అందుకే ఆయన ఉపన్యాసంలో ఎక్కడా కేసీఆర్‌ అన్న పదమే లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర 24వ రోజు శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నక్కలబండ తండా వద్ద కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీ నేతగా ఒక సభకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకుంటారని, కానీ, రాహుల్‌గాంధీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టేంత వరకు ఏ సభనో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.

*రాష్ట్ర హైకోర్టుకు ఈ నెల మే 9 నుం చి జూన్‌ 10వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్‌ 13నుంచి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు ఈ నెల 12, 19, 26వ తేదీల్లో విచారణలు చేపడతాయి. న్యాయమూర్తులు జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ తర్లా డ రాజశేఖరరావు, జస్టిస్‌ చీమలపాటి రవి సింగిల్‌ జడ్జిగా విచారణలు జరుపుతారు. రెండో దశ వెకేషన్‌ కోర్టులు జూన్‌ 2, 9వ తేదీల్లో విచారణ జరగనున్నాయి. జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణలు నిర్వహిస్తారు.

* రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రంగా ఉంది. బంగాళాఖాతంలో వున్న వాయుగుండం దిశగా భూ ఉపరితలం పై నుంచి గాలులు వీస్తుండడంతో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. జమ్మలమడుగులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

*రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రంగా ఉంది. బంగాళాఖాతంలో వున్న వాయుగుండం దిశగా భూ ఉపరితలం పై నుంచి గాలులు వీస్తుండడంతో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. జమ్మలమడుగులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

*విశాఖపట్నంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన మంది విద్యార్థులు వివిధ కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ మేరకు శనివారం ఏయూ కన్వెన్షన్‌ హాలులో ఎచీవర్స్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీపరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ముగియకముందే రాష్ట్రవ్యాప్తంగా గల ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన సుమారు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారనిఈ ఎంపికలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఇన్ఫోసిస్‌విప్రో తదితర కంపెనీల ప్రతినిధులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించారనిఇందులో ఆదిత్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతి భ ప్రదర్శించారని తెలిపారు. ఎచీవర్స్‌ డేసం దర్భంగా పురస్కార సభకు హాజరైన తల్లిదండ్రులువిద్యార్థులను మంత్రి అభినందించారు.అనంతరం ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికే ఉద్యోగాలు లభించడం ఓ రికార్డు అనిఆదిత్య విద్యాసంస్థలన్నింటిలో కలిపి మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికవ్వడం సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డిఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి మాట్లాడారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

*రామాయణం ప్రకారం మేఘనాథుని బాణానికి అచేతన స్థితిలోకి వెళ్లిన లక్మణుడిని బతికించేందుకు సంజీవిని కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. ఆ మొక్కను గుర్తించలేక ఆంజనేయుడు మొత్తం పర్వతాన్నే మోసుకొస్తాడు. సంజీవిని మహిమ వల్ల లక్ష్మణుడు బతుకుతాడు. ఇప్పుడు అదే సంజీవిని మొక్కను ఈ నెల 22న చెన్నైలో జరిగే బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాలని బిహార్‌ సర్కారు నిర్ణయించింది. బిహార్‌లోని రోహతస్‌ జిల్లాలో లభించే సంజీవిని బూతి అనే మొక్కను రామాయణంలోని సంజీవినిగా విశ్వసిస్తారు. సెలగెనెల్లా బ్రయోప్టెరిస్‌ అనే శాస్త్రీయ నామం కలిగిన సంజీవిని బూతిలో అనేక ఔషధ లక్షణాలున్నాయని బిహార్‌ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డీకే శుక్లా వెల్లడించారు.

*‘నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష-2022’ జూలై 9వ తేదీకి వాయి దా పడిందంటూ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పేరుతో వైరల్‌ అవుతు న్న వార్తల్లో నిజం లేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) శనివారం పేర్కొంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ పరీక్ష మే 21న జరుగుతుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు గందరగోళానికి గురికావొద్దని పీఐబీ ట్వీట్‌ చేసింది. కాగా, నీట్‌ పీజీ-2021 కౌన్సెలింగ్‌ కొనసాగుతున్నందున ఈ ఏడాది పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ వైద్య విద్యార్థుల సంఘం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

*మద్యం వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావడంతో అబ్కారీశాఖకు రోజుకు వంద కోట్ల రూపాయలు నష్టం కలగనుందని అంచనా వేశారు. శుక్రవారం నుంచి ఆందోళన ప్రారంభమైంది. ఈనెల 19 వరకు నిరసన కొనసాగిస్తున్నట్టు మద్యం వ్యాపారులు ప్రకటించారు. 15 రోజులపాటు నిరసన కొనసాగితే ఏకంగా రూ. 1500 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలగనుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 176 తాలూకాల పరిధిలో గ్రామస్థాయి నుంచి నగరం దాకా రోజూ రూ. 100 కోట్లకుపైగా వ్యాపారాలు సాగుతాయి. రాష్ట్ర అబ్కారీశాఖ రూపొందించిన కొత్త పాలసీకి వ్యతిరేకంగా మద్యం వ్యాపారులు ఆందోళనకు దిగారు. మద్యం కొనుగోలు చేసేది లేదని వారు ప్రకటించడంతో నష్టం తప్పదనిపిస్తోంది. కలబురగిలో ప్రారంభమైన ఆందోళన హొస్పేట, బెళగావి, మైసూరు, బెంగళూరు, రామనగర, మండ్య, హాసన్‌, చామరాజనగర, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో కొనసాగింది. రాష్ట్రమంతటా తమ ఆందోళన కొనసాగనుందని రాష్ట్ర మద్యం వ్యాపారుల ఐక్య కూటమి ప్రధాన కార్యదర్శి గోవిందరాజ్‌ హెగ్డే ప్రకటించారు. కొత్త పాలసీని పాటించలేమని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే వ్యాపారాలు కొనసాగించలేమన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి నగర, జిల్లా, తాలూకాల స్థాయిలో శ్రీకారం చుట్టామని గ్రామస్థాయికి తమ ఆందోళన తీసుకెళతామన్నారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ సంబంధిత అధికారులు స్పందించడం లేదన్నారు. కొవిడ్‌ కాలంలో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడుతున్నాయని, కొత్త పాలసీతో వ్యాపారులను రోడ్డున పడేయాలనుకోవడం సరికాదన్నారు. అబ్కారీశాఖ మంత్రితోపాటు అధికారులు, సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

*రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డిని.. రాష్ట్ర సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా కోరారు. ఆమె శనివారం సాయంత్రం పోర్టు గెస్ట్‌హౌ్‌సలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులపై ఆమె చర్చించారు. కాకినాడ, నెల్లూరు కోస్టల్‌ టూరిజం సర్క్యూట్‌ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. హెరిటేజ్‌ డెస్టినేషన్‌ పేరిట కొత్త ప్రాజెక్టుకు నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. సంబంధిత ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆమె అందించారు. రాష్ట్రానికి సంబంధించి టూరిజం ప్రాజెక్టులకు నిధుల మంజూరుతోపాటు పర్యాటక అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమెకు వెల్లడించారు. సమావేశంలో ఏపీటీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కన్నబాబు, టూరిజం ఈడీ రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులయితే 1-9-2011 నుంచి 31-8-2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1-9-2009 నుంచి 31-08-2013 మధ్యలో జన్మించి ఉండాలి. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలని సూచించారు. దరఖాస్తులు ఇతర వివరాల కోసం MøçÜ… https://aprs. apcfss.in అనే వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

* ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొదటి రోజు 4,62,169 మంది విద్యార్థులు హాజరయ్యారు. శనివారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,81,163 మంది విద్యార్థులకు గాను 18,994 మంది హాజరుకాలేదని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాపీయింగ్‌కు పాల్పడడంతో ఐదుగురు విద్యార్థులను డిబార్‌ చేశామన్నారు.

*మహేశ్‌బాబు హీరోగా ఈ నెల 12న విడుదల కానున్న ‘సర్కారువారిపాట’ సినిమాకు.. టికెట్‌ రేటుకు అదనంగా రూ.45 పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి పది రోజులపాటు అదనపు ధరలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

*పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా మైనింగ్‌ చేయడంతో పాటు అధిక మొత్తంలో బొగ్గును వెలికితీసినందుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) రూ.41.21 కోట్ల జరిమానా విధించింది. జస్టిస్‌ కె.రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎ్‌సపీసీబీ) కి చెల్లించాలని నిర్దేశించింది. నిర్ణీత వ్యవధిలోగా జరిమానా చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం సింగరేణి నుంచి రికవరీ చేయాలని టీఎ్‌సపీసీబీకి ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ చేస్తూ రైలు మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో బొగ్గు తరలిస్తున్నారని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నివాసి బానోత్‌ నందునాయక్‌ ఎన్జీటీలో కేసు వేసిన విషయం విదితమే. సింగరేణికి విధించిన జరిమానాను గిరిజన ఆవాసాల అభివృద్ధికి వెచ్చించాలని ఎన్జీటీ ఆదేశించింది.

*విలువైన వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని వక్ఫ్‌బోర్డు కొత్త చైర్మన్‌ మహ్మద్‌ మసివుల్లా ఖాన్‌ తెలిపారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మసివుల్లా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. కాగా, తెలంగాణ హజ్‌ కమిటీ చైర్మన్‌ ఎన్నిక సోమవారం జరగనుంది. హజ్‌ కమిటీ సభ్యుల తొలి సమావేశంలో చైర్మన్‌ను ఎన్నుకుంటారు. హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం ఎంపిక ఖరారైనట్లు సమాచారం.

*తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిని పునర్‌వ్యవస్థీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న పలువురు డాక్టర్లను వైద్య మండలిలో సభ్యులుగా నియమించారు. రాష్ట్ర వైద్య మండలి సభ్యులుగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వైరాగ్యం రాజలింగం, ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్‌ వి.రమేష్‌, సిద్దిపేట డాక్టర్‌ చంద్రారెడ్డి, కరీంనగర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.అమిత్‌ కుమార్‌, హైదరాబాద్‌ డాక్టర్‌ కృష్ణారెడ్డి, జడ్చర్ల డాక్టర్‌ జి.కె.అగ్రవాల్‌, డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, డైరెక్టర్‌ శ్రీనివాసరావులను నియమించారు. వీరితో శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభ్యులు కలిసి మండలి చైర్మన్‌గా డాక్టర్‌ వైరాగ్యం రాజలింగం, ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ చంద్రారెడ్డిలను ఎన్నుకున్నారు.

* దేశంలో రాహుల్‌ గాంధీ ఒక పార్ట్‌టైం పొలిటిషీయన్‌ అని, డిక్లరేషన్‌ పేరుతో తెలంగాణ ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ వరంగల్‌లో నిర్వహించింది రైతు సంఘర్షణ సభ కాదని, కాంగ్రెస్‌ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ ఆచరణ సాధ్యం కాదన్నారు. శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతుల కోసం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిరసన చేసినప్పుడు కాంగ్రెస్‌ ఎక్కడుందని నిలదీశారు.

*టీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ను క్షమించబోమని ్జకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, తమను క్షమించడానికి ఆయన ఎవరని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ వరంగల్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి బిచ్చం కాదని, పోరాడిసాధించుకున్నామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రుణమాఫీ పాక్షికంగా జరిగిందని, ఇప్పుడు తప్పకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ ప్రసంగం కొత్త థియేటర్‌లో పాత సినిమా చూసినట్లుగా ఉందని ప్రభుత్వవిప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు