NRI-NRT

కువైట్‌లో ‘ఇండియన్ మీడియా ఫోరం’ ఏర్పాటు

కువైట్‌లో ‘ఇండియన్ మీడియా ఫోరం’ ఏర్పాటు

కువైట్‌లో నివసిస్తున్న భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారంతా కలిసి ఇండియన్ మీడియా ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇండియన్ అంబాసిడర్ సి.బి. జార్జ్‌ ఇండియన్ మీడియా ఫోరం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ప్రాంతాలకతీతంగా ఫోరాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు/ కాగా, ఇండియన్ మీడియా ఫోరం అధ్యక్షుడిగా చైతాలి రాయ్, జనరల్ సెక్రటరీగా సునొజ్ నంబియార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అభిలాష గొడిశాల, అనిల్ అలెక్స్, పాల్ ఫ్రాన్సిస్, రెజి భాస్కరన్, సుజిత్ ఎంపికయ్యారు.