DailyDose

అమెరికా నుంచి వచ్చినరోజునే ఎన్‌ఆర్‌ఐ దంపతుల హత్య – TNI నేర వార్తలు

అమెరికా నుంచి వచ్చినరోజునే ఎన్‌ఆర్‌ఐ దంపతుల హత్య – TNI  నేర వార్తలు

*చెన్నైలోని ఫాంహౌ్‌సలో ఎన్‌ఆర్‌ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కారు(టీఎన్‌ 07 ఏడబ్ల్యూ 7499)ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్‌(58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్‌ ఉంది. శనివారం ఉదయం వారిద్దరూ విమానంలో చెన్నైకి వచ్చారు. వారి ఫాంహౌ్‌సలో నేపాల్‌కు చెందిన పధం లాల్‌శర్మ వాచ్‌మన్‌గా, అతని కుమారుడు పధం లాల్‌కృష్ణ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. విమానాశ్రయం నుంచి శ్రీకాంత్‌ దంపతులను కారులో ఫాంహౌ్‌సకు తీసుకొచ్చే సమయంలోనే లాల్‌కృష్ణ మార్గమధ్యంలో తన స్నేహితుడైన పశ్చిమబెంగాల్‌ డార్జిలింగ్‌కు చెందిన రవిని కారులో ఎక్కించుకున్నాడు. ఫాంహౌ్‌సకు తీసుకెళ్లిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పఽథకం ప్రకారం వారిని లాల్‌కృష్ణ, రవి హత్య చేసి, అక్కడే పాతిపెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును నాలుగు సూట్‌కేసుల్లో సర్దుకొని కారులో చెన్నై నుంచి నేపాల్‌కు బయలుదేరారు. చెన్నై పోలీసులకు విషయం తెలియడంతో అక్కడి ఏసీపీ డాక్టర్‌ కన్నన్‌ వెంటనే ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎస్పీ మలికగర్గ్‌ జాతీయ రహదారిపై ఉన్న అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్షణ్‌, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్‌కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు సీఐ శ్రీరామ్‌ నిందితులను విచారిస్తున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ మలిక గర్గ్‌ అభినందించారు. చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చామని, నిందితులతో పాటు కారు, సూట్‌కేసులను వారికి అప్పగిస్తామని తెలిపారు. కాగా, ఆ సూట్‌కేసుల్లో 50 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఉన్నట్లు చెన్నై పోలీసుల సమాచారం.

*చెన్నై నగరంలో భద్రతా విధుల్లో పాల్గొన్న సాయుధదళ పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివగంగ జిల్లా శంకర్‌కోయిల్‌ ప్రాంతానికి చెందిన శరవణకుమార్‌ (30) రాష్ట్ర సాయుధ దళంలో 2013లో చేరాడు. ఆయనకు శ్వేతతో ఆరు నెలల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఆవడిలోని పూమోళిల్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శరవణకుమార్‌కు అంబత్తూర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో విధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో, శనివారం సాయంత్రం శరవణకుమార్‌ తన చేతిలోని తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంబత్తూర్‌ పోలీసు సహాయ కమిషనర్‌ మహేష్‌, డిప్యూటీ కమిషనర్‌ కనకరాజ్‌, ఇన్‌స్పెక్టర్లు రామస్వామి, కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణకుమార్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు భారీగా నగదు పోగొట్టుకున్నాడని, ఆ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

*కొత్తకోట మండలం పాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను స్థానికులు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన సభావత్‌ తిరుపాల్‌నాయక్, సీతమ్మ దంపతుల కుమార్తె ఎస్‌.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.పామిడి పోలీస్‌స్టేషన్‌లో తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ 2018లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు.
అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్‌కుమార్‌ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు.

*కంభం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కందులాపురం సమీపంలో వేగంగా దూసుకువచ్చిన లారీ అదుపు తప్పి సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

*గంజాయి మత్తులో మహిళలపై కొంతమంది యువకులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అకారణంగా రాళ్లు, కర్రలతో వారిపై దాటి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయపడ్డారు. మహిళలు ఆలయానికి వెళ్లి వస్తుండగా తుకారం గేట్లోని మరాఠా బస్తీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

*ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించిన పశువులతో తరలిస్తున్న లారీ కంటైనర్‌ బోల్తా పడి… 10 పశువులు మృతి చెందాయి. రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా సాత్ నంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత అందులోని వారు పరారయ్యారు.

*బంగారం కోసం 80 ఏళ్ళ వృద్ధురాలి హత్యలో నిందితుడి అరెస్ట్…డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి పీసీదొంగిలించిన బంగారం అమ్మే క్రమంలో నిందితుడుని అరెస్ట్ చేసాం…128 గ్రాముల బంగారం 20 వేల నగదు దొంగిలించాడు…సాయం చేస్తున్నట్లు రొండ్రోజులు రెక్కీ…చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ నక్క సురేష్ 25 బంగారం కోసం హత్య చేశాడు..గతంలో వృద్ధురాలి ఇంట్లో అద్దెకు వుండే వాడు..నాలుగు టీమ్స్ తో ఇన్వెస్టిగేషన్ చేసాం…

*గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానికులు అంబులెన్స్ ద్వారా పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గన్నవరం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. గుంటూరు నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు వెంకట రామాంజనేయమ్మ (60) నాగేశ్వరరావు(75) డ్రైవర్ వెంకటేశ్వరస్వామి(62) గా పోలీసులు గుర్తించారు.

*విజయవాడలో పోలీస్ ఎలార్ట్ ..అజిత్ సింగ్ నగర్ విజయవాడలో పోలీస్ హల్ చల్గంజాయి బ్యాచ్లను పట్టుకున్న పోలీస్బహిరంగంగా మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకున్న పోలీస్Sb టీమ్ తో ముమ్మడి దాడులుహర్షం వెక్తం చేస్తున్న ప్రజానీకం.

*ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి కట్నం డిమాండ్‌ చేశాడు. అంతేగాక ఏకాంతంగా ఉన్న ఫొటోలను యువతి తండ్రికి పంపి బెదిరించాడు. ఆడబిడ్డల రక్షణ కోసం నియమితులైన మహిళా పోలీ్‌సనే మోసం చేశాడు. పోలీసుల కథనం మేరకు…. శృంగవరపుకోట మండలంలోని ఓ గ్రామ సచివాలయంలో శ్రీరెడ్డి నవీన్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీ్‌సను మాయమాటలతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రేషన్‌కార్డులో పేరు చేర్పించాడు. దీంతో ఆ యువతి అతడ్ని నమ్మింది. పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా నవీన్‌ను కోరుతోంది. తాను కొత్తగా ఇల్లు కడుతున్నానని, కట్నం ఇవ్వకుంటే పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమెను మానసికంగా, లైంగికంగా వేధించాడు. వారిద్దరూ ఏకాంతంగా తీసుకున్న ఫొటోలను యువతి తండ్రికి పంపించాడు. దీంతో నవీన్‌ తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

*వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి, ఆమె కడుపులో ఉన్న కవలలు చనిపోయారు. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం శారదానగర్‌లో నివసిస్తున్న నాగరత్న(23) గర్భం దాల్చడంతో సాయినగర్‌లోని బేబీ ఆస్పత్రిలో నెలవారీ పరీక్షలు చేయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాగరత్న అనారోగ్యంతో బాధపడుతుండటంతో వెంటనే బేబీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ రెగ్యులర్‌గా చూసే డాక్టర్‌ లేరని, మరో ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది చెప్పారు. ఆ డాక్టర్‌ ఎక్కడున్నారో చెప్పాలని అడగ్గా.. మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉన్నారని చెప్పడంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ డాక్టర్‌ వారిని పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బందితో చెప్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణిని పరీక్షించిన వైద్యులు.. ఆమెకు సీరియ్‌సగా ఉందని, కర్నూలు లేదా మరో ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇంతలోనే నాగరత్న కన్నుమూశారు. మృతదేహాన్ని పరిశీలించిన ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు.. కడుపులోని కవలలు కూడా చనిపోయినట్టు చెప్పారు. దీంతో నాగరత్న మృతదేహాన్ని బేబీ ఆస్పత్రిలో ఉంచి ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. శనివారం కూడా ఆందోళన కొనసాగించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి వారితో మాట్లాడి, కేసు నమోదు చేశారు.

*అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుడె సాయిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో నిందితుడైన సాయిని శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత పట్టణ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.

*అప్పుల బాధతో శ్రీసత్యసాయి జిల్లాలో ఓ చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సోమందేపల్లికి చెందిన సూర్యనారాయణ(50) చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. నేసిన చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనోవేదనకు లోనై శనివారం తెల్లవారుజామున రోడ్డు పక్కనున్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సూర్యనారాయణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

* అప్పుల బాధతో రాష్ట్రంలో ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం కొండేపాడుకు చెందిన కర్నాటి వీరాస్వామి(48) మోదుకూరు గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగు కోసం చేసిన రూ.7లక్షల అప్పు తీర్చే మార్గంలేక తీవ్ర మనోవేదనతో.. ఈ నెల 5న గడ్డిమందు తాగాడు. చికిత్స పొందుతూ వీరాస్వామి శనివారం మృతి చెందాడు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం కేడీ పాళ్యం గ్రామానికి చెందిన కౌలు రైతు దేవేంద్రకుమార్‌ (25) ఖరీ్‌ఫలో వేరుశనగ సాగు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో నష్టపోయాడు. ఇదే సమయంలో జీవనాధారంగా ఉన్న గొర్రెల్లో వ్యాధులు సోకి 15 మృత్యువాతపడ్డాయి. దీంతో మరితం మనోవేదనకు గురయ్యాడు. రూ.6 లక్షలు పైగా ఉన్న అప్పులు తీర్చేదారి లేక ఉరి వేసుకున్నాడు.

*అనంతపురం జిల్లా పామిడి మండలం జీఏ కొట్టాల గ్రామానికి చెందిన సరస్వతి(21) ఆత్మహత్య కేసులో ఎస్‌ఐ విజయకుమార్‌ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సరస్వతి ఆత్మహత్యకు అదే గ్రామానికి చెందిన ఎస్‌ఐ కారణమని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పామిడి పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య పామిడి పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు.

*అనంతపురం జిల్లా పామిడి మండలం జీఏ కొట్టాల గ్రామానికి చెందిన సరస్వతి(21) ఆత్మహత్య కేసులో ఎస్‌ఐ విజయకుమార్‌ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సరస్వతి ఆత్మహత్యకు అదే గ్రామానికి చెందిన ఎస్‌ఐ కారణమని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పామిడి పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య పామిడి పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు.

*తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్‌ ఇప్పిస్తానని ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి విజయవాడకు చెందిన భక్తుడిని మోసగించిన ఘటన శనివారం వెలుగు చూసింది. విశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి పంజా రమణప్రసాద్‌.. విజయవాడకు చెందిన సత్యనారాయణకు రూ.కోటి విలువ కలిగిన తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్‌ను తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో సత్యనారాయణ రూ.94 వేలు రమణప్రసాద్‌కు పంపాడు. నగదు తీసుకున్నప్పటికీ నుంచి రమణప్రసాద్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సత్యనారాయణ తిరుమల విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు నకిలీ గుర్తింపు కార్డులతో సుప్రభాతసేవ టికెట్లు పొంది దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించిన హైదరాబాద్‌కు చెందిన జిల్లా ప్రసాద్‌, అతని భార్యను కూడా విజిలెన్స్‌ అధికారులు శనివారం గుర్తించారు.

*బొజ్జల కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. పుట్టెడు దుఃఖంతో ఉన్న గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ తల్లి, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ(102) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఓ వైపు భర్త, మరోవైపు తల్లి మరణ వార్త బృందమ్మను కుంగదీశాయి. ఆస్పత్రిలో తల్లి పార్థివదేహాన్ని చూసిన అనంతరం ఆమె భర్త భౌతిక కాయంతో శనివారం ఊరందూరుకు వచ్చారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. లక్ష్మీదేవమ్మ అంత్యక్రియలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ సమీపంలోని మహాప్రస్థానంలో జరిగాయని ఆమె కుమారుడు, రైతు సంఘ నాయకుడు పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి తెలిపారు.

*రాష్ట్రంలో పిడుగులు పడి ఐదుగురు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో ఒక్కొక్కరు పిడుగుపాటుకు దుర్మరణం చెందా రు. శ్రీకాకుళం జిల్లా కంసాలివానిచెరువులో ఉపాధి పనులకు శనివారం 120మంది వెళ్లారు. సాయంత్రం వీరు పనిచేసే చోట పిడుగు పడడంతో గరికపాటి ఏకాశమ్మ (52), పొదిలాకు చిన్నలక్ష్మి(39)అక్కడికక్కడే మృతి చెందారు. అదే జిల్లా బూర్జ మండలం పనుకుపర్తిలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మేఘన(13)కు వేసవి సెలవులు కావడంతో మరో ఇద్దరితో కలిసి పశువులను మేతకు తీసుకువెళ్లింది. పిడుగుపాటుకు ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురవగా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో మేఘన మృతిచెందింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన కోండ్రు సన్యాసిరావు(48) గొర్రెలను మేపుతుండగా, పిడుగు పడి మృతిచెందాడు. ఏలూరుజిల్లా ముండూరు పంచాయతీ వెంగంపాలానికి చెందిన భీమడోలు సరోజిని(55) శుక్రవారం సాయంత్రం గేదెలకు మేతవేయడానికి వెళ్లగా సమీపంలో పిడుగు పడింది. ఆ శబ్దానికి ఆమె గుండె ఆగి మృతిచెందింది.

*సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో వ్యాపారుల ధనదాహానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం సురభి గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు మామిడికాయల షెడ్లను ఏర్పాటు చేశారు. వీరు దళారులతో కుమ్మక్కయ్యారు. ఇక్కడ వీరు చెప్పిందే రేటు. వీరు ఇచ్చిందే తీసుకోవాలి. ప్రశ్నిస్తే రైతును షెడ్డులోపలికి కూడా అడుగు పెట్టనివ్వరు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను తెగనమ్ముకుని నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో మామిడి కాయలకు మార్కెట్‌ యార్డు లేకపోవడమే దీనికి కారణమని రైతులు చెబుతున్నారు. సురభి గ్రామానికి చెంది ముగ్గురు అన్నదమ్ములు ఊటుకూరువాండ్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన మండీ వద్దకు ఇతర జిల్లాల నుంచి కూడా మామిడి కాయలు వస్తున్నాయి. కడప, అన్నమయ్య, అనంతపురం జిల్లాల నుంచి కాయలు రావడంతో రూ.400 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతోంది. వ్యయప్రయాసలతో రైతులు కాయలను తీసుకొచ్చినా.. వ్యాపారులు చెప్పిందే ఫైనల్‌. వారు చెప్పిన ధరలకే అమ్మాలి. లేకపోతే ఎవరూ కొనరు. ఇవేం ధరలని ప్రశ్నించిన రైతుల సరుకును తూకం వేయకుండా 2రోజుల పాటు ఆపేసిన సందర్భాలున్నాయి. చివరకు వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకునే పరిస్థితి సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ వ్యాపారులు ఇచ్చే ధరలు, దూర ప్రాంతంలో లభించే ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. దీనికితోడు టన్నుకు 100నుంచి 150 కిలోల తరుగు, 10శాతం కమీషన్‌ రాబట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

*కౌడిపల్లి మండలంలోని తునికి అటవీ ప్రాంతంలో ఈ నెల 4న జరిగిన మాలోత్‌ సురేష్‌(32) హత్యకేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి రూపాయల కోసమే నిందితుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను నర్సాపూర్‌ సీఐ షేక్‌లాల్‌ మదర్‌, కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు.. పోలీసులు శనివారం ఘటనా స్థలంలో మరికొన్ని ఆధారాలను సేకరించే యత్నంలో ఉండగా అక్కడే అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న చిల్‌పచేడ్‌ మండలంలోని అంతారం చెరువు కొమ్ము తండాకు చెందిన కాట్రోత్‌ శ్రీను ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. గతంలో మాలోత్‌ సురేష్‌ నిందితుడైన కాట్రోత్‌ శ్రీను నుంచి రూ. వేయి అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. ఈ విషయమై శ్రీను పలుమార్లు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 2న సురేష్‌ తమ సొంత గ్రామానికి వచ్చే క్రమంలో వైన్స్‌ వద్ద శ్రీనుతో కలిశాడు. ఇరువురు మద్యం సేవించేందుకు తునికి అటవీ ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వచ్చి మద్యం సేవించారు. అనంతరం తనకు ఇవ్వాల్సిన రూ. వేయి అప్పు గురించి శ్రీను అడుగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో సురే్‌షను కొట్టి తలపై బండరాయితో మోది తానే హత్య చేసినట్లు శ్రీను అంగీకరించాడు. హత్య కేసును ఛేదించిన ఏఎ్‌సఐ శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ భాగయ్య, సురే్‌షలను సీఐ అభినందించారు.