Politics

రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయి – TNI రాజకీయ వార్తలు

రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయి – TNI రాజకీయ వార్తలు

* రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల వ్యవహారంపై తానొక్కడే మొనగాడని సీఎం జగన్‌ (CM Jagan) విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్‌ (TRS) వామపక్షాలతో పొత్తులు పెట్టుకోలేదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలు ఇంకెంతో కాలం కొనసాగవని, ముగింపు పలకడానికి సమయం దగ్గరపడిందని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు మితిమీరాయని తెలిపారు. సదుంలో టీడీపీ నేత రాజారెడ్డిని వైసీపీ శ్రేణులు హతమార్చేందుకు యత్నించాయని, హత్యాయత్నంపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు జోస్యం చెప్పారు.

*ఎన్‌పీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదు : కేటీఆర్‌
ఎన్‌పీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్‌ కేటీఆర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు కొత్తగా టిమ్స్‌ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని అప్‌డేట్‌ చేస్తున్నామని, ౩౩ జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. కర్నాటకలో సీఎం పదవి అమ్మకం వార్తలు బీజేపీ నిజస్వరూపమని కేటీఆర్‌ అన్నారు

*చంద్రబాబు వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్
పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చెయ్యదన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. జూన్‌ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండా: Harish
పదవి ఉన్నా లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలని, పదవులు వచ్చిన వారు ప్రజల కోసం పని చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారదులుగా కార్యకర్తలు ఉండాలన్నారు. క్యాడర్ లేకుంటే పార్టీ లేదని.. కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలని అన్నారు. అన్ని పార్టీల నేతలు వచ్చి సిద్దిపేట అభివృద్ధి మీద ఏడుస్తారని, మరి ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. సిద్దిపేట పదిమందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని, సిద్దిపేట పేరు లేకుండా కేంద్ర అవార్డులే ఉండవన్నారు. ప్రస్తుతం సిద్దిపేటకు రెండో రింగు రోడ్డు వేస్తున్నామని, భవిష్యత్తులో మూడో రింగు రోడ్డు రాబోతోందని హరీష్ రావు తెలిపారు

*కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్‌?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది.

*ఏడాది పాటు గ్రామాల్లో తిరగాలని సూచించా: హరగోపాల్‌
‘‘నిర్బంధ చట్టాలను ఉపయోగించి అమాయకులను జైలులో పెడుతున్నారు. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీకి చెప్పా. ప్రజల నాడి తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సంవత్సరం పాటు గ్రామాల్లో తిరగాలని ఆయనకు సూచించా’’ అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ చెప్పారు. నియో లిబరలిజం కారణంగా సమాజంలో అసమానతలు పెరిగి, సంక్షేమ పథకాలు కొంతమందికే అందడంతో ఎన్నికల్లో ఓటమికి దారి తీస్తుందని చెప్పానన్నారు. తాము చెప్పిన ప్రతి అంశాన్నీ రాహుల్‌గాంధీ శ్రద్ధతో విన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ధ్వంసమవుతున్న తీరు, ఆర్థిక అసమానతలు, తెలంగాణ సమాజం ఎటువంటి సంక్షేమాన్ని కోరుకుంటుందనే వివరాలను రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీ వంటి సింపుల్‌ మనిషిని రాజకీయాల్లో ఇప్పటి వరకు చూడలేదని, ఆయన స్నేహశీలంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వివరించారు.

*క్షమించేందుకు రాహుల్‌ ఎవరు?: నిరంజన్‌
టీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ను క్షమించబోమని ్జకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, తమను క్షమించడానికి ఆయన ఎవరని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ వరంగల్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి బిచ్చం కాదని, పోరాడిసాధించుకున్నామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రుణమాఫీ పాక్షికంగా జరిగిందని, ఇప్పుడు తప్పకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ ప్రసంగం కొత్త థియేటర్‌లో పాత సినిమా చూసినట్లుగా ఉందని ప్రభుత్వవిప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు.

*ఏడాది పాటు గ్రామాల్లో తిరగాలని సూచించా: హరగోపాల్‌
‘‘నిర్బంధ చట్టాలను ఉపయోగించి అమాయకులను జైలులో పెడుతున్నారు. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీకి చెప్పా. ప్రజల నాడి తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సంవత్సరం పాటు గ్రామాల్లో తిరగాలని ఆయనకు సూచించా’’ అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ చెప్పారు. నియో లిబరలిజం కారణంగా సమాజంలో అసమానతలు పెరిగి, సంక్షేమ పథకాలు కొంతమందికే అందడంతో ఎన్నికల్లో ఓటమికి దారి తీస్తుందని చెప్పానన్నారు. తాము చెప్పిన ప్రతి అంశాన్నీ రాహుల్‌గాంధీ శ్రద్ధతో విన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ధ్వంసమవుతున్న తీరు, ఆర్థిక అసమానతలు, తెలంగాణ సమాజం ఎటువంటి సంక్షేమాన్ని కోరుకుంటుందనే వివరాలను రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీ వంటి సింపుల్‌ మనిషిని రాజకీయాల్లో ఇప్పటి వరకు చూడలేదని, ఆయన స్నేహశీలంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వివరించారు.

*కొత్తతరం రావాలని సూచించా: గద్దర్‌
రాహుల్‌తో భేటీ అనంతరం ప్రజాగాయకుడు గద్దర్‌ మీడియాతో మాట్లాడుతూ, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నప్పటికీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియమ్మేనని అన్నారు. నాటి ఉద్యమ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలని రాహుల్‌కు సూచించినట్లు చెప్పారు. దేశంలో పేదరికం. ఆకలి పరిస్థితులు ఇంకా ఉన్నాయని, ఆహార ఉత్పత్తిదారునిగా(ప్రొడ్యూసర్‌గా) ఉండాల్సిన రైతన్నలు.. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులుగా (కన్స్యూమర్స్‌గా) మారారన్నారు. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు ఇలా అన్నీ కొనాల్సిన పరిస్థితిలో ఉన్నారని, రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ చేపట్టాలని సూచించానని తెలిపారు. దేశానికి నవతరం నాయకుల అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు కాకుండా కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్‌ను కోరానన్నారు. రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్న వారికి కాంగ్రెస్‌ పార్టీలోని ఉద్దండులు అండగా నిలబడి వారు ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు.

*Rahul Gandhiకి ప్రగతి భవన్‌ నుంచే స్ర్కిప్ట్‌: బండి సంజయ్‌
‘‘కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వరంగల్‌లో మాట్లాడిన ప్రసంగం స్ర్కిప్టు అంతా ప్రగతి భవన్‌ (Pragati Bhavan) నుంచే వచ్చింది. అందుకే ఆయన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్‌ అన్న పదమే ఉచ్చరించలేదు.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ స్ట్రాటజీ ప్రకారం వ్యవహరిస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయని, మాటాముచ్చట అయిపోయిందని, ఇక పెళ్లిమాత్రమే మిగిలిందని అన్నారు. 31 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకు కాంగ్రెస్‌ పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ విషయాన్ని తాను, మీడియా బయటపెట్టామని తెలిపారు. ప్రజల్లో ఈ పొత్తుపై వ్యతిరేకత రావడంతో మళ్లీ కాకమ్మకబుర్లు చెబుతున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

*టూరిస్టుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు: తలసాని
రైతు సంఘర్షణ… కాంగ్రెస్ అంతర్గత సభ లాగా ఉందని మంత్రి టీఆర్ఎస్‌ఎల్పీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మద్దతు ధర ఇస్తామని చెప్పారు కానీ అది రాష్ట్రానికా లేక దేశానికా అనేది చెప్పలేదన్నారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించిందని.. అప్పుడెందుకు ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఇంకా తలసాని మాట్లాడుతూ.. కాళేశ్వరం బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గుర్తింపు వచ్చింది. రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్తున్నారు. వీళ్లేమైన స్టడీ చేసి మాట్లాడుతున్నారా లేదా తెలియదు. టూరిస్టుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు. నడ్డా, రాహుల్ గాంధీ సభలకు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని చోట్లా అక్కడి పరిస్థితులు అక్కడి ఇన్‌చార్జిలు అనుమతులు ఇవ్వాలి. ఓయూలో పరీక్షలు జరుగుతున్నాయి. డిస్టర్బ్ చేయొద్దని వీసీ అనుమతి ఇవ్వలేదు. జైల్లో అధికారులు అనుమతి ఇవ్వాలి. అది వాళ్ల పరిధిలో ఉన్న అంశం. ప్రభుత్వానికి ఏం సంబంధం? తెలంగాణ మీరు ఇవ్వలేదు, కేసీఆర్ తెచ్చుకున్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాదించుకున్నారు’’ అని పేర్కొన్నారు

*కాకాణి కేసుపై సీఎం ఆతృత ఎందుకో?: వర్ల
మంత్రి కాకాణి కేసులో సాక్ష్యాల దొంగతనం కేసును సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆతృత పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ కేసును కూడా బాబాయి వివేకా కేసులాగా సాగదీయొచ్చనా? అసలు దోషులు దొరక్కుండా చేయొచ్చనా? అని నిలదీశారు. ఈ విషయంలో హైకోర్టు జాగ్రత్తగా వ్యవహరించాలని, వీలుంటే న్యాయవిచారణ చేయుంచాలని శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

*అప్పులు వచ్చేదాకా జీతాలివ్వరా?: అశోక్‌బాబు
ప్రభుత్వానికి అప్పులు పుట్టేదాకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వరా? అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘మే ఏడో తేదీ వచ్చినా ఉద్యోగుల్లో అనేక మందికి జీతాలు పడలేదు. పేదలకు కూడా పూర్తిగా పింఛన్లు అందలేదు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. అంగన్‌వాడీ ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు లేవు. ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు చెల్లించడం లేదు’ అని ఆయన చెప్పారు.

*నువ్వు సీఎంవా.. ప్రతిపక్ష నేతవా?: అచ్చెన్నt
‘రాష్ట్రంలో పరిస్థితులకు, ధరల పెరుగుదలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణం అంటున్నావు. నీవు ముఖ్యమంత్రివా.. ప్రతిపక్ష నాయకుడివా?’ అని సీఎం జగన్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా మాకివలసలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టీడీపీ చేపట్టిన బాదుడే.. బాదుడు కార్యక్రమంతో వైసీపీ నాయకుల్లో వణుకు పడుతోంది. కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు’ అని అచ్చెన్న అన్నారు. కాగా, అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారం చెల్లించాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు.

*మీటర్లు.. రైతు వ్యతిరేక నిర్ణయం: తులసిరెడ్డి
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడం రైతు వ్యతిరేక నిర్ణయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, మీటర్లు బిగిస్తే రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

*నువ్వు సీఎంవా.. ప్రతిపక్ష నేతవా?: అచ్చెన్న
‘రాష్ట్రంలో పరిస్థితులకు, ధరల పెరుగుదలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణం అంటున్నావు. నీవు ముఖ్యమంత్రివా.. ప్రతిపక్ష నాయకుడివా?’ అని సీఎం జగన్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా మాకివలసలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టీడీపీ చేపట్టిన బాదుడే.. బాదుడు కార్యక్రమంతో వైసీపీ నాయకుల్లో వణుకు పడుతోంది. కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు’ అని అచ్చెన్న అన్నారు. కాగా, అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారం చెల్లించాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు.

*ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే: సీపీఐ
ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు ఏర్పాటు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. మీటర్ల ఏర్పాట్లను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు

*జగన్‌ పత్రికలో అన్నీ అబద్ధాలే
ప్రజల సొమ్ముతో బటన్‌ నొక్కుడు ద్వారా మనుగడ సాగిస్తున్న జగన్‌ పత్రిక అన్నీ అబద్ధాలు రాస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా బెంచ్‌ చేసిన వ్యాఖ్యలపై తప్పుడు తడకల వార్తలు రాశారని, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. కోర్టు తనను చీవాట్లు పెట్టలేదని, పిటిషనర్‌ ఎంపీ అయితే పార్లమెంట్‌లో మాట్లాడొచ్చు కదా అందని, కోర్టుకు ఎందుకు రావాలని ప్రశ్నించలేదని తెలిపారు. కోర్టు తన పిటిషన్‌ను కొట్టేయలేదన్నారు. పార్లమెంట్‌లోనే కాదు, ఎక్కడ అవకాశం ఉన్నా ఈ అంశంపై మాట్లాడుతున్నామని, ప్రధానికి, ఆర్థికమంత్రికి కూడా లేఖలు రాసిన విషయాన్ని తన న్యాయవాది కోర్టుకు తెలిపారని వివరించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి తాము న్యాయస్థానానికి వచ్చినట్లు చెప్పారన్నారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి కూడా నిధులు మళ్లించారన్నారు. కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఇటీవల లేఖ రాస్తే, అన్ని పత్రికలు ప్రచురించాయని, కానీ జగన్‌ పత్రిక మాత్రం ప్రచురించలేదని చెప్పారు. కాగ్‌ ఆడిట్‌ నివేదికలు ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి కనుక తాను కోర్టు తలుపు తట్టానన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీ తప్పక ఓడిపోతుందని రఘురామ చెప్పారు.

*పవన్ కల్యాణ్ కర్నూల్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గంకు చేరుకుంటారు. అనంతరం శిరివెళ్ళ గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు. మార్గమధ్యలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు. మధ్యాహ్నం 2గం.30కి శిరివెళ్ళలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్.

*‘డిండి’ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలివ్వాలి : కోదండరాం
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న చర్లగూడెం, లక్ష్మణాపురం, వెంకేపల్లి, నర్సిరెడ్డిగూడెం గ్రామాల భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం ఆయన ముంపు గ్రామాల్లో పర్యటించారు. చర్లగూడెంలో భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం హక్కులు, పరిహారం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ చర్లగూడెం రిజర్వాయర్‌ శంకుస్థాపన సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.

*రాజకీయ లబ్ధికే యాదాద్రిపై విమర్శలు: ఇంద్రకరణ్‌
రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంత్రి శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ వసంత్‌కుమార్‌, ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణ తదితర అధికారులతో సమావేశమయ్యారు. అకాల వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్‌ పనులు కొనసాగుతుండటంతో పైప్‌లైన్‌లో మట్టి, ఇసుక కూరుకపోయి నీరు నిలిచిపోయిందని మంత్రి స్పష్టం చేశారు.

*రాహుల్‌ పర్యటనతో ఒరిగేదేమీ లేదు: వినోద్‌
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ పర్యటనతో రాష్ట్రానిగాని, దేశానికిగాని ఒరిగేదేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో డిక్లేర్‌ చేసి, అమలు చేస్తోన్న వ్యవసాయ విధానాన్నే రాహుల్‌ గాంధీ వరంగల్‌ డిక్లరేషన్‌ పేర ప్రకటించారని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ సహా వివిధ పార్టీల నేతలు కేసీఆర్‌ వ్యవసాయ విధానాన్ని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రెవెన్యూ రికార్డులు, భూముల వివరాలన్నింటినీ పక్కాగా పొందుపరుస్తున్నామని, కానీ.. కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా మళ్లీ పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

*రాహుల్‌ను చూస్తే జాలేస్తోంది: ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ కన్నా గొప్పగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏం ఉందో చెప్పాలని రాహుల్‌ గాంధీని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరంగల్‌ డిక్లరేషన్‌ హాస్యాస్పదంగా ఉందని, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను వింటుంటే జాలేస్తోందని, ఎవరో రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదివి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

*అది డిక్లరేన్‌కాదు.. కాంగ్రెస్‌ ప్రస్టేషన్‌: ఎ.జీవన్‌రెడ్డి
వరంగల్‌లో ప్రకటించింది రైతుల డిక్లరేషన్‌ కాదని, కాంగ్రెస్‌ నేతల ప్రస్టేషన్‌ అని పీయూసీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలు కాంగ్రెస్‌ పాలితరాష్ట్రాలకు వర్తించవా? అని ప్రశ్నించారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ములేని రాహుల్‌గాంధీ.. తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అరవింద్‌ చిల్లర మాటలు మానుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు హితవు పలికారు. పసుపుబోర్డు ఏర్పా టుకు కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు.