Business

రిలయన్స్‌ కొత్త రికార్డు.. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాం- TNI వాణిజ్య వార్తలు

రిలయన్స్‌ కొత్త రికార్డు.. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాం- TNI వాణిజ్య వార్తలు

*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.
*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.
*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.
* దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.
*విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో లారస్‌ లేబొరేటరీస్‌ రూ.2,000- 2,500 కోట్ల వరకూ పెట్టుబడు లు పెట్టనుంది. 2022-23, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. గతంలో రూ.1,500-1,700 పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావించినప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులను పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) ఆదాయ లక్ష్యా న్ని చేరాలని కూడా కంపెనీ భావిస్తోంది. 2021-22లో లారస్‌ ల్యాబ్స్‌ రూ.4,936 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
* సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్లు త్వరలో 100కు చేరనున్నాయని సెలెక్ట్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.గురు తెలిపారు. ప్రస్తుతం 83 స్టోర్లు ఉన్నాయన్నారు. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సెలెక్ట్‌ను ప్రారంభించి నాలుగేళ్లు అయిన సందర్భంగా సెలెక్ట్‌ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా పాత ఫోన్‌తో కొత్త ఫోన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గురు తెలిపారు. ఈఎంఐల ద్వారా మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని.. జెస్ట్‌ మనీ ద్వారా మొబైల్‌ కొనుగోలుపై ఒక ఈఎంఐని ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్‌ను ఇస్తున్నామన్నారు.
*సాగర్‌ సిమెంట్‌కు రూ.350 కోట్ల నిధులు లభించనున్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ ప్రేమ్‌జీ ఇన్వె్‌స్టకు చెందిన పీఐ ఆపర్చ్యునిటీస్‌ ఫండ్‌-1 స్కీమ్‌ 2కు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.2 ముఖ విలువ కలిగిన 1,32,07,548 షేర్లను కేటాయించడానికి కంపెనీకి చెందిన సెక్యూరిటీస్‌ అలాట్‌మెంట్‌ కమిటీ అంగీకరించింది. రూ.2 ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.265కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ ఫండ్‌కు షేర్లను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ చేయడానికి గత నెలలో జరిగిన ఏజీఎంలో వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ షేర్ల కేటాయింపు తర్వాత సాగర్‌ సిమెంట్‌ చెల్లించిన మూలధనం రూ.23.5 కోట్ల నుంచి రూ.26.14 కోట్లను మించుతుంది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా లభించిన నిధులను కొత్త సిమెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఉన్న ప్లాంట్ల విస్తరణకు వినియోగించనుంది.
*ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లేదా నైకా వంటి ఈ-కామర్స్‌ పోర్టల్‌ను సందర్శించినప్పుడు ఆ సైట్‌లో నమోదు చేసుకున్న విక్రేతలకు సంబంధించిన ఉత్పత్తులు మాత్రమే దర్శనమిస్తాయి. ఒకవేళ మీకు అమెజాన్‌లో కొన్ని, నైకా లేదా ఇతర ఈ-కామర్స్‌ సైట్‌లో కొన్ని ఉత్పత్తులు నచ్చితే..? ఆయా సైట్ల నుంచి విడివిడిగా కొనుగోలు చేయాలి. అందుకు విడివిడిగా చెల్లింపులు జరపాలి. పైగా మీకు అవసరమైన ఉత్పత్తుల కోసం పలు ఈ-కామర్స్‌ సైట్లను సందర్శించి, ధరలు పోల్చి చూసుకున్నాక ఏ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేయాలో నిర్ణయం తీసుకోవడం ప్రయాసతో కూడిన ప్రక్రియే. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభు త్వం కామన్‌ గేట్‌వేను అభివృద్ధి చేసింది. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) పేరుతో గతనెలాఖరులో ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు, భోపాల్‌, షిల్లాంగ్‌, కోయంబత్తూర్‌లో పైలట్‌ సేవలను ప్రారంభించింది. వచ్చే 6 నెలల్లో 100 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
*ఒక రాష్ట్రానికి చెందిన రవా ణా సంస్థకు 1,400 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు చెందిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అతి తక్కువ బిడ్‌ను దాఖలు చేసింది. లీస్ట్‌ కోటెడ్‌ (ఎల్‌-1) బిడ్డర్‌గా ఈవీని ఆ రవాణా సంస్థ ప్రకటించిందని ఒలెకా్ట్ర తెలిపింది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ)/ఒపెక్స్‌ మోడల్‌ కింద కాంట్రాక్టు కాలపరిమితి 12 ఏళ్లు ఉంటుంది. ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడంతో పాటు ఈ కాలంలో వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టాలి. రవాణా సంస్థ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డు లభించిన వెంటనే ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ నుంచి ఈవీ ట్రాన్స్‌ పొందుతుంది. ఏడాది కాలంలో ఈ మొత్తం ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెకా్ట్ర సరఫరా చేస్తుంది. 1,400 బస్సుల విలువ దాదాపు రూ.2,450 కోట్లు ఉంటుంది.
*స్టార్ట్‌పల రంగంలో భారత్‌ మరో రికార్డు సాధించింది. దేశంలో యూనికార్న్‌ హోదా సాధించిన స్టార్ట్‌పల సంఖ్య 100కు చేరుకుంది. నియో బ్యాంకింగ్‌ సేవల స్టార్టప్‌ ‘ఓపెన్‌’.. ఈ నెల 5న దేశంలోని వందో యూనికార్న్‌గా అవతరించింది. ఐఐఎ్‌ఫఎల్‌తో పాటు ప్రస్తుత వాటాదారుల నుంచి 5 కోట్ల డాలర్లు సేకరించిన సందర్భంగా ఓపెన్‌ ఈ హోదాను అందుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దేశంలోని 100 యూనికార్న్‌ల మొత్తం మార్కెట్‌ విలువ 33,270 కోట్ల డాలర్లు (సుమారు రూ.25.62 లక్షల కోట్లు)గా ఉంది. కనీసం 100 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో దాదాపు రూ.7,700 కోట్లు) మార్కెట్‌ విలువ కలిగిన స్టార్‌్రపలను యూనికార్న్‌లుగా పిలుస్తారు.
*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.