DailyDose

ఇంటర్నెట్‌ వాడకంలో ఆమెదే పైచేయి

ఇంటర్నెట్‌ వాడకంలో ఆమెదే పైచేయి

పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనేవరకు ఇంటర్నెట్‌ లేని మనిషి జీవితాన్ని ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ వాడని వాళ్లు కూడా ఉన్నారంటే నమ్మగలమా? దేశంలోని మగవాళ్లలో సగం మంది ఇంటర్నెట్‌ వినియోగించలేదట. పురుషులతో పోల్చితే మహిళలే ముందువరుసలో ఉన్నారట. ఆశ్చర్యంగా అనిపించినా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21)లో తేలింది ఇదే. అంతేకాదు.. ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోతారని, సీరియళ్ల పిచ్చి ఎక్కువనే భావన అందరిలో ఉన్నది. కానీ ఇది నిజం కాదట. టీవీ చూడటంలో పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారని సర్వే పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో 51.2 శాతం మంది ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ వినియోగించలేదని సర్వేలో తేలింది. 48.8 శాతం మందే ఇంటర్నెట్‌ వాడుతున్నట్టు తే ల్చింది. ఈ విషయంలో మహిళలు చాలా ముందు ఉన్నట్టు వెల్లడించింది. 33.3 శాతం మందే ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు. అంటే.. 66.7 శాతం మందికి ఇంటర్నెట్‌ పరిచయం ఉన్నది. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పురుషుల్లో 50 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ వాడుతుంటే, మహిళలు ఏకంగా 73.5 శాతం మందికి అంతర్జాలంతో పరిచయం ఉన్నది.