WorldWonders

ఆరు నెలలకోసారి అడ్రస్ మారుతుంది !

Auto Draft

స్పెయిన్ , ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో బిడసోవా అనే ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది . ఆ నది మధ్య ‘ ఫెజంట్ ‘ అనే ఓ చిన్న దీవి ఉంది . పచ్చని చెట్లూ , ఓ స్మారక చిహ్నం తప్ప మరేమీ ఉండవక్కడ . ఆ చిన్న దీవికున్న గొప్ప ఏమిటంటే … ఆరు నెలలకోసారి దాని చిరునామా మారుతుంది . కేవలం చిరునామానే కాదు , దాని దేశమే వేరైపోతుంది . ఎందుకంటే … ఇది ఆరు నెలలు స్పెయిన్ పాలనలోనూ , మరో ఆరు నెలలు ఫ్రాన్స్ అధీనంలోనూ ఉంటుంది . దాదాపు 350 సంవత్సరాల నుంచీ ఇలాగే జరుగుతోంది . ఒక ప్పుడు ఈ బుల్లి దీవి కోసం ఆ రెండు దేశాలూ పెద్ద యుద్ధాలకే తలపడ్డాయట . ఇక ఇలా అవదని ఓ ఒప్పందానికి వచ్చాయి . అంతేకాదు , స్పెయిన్ రాకుమారిని , ఫ్రాన్స్ రాజు పెళ్లాడటంతో రెండు దేశాల మధ్యా శాశ్వత సయోధ్య కుదిరింది . అలా అప్పటి నుంచీ ఈ దీవి ఫిబ్రవరి నుంచి జులై వరకూ స్పెయిన్ అధీనంలో ఉంటే ఆగస్టు నుంచి జనవరి వరకూ ఫ్రాన్స్ చేతుల్లోకి వెళుతుంది .
cs3