Politics

2024లో ఓడిపోతే వైకాపా ఉండదని జగన్ కు అర్ధమైంది – TNI రాజకీయ వార్తలు

2024లో ఓడిపోతే వైకాపా ఉండదని జగన్ కు అర్ధమైంది  – TNI రాజకీయ వార్తలు

*జగన్‌ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదని జగన్‌కు అర్థమైందన్నారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్‌ అధ్యక్షులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.”జగన్‌ సింహం కాదు పిల్లి.. భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు. భీమిలి పర్యటనలో ప్రజలు ‘జై బాబు’ అని నినాదాలు చేశారు. ‘జై జగన్‌’ అన్నట్లు మార్ఫింగ్‌ చేసి దుష్ర్పచారం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్నాను. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు” అని చంద్రబాబు అన్నారు. మరోవైపు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించండని కార్యకర్తలను ఆదేశించారు.

*కొత్త జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి పరుగులు : మంత్రి సత్యవతి
తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు కొత్త జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్‌రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

*సిజేరియ‌న్లు చేయిస్తే దేవుడు కూడా వ‌ర‌మివ్వ‌డు : మంత్రి హ‌రీశ్ రావు
దేవుడు ప్ర‌సాదించిన నార్మ‌ల్ డెలివ‌రీల‌కే అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. ఫ‌లానా రోజే త‌న‌కు డెలివ‌రీ కావాల‌ని మీ అంత‌ట మీరే సిజేరియ‌న్లు చేయించుకుంటే ఆ దేవుడు కూడా ఏం వ‌ర‌మివ్వ‌డు అని హ‌రీశ్‌రావు అన్నారు. డెలివ‌రీల కోసం ముహుర్తాలు పెట్టుకోవ‌డం స‌రికాద‌న్నారు. గ‌ర్భిణిల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

*అలాంటి చంద్రబాబు మనకు శత్రువా… కాదా?: Chelluboina
సామాన్యుల అవసరాలను గుర్తించి పాలన చేస్తున్న నాయకుడు జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మనకు శత్రువా… కాదా? అని ప్రశ్నించారు. సామాన్యుడు పేదవాడిగానే మిగిలిపోవాలనుకుంటున్న బాబు ఆకాంక్షను అడ్డుకుని తీరాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెల్లుబోయిన పిలుపునిచ్చారు

*పవన్ వ్యాఖ్యలతో వైసీపీలో ప్రకంపనలు: Pothina Mahesh
పొత్తులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మోసపూరిత వాగ్ధానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బకి తాడేపల్లి రాజప్రసాదంలో వణుకు మెదలైందని అన్నారు. జనసేన పొత్తుల వలన రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులే చెపుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ముందు మూడు సంవత్సరాల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు. అసాంఘిక శక్తులను పోత్సాహించే అధికార పార్టీ నాయకులను రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లుంచుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పోత్తులపై జనసేన అధినేత నిర్ణయమే తుది నిర్ణయమని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు

*జేపీ నడ్డా కాదు.. అబద్ధాలకు అడ్డా : Harish Rao
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మంత్రి హరీష్ రావువిమర్శలు గుప్పించారు. ఆయన జేపీ నడ్డా కాదని.. అబద్ధాలకు అడ్డా అని ఎద్దేవా చేశారు. ఒకరేమో మోకాళ్ల యాత్ర.. ఇంకొకరేమో పాదయాత్ర.. మరోకరేమో సైకిల్ యాత్ర అంటూ బయలుదేరారన్నారు. బీజేపోళ్లు, కాంగ్రెస్సోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా లేదన్నారు. ఇంకా హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘‘బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి లేదు… ఆసరా లేదు.. రైతు బంధు లేదా.. రైతుబీమా లేదు. నడ్డాకు దమాక్ ఉందా లేదా..? భూపాలపల్లికి రా.. ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు అందాయో చూపిస్తా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మీ కేంద్రమంత్రే చెప్పిండు. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత.. కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు. ఎరువుల కోసం.. విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా? ఒక పార్టీ నేతేమో ఓటుకు నోటు కేసు దొంగ. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారు. కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట. ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారు. అలాంటి పార్టీలు అవి. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు’’ అని ఎద్దేవా చేశారు

*వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా?: Anjaneyulu
వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే కౌన్సిలర్ భార్య ఓ మహిళను చెప్పుతో కొట్టడం దారుణమన్నారు. పోలీసులు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. వైసీపీ నేతలతో కలసి పోలీసులు స్టేషన్‌లలో పంచాయతీలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ ఏమైనా బ్రహ్మనాయుడు అబ్బ జాగీరా అని అన్నారు. ఏపి ఏమైనా జగన్ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల కొవ్వు తగ్గించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘‘గడప గడపకు వస్తారా… రండి దమ్ముంటే… చీపుర్లలతో తరిమి కొడతారు. వైసీపీ దొంగల ముఠాను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ ఆంజనేయులు అన్నారు

*పొత్తుల విషయంపై పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు: Tulasireddy
పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ… నెంబర్ టూ ద్రోహి వైసీపీ అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ద్రోహం చేసిందని మండిపడ్డారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలకు భూలోకంలో యమలోకం చూపిస్తోందన్నారు. అటువంటి బీజేపీతో వంద శాతం పొత్తు ఉంటుందంటూ మరొకవైపు ప్రజల కోసమే పొత్తులు అని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు

*అలాంటి చంద్రబాబు మనకు శత్రువా… కాదా?
సామాన్యుల అవసరాలను గుర్తించి పాలన చేస్తున్న నాయకుడు జగన్(Jagan) అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna) కొనియాడారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) మనకు శత్రువా… కాదా? అని ప్రశ్నించారు. సామాన్యుడు పేదవాడిగానే మిగిలిపోవాలనుకుంటున్న బాబు ఆకాంక్షను అడ్డుకుని తీరాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెల్లుబోయిన పిలుపునిచ్చారు.

*పవన్ వ్యాఖ్యలతో వైసీపీలో ప్రకంపనలు: Pothina Mahesh
పొత్తులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మోసపూరిత వాగ్ధానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బకి తాడేపల్లి రాజప్రసాదంలో వణుకు మెదలైందని అన్నారు. జనసేన పొత్తుల వలన రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులే చెపుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ముందు మూడు సంవత్సరాల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు. అసాంఘిక శక్తులను పోత్సాహించే అధికార పార్టీ నాయకులను రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లుంచుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పోత్తులపై జనసేన అధినేత నిర్ణయమే తుది నిర్ణయమని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.

*వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా?: Anjaneyulu
వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే కౌన్సిలర్ భార్య ఓ మహిళను చెప్పుతో కొట్టడం దారుణమన్నారు. పోలీసులు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. వైసీపీ నేతలతో కలసి పోలీసులు స్టేషన్‌లలో పంచాయతీలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ ఏమైనా బ్రహ్మనాయుడు అబ్బ జాగీరా అని అన్నారు. ఏపి ఏమైనా జగన్ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల కొవ్వు తగ్గించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘‘గడప గడపకు వస్తారా… రండి దమ్ముంటే… చీపుర్లలతో తరిమి కొడతారు. వైసీపీ దొంగల ముఠాను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ ఆంజనేయులు అన్నారు.

*మిస్టరీగా బీఫార్మసీ విద్యార్థిని మరణం: Vishnuvardhan reddy
బీఫార్మసీ విద్యార్ధిని తేజశ్విని మరణం మిస్టరీగా మారిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీని కలిసిన బీజేపీ నేతలు… బీ ఫార్మసీ విద్యార్ధిని తేజశ్విని కేసులో న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జరిగిన సంఘటనలను బట్టి ఇది ఆత్మహత్య కాదని, హత్మగా భావించాల్సి వస్తోందన్నారు. ఈ కేసులో నేరస్తులు తప్పించుకోడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారితో సిట్ బృందం ఏర్పాటుచేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఘటన జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.

*జనంతో – జనసేనతో పొత్తులో ఉన్నాం: సోము వీర్రాజు
ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో తాము క్లారిటీతోనే ఉన్నామని వెల్లడించారు. 2024లో కూడా మోదీయే అధికారంలోకి వస్తారు. జనంతో – జనసేనతో పొత్తులో ఉన్నామని సోము వీర్రాజు తెలిపారు. ఇక టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నే అడగాలని సూచించారు. గోరంట్లలో బి ఫార్మశి విద్యార్థిని హత్యాచార ఘటన నిందితుడు సాదిక్‌ను అరెస్ట్ చేయాలన్నారు. తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగా నిందితుల అందరిపైనా కేసులు పెట్టాలన్నారు. బీజేపీపై అనవసర వ్యాఖ్యలు చేసిన ఆత్మకూరు, కాకినాడ ఎమ్మెల్యేల ఆటలు ఇకపై సాగనివ్వబోమన్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తోందన్నారు. అతని ఆటలనూ సాగనివ్వబోమని సోము వీర్రాజు తెలిపారు.

*బీఫార్మసీ విద్యార్థిని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు: Lokesh
బీఫార్మసీ విద్యార్థిని తేజశ్వని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ని తప్పించే ఎత్తుగడే అని ఆరోపించారు. తమ కూతురుపై హత్యాచారం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్‌మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారన్నారు. ‘‘నిన్నటి సూసైడ్ నేటి రేప్‌గా ఎలా మారింది జగన్‌రెడ్డి గారు.. మీ వాళ్లకు ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా?’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*దళిత సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: జవహర్
దళిత సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి జవహర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు సీఎం జగన్‌ను నమ్మి మోసపోయారని తెలిపారు. దళితులకు ఉన్నత విద్య ఎండమావిగా మారిందని దుయ్యబట్టారు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్య ఎందుకు దూరమైందో చెప్పాలని ప్రశ్నించారు. పదవి నిలబెట్టుకునేందుకు.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళితులను తాకట్టు పెడుతున్నారని జవహర్ దుయ్యబట్టారు.

*ప్రశ్నించిన రిపోర్టర్‌పై చిందులు వేసిన మంత్రి Ambati
మంత్రి అంబటి రాంబాబు సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. సంగం బ్యారేజి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగం బ్యారేజి పనులు త్వరలోనే పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయకుండా సంగం బ్యేరేజు పనులు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధిపై మంత్రి Ambati చిందులు తొక్కారు. ‘నువ్వు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసమిస్తున్నావా?’ అంటూ వెటకారంగా మాట్లాడారు. చివరికి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

*పొత్తుల విషయంపై పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు: Tulasireddy
పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ… నెంబర్ టూ ద్రోహి వైసీపీ అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ద్రోహం చేసిందని మండిపడ్డారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలకు భూలోకంలో యమలోకం చూపిస్తోందన్నారు. అటువంటి బీజేపీతో వంద శాతం పొత్తు ఉంటుందంటూ మరొకవైపు ప్రజల కోసమే పొత్తులు అని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

*జగనన్న రహదారుల గుంతల పథకం పెట్టినట్లుంది..: Lanka Dinakar
ఆంధ్రప్రదేశ్ అద్వాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలతో పల్లె కన్నీరు పెడుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారులలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని విమర్శించారు. ఒక మోస్తరు పట్టణాల నుంచి గ్రామాల వరకు రహదారులపైన ప్రయాణం ప్రజలకు ప్రాణసంకటంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాసిరకపు రహదారుల నిర్వహణవల్ల అర్దోపెడిక్, న్యూరో ట్రామా ఆస్పత్రులలో సగటున కేసులు బాగా పెరిగిపోయాయన్నారు. 25 జిల్లాల్లో 166.6 కి.మీ. పరిశీలిస్తే 6,220 గుంతలు బయటపడ్డాయని అంటే రాష్ట్రంలో జగనన్న రహదారుల గుంతల పథకం పెట్టినట్లుందని లంకా దినకర్ ఎద్దేవా చేశారు

*దమ్ముంటే కర్నూలు నుంచి పోటీ చెయ్‌!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. ఆదివారం కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలన్నారు. గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజా మేలు కోసం కాదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేశారని, అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయన్నారు. పవన్‌ ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ.. మరోవైపు టీడీపీతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ఆయన రైతుల గురంచి మాట్లాడడం కాదని.. గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలపై మాట్లాడి ఉంటే ప్రజలు వినేందుకు బాగుండేదన్నారు.

*విదేశాల నుంచి 31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి: మంత్రి పెద్దిరెడ్డి
బొగ్గు కొరతను అధిగమించడానికి 31 లక్షల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని.. విద్యుత్‌ సంస్థలు నిర్ణయించినట్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీపీడీసీఎల్‌ 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ జెన్‌కో 18 లక్షలు, ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు తెలిపారు.
‘దీనివల్ల విద్యుత్‌ సంస్థలపై ఆర్థికంగా భారం పడుతున్నా.. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా కోసం దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాం. థర్మల్‌ ప్లాంట్ల దగ్గర కనీసం 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంటే.. ప్రస్తుతం ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. పరిశ్రమలకు విధించిన విద్యుత్‌ విరామాన్ని వీలైనంత త్వరలో తొలగిస్తాం’ అని పేర్కొన్నారు.

*ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ డ్రామాలు: బాల్కసుమన్‌
ఎన్నికలు రాకముందే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డ్రామాలు మొదలయ్యాయని, వారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీకి పోరాట పటిమ లేదని, ఆయన పర్యటనతో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదని, ఆ పార్టీ నేతల మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.

*ప్రజా సమస్యలను గాలికొదిలేశారు: శ్రీనివాసరాజు
రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరాజు విమర్శించారు. ఆదివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

*మన బస్తీ-మన బడితో మారనున్న సర్కార్‌ బడుల రూపురేఖలు: మంత్రి తలసాని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రాజ్ భవన్ స్కూల్‌, అమీర్‌పేట ధరం కరం రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మన బస్తీ-మన బడి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిల్లాలోని మొత్తం 690 పాఠశాలలు ఉండగా మొదటి విడుతలో భాగంగా 239 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

*పోరాడైౖనా నిధులు, విధులు సాధిస్తాం: వైవీబీ
గ్రామ పంచాయతీల నిధులు, విధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడైనా సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు 2019-22 వరకు పంపిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,660 కోట్లు సర్పంచ్‌ల సంతకం లేకుండా కాజేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధుల గురించి హైకోర్టులో రెండు కేసులు వేశామన్నారు.

*Elections ఎప్పుడొచ్చినా సిద్ధం: పవన్ కల్యాణ్‌
ఎప్పుడొచ్చినా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ వస్తే.. ఏపీ భవిష్యత్ ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. విభజనతో ఏపీకి జరిగిన అన్యాయంపై బీజేపీతో పలుమార్లు మాట్లాడానని తెలిపారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని హెచ్చరించారు. ఏపీలో పట్ట పగలే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించకుండా.. తల్లి పెంపకంపై నెపం నెట్టడం దుర్మార్గమన్నారు.

*త్యాగాలు BJPకి అవసరం లేదు: సోము వీర్రాజు
ఇతర పార్టీలు చేసే త్యాగాలు బీజేపీకి అవసరం లేదని, ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. ఇక మళ్లీ ఆ త్యాగాలను గమనించడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పేరు ఎత్తకుండానే త్యాగాల గురించి మాట్లాడారు. ‘‘ఇటీవల కొంతమంది త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించాం. వాటిని గమనించడానికి ఏపీలో సిద్ధంగా లేం. బీజేపీ (BJP) వద్ద అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయి. అటువంటప్పుడు దేనికి త్యాగం చేయాలి? ఆ పార్టీల వద్ద అవినీతి ఉందని త్యాగం చేయాలా?’’ అని ప్రశ్నించారు. అవినీతి రాజకీయ పార్టీలకు, కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల వద్దకు తీసుకెళ్లే హక్కు, దమ్ము బీజేపీకి ఉన్నాయని చెప్పారు. మోదీ (Modi) నాయకత్వంలోనే 2024లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు

*ఉద్యమాలు చేస్తే జగన్‌కు భయమెందుకు?: రామకృష్ణ
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారన్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు సింహం అని సీఎం జగన్‌ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారనీ, మరి.. రాష్ట్రంలో ప్రజాఉద్యమాలు చేస్తుంటే ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా చెప్పినదానికి తల ఊపుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.620 కోట్లు ఆర్టీసీ చార్జీలు, రూ.1400 కోట్లు విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని రామకృష్ణ మండిపడ్డారు.

*APలో త్వరలో అద్భుతం జరగబోతోంది: పవన్
ఏపీలో త్వరలో అద్భుతం జరగబోతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పొత్తులపై చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని ఆకాంక్షించారు. ఏపీ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని కోరారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రోడ్‌ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామని తెలిపారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని పవన్‌కల్యాణ్ తెలిపారు

*ఆయన రాజు.. ఈయన యువరాజులా వ్యవహరిస్తున్నారు : షర్మిల
తెరాస, కాంగ్రెస్ పార్టీలపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెరాసతో పొత్తు ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి అవకాశమూ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెరాస కొనటం.. కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోవటం పరిపాటిగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన షర్మిల.. తెరాస, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ రాజులా.. కేటీఆర్ యువరాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్హ్యాండెడ్గా దొరికిన వ్యక్తికి పగ్గాలిస్తే నేతలు అమ్ముడుపోకుండా ఎందుకు ఉంటారని.. ఎద్దేవా చేశారు. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

*మిస్టర్ సీఎం.. ధైర్యముంటే నాపై పోటీ చేయండి: నవనీత్ సవాల్
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టై, విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. “హనుమాన్ చాలీసా చదవడమే నేరమా? శ్రీరామ నామాన్ని తలచినందుకు 14 రోజులు జైల్లో పెట్టారు. అదే నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లు జైల్లో ఉంటాను” అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. బెయిల్పై విడుదలైన ఆమె ముంబయిలోని లీలావతి అస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.మహారాష్ట్రలో ఎక్కడి నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సవాల్ విసిరారు నవనీత్ కౌర్. ఆయనకు మహిళల సత్తా ఎంటో చూపిస్తానన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను చిలుకగా అభివర్ణించిన ఆమె.. ఆయనపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.అస్రత్రి నుంచి డిశ్చార్జైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నవనీత్ కౌర్
“రాష్ట్ర ప్రభుత్వం మహిళను అణచివేయలేదు. నేను ఇంకా బాధపడుతున్నాను. వైద్యులను అభ్యర్థించి.. డిశ్చార్జ్ అయ్యాను. నాపై చాలా క్రూరమైన కుట్రలు పన్నారు. ముంబయిలో శాంతిభద్రతలు లేవు. ముంబయి కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయింది. నేను ముంబయికి చెందిన అమ్మాయిని. వారి అవినీతిపై పోరాటం చేస్తాను.మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్ రాణా గత నెలలో సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్ రాణా ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది కోర్టు.

*నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి అమ్మే: లోకేశ్‌
‘‘ప్రపంచంలో నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి అమ్మే. నీ జననం కోసం ప్రాణాలు పంచి ఇస్తుంది. నీ గమనం కోసం తన ప్రతిభను, శక్తిని, నైపుణ్యాలను ధారపోస్తుంది. అందుకే అమ్మంటే… అమ్మ… అంతే’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. మదర్స్‌ సందర్భంగా లోకాన ఉన్న ప్రతి అమ్మకు పాదాభివందనం అని ఆదివారం లోకేశ్‌ పేర్కొన్నారు.

*దళితుల ఇళ్లు కూడా వదిలిపెట్టరా?: చంద్రబాబు
‘‘జగన్‌ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించ డం చేతకాదని ప్రతి రోజూ రుజువవుతోంది. చివరకు దళితుల ఇళ్లు కూడా వదిలిపెట్టకుండా కూల్చడం దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లి గ్రామంలో హనుమంతరాయుడు అనే దళితుని ఇల్లు కూల్చడాన్ని ఆదివారం ఆయన ఖండించారు. బాధిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి, నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.

*అరాచక పాలనకు త్వరలోనే ముగింపు: కళా
‘‘రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు ముగింపు పలకనున్నారు. ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. ఆదివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల భాష సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. విద్యుత్‌, బస్‌ చార్జీలు, నిత్యావసర ధరలు, పన్నులు పెంచి ప్రజల పై భారం మోపారన్నారు.

*కాపులపై కక్ష ఎందుకు?: అనగాని
రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు అన్నం పెడితే.. జగన్‌రెడ్డి వారి కడుపు కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. టీడీపీ హయాంలో విదేశీ విద్యకు ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ పాలనలో విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే కాపు విద్యార్థులకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబు వసతి ఏర్పాటు చేస్తే, జగన్‌రెడ్డి దాన్ని రద్దు చేసి, ఏపీ భవన్‌ను వైసీపీ భవన్‌గా మార్చారని ఆరోపించారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ కాపులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

*‘సచివాలయ’ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి: నాగరాజు
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లతో కాలయాపన చేయకుండా రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు.

*14న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో సభ జరగనుంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరవుతున్నారు. 5 లక్షల మందితో సభ నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ వరంగల్‌లో నిర్వహించిన రాహుల్‌ గాంధీ సభ కన్నా నాలుగైదు రెట్లు అధికంగా ప్రజలను సమీకరించి, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా సంజయ్‌ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కరెంట్‌ చార్జీల పెంపును నిరసిస్తూ మండలాలు, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్‌ బిల్లులను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నాగరాజు హత్యపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసనలు తెలపాలని సూచించారు.

*రాష్ట్రానికి ఏడు చేనేత క్లస్టర్లు: కిషన్‌రెడ్డి
తెలంగాణకు ఏడు చేనేత క్లస్టర్‌ ప్రాజెక్టులు మంజూరు అయినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద కేంద్ర ప్రభుత్వం వీటిని కేటాయించిందన్నారు. సిద్దిపేట, మహదేవ్‌పూర్‌, కార్వాన్‌, కరీంనగర్‌, నార్కట్‌పల్లి, దుబ్బాకల్లో ఈ ప్రాజెక్టుల ఏర్పాటకు తొలిదశ నిధులు కూడా విడుదలయ్యాయని పేర్కొన్నారు. చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యం పెంపు, మరింతమందికి ఉపాధి కల్పన ఈ ప్రాజెక్టుల లక్ష్యమని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు.

*కేటీఆరే ఎలెక్షన్‌, కలెక్షన్‌ టూరిస్ట్‌: సీతక్క
మంత్రి కేటీఆరే ఎలక్షన్‌, కలెక్షన్‌ టూరిస్ట్‌ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్‌ది రాహుల్‌గాంఽధీని విమర్శించే స్థాయా? అని దుయ్యబట్టారు. గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అయితే తెలంగాణ సమాజ స్వప్నాన్ని కల్లలు చేసిన కేటీఆర్‌ కుటుంబానిది ద్రోహ చరిత్ర అని ఆరోపించారు. కేటీఆర్‌ సభ్యత, సంస్కారంతో మాట్లాడితే మంచిదని హితవు పలికారు. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ మూతపడితే కాపాడలేని కేటీఆర్‌.. వరంగల్‌లో నాలుగేళ్లుగా శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కడ పాల్గొన్నారో ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు.. రాహుల్‌ క్షమాపణ చెప్పాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

*రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణం: కేఏ పాల్‌
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ చేస్తున్న అవినీతి గురించి రాయాలంటే పుస్తకం సరిపోదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ విమర్శించారు. ఆదివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు రూ.87 కోట్లు ఖర్చు చేశారన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ అని కాంగ్రెస్‌ మాయ మాటలు చెబుతోందన్నారు. తన పీస్‌ మిషన్‌ను అపేయడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం అయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు.

*ఉద్ధవ్‌కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్‌ కౌర్‌
హనుమాన్‌ చాలీసా వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు సవాలు విసిరారు. అమరావతి ఎంపీ అయిన నవనీత్‌ జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రిలో చేరారు.ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యాక విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్ధవ్‌ను ఆయనకు నచ్చిన చోటునుంచి పోటీ చేయమనండి. ఆయనపై నేను తలపడతాను. అప్పుడే ప్రజల పవర్‌ ఏంటో ఆయనకు తెలుస్తుంది’’ అన్నారు. ఉద్ధవ్‌ చట్టసభలకు ఎన్నికవకుండానే 2019లో సీఎం అయ్యారు. తర్వాత శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.