DailyDose

పులివెందుల వైకాపా నేత వైయస్ కొండారెడ్డి అరెస్ట్ – TNI నేర వార్తలు

పులివెందుల వైకాపా నేత వైయస్ కొండారెడ్డి అరెస్ట్ – TNI  నేర వార్తలు

* సీఎం జగన్‌ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.పులివెందుల- రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కాంట్రాక్టర్‌ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్‌ చేసినట్లు కాంట్రాక్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.కర్ణాటకలోని ఓ భాజపా నేతకు చెందిన ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థ.. కొండారెడ్డి బెదిరిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన జగన్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అనంతరం కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతని కాల్‌డేటాను పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిని ఈ ఉదయం 11గంటల ప్రాంతంలో అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచినట్లు కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో కడప జైలుకు తరలించినట్లు ఆయన వివరించారు.

* హైదరాబాద్‌ కేంద్రంగా ఫార్మా డ్రగ్స్‌ ను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్న ఓ సంస్థ గుట్టును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రట్టుచేసింది. అమెరికాతోపాటు పలు దేశాలకు సైకోట్రోపిక్‌ మందులను అక్రమంగా తరలిస్తున్న సూత్రధారి అశిష్‌ జైన్‌ను ఆదివారం అరెస్ట్‌ చేసింది. ఆశిష్‌ జైన్‌కు చెందిన జేఆర్‌ ఇన్ఫినిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఇంటర్‌నెట్‌ ఫార్మసీ పేరుతో రెండేళ్లుగా ఈ దందా ను నిర్వహిస్తుండటం గమనార్హం. ఫార్మా డ్రగ్స్‌ను విదేశాలకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దోమలగూడలోని సంస్థ కార్యాలయంలో ఇటీవల ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హియాయత్‌నగర్‌లోని ఆశిష్‌ జైన్‌ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.3.71 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జేఆర్‌ ఇన్ఫినిటీ కార్యాలయంతోపాటు అందులోని ల్యాప్‌టా్‌పలను, ఉద్యోగుల సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను సీజ్‌ చేశారు. ఈ దందాలో భాగంగా… కంపెనీ ప్రతినిధులు అమెరికాతోపాటు పలు దేశాలకు చెందినవారి ఫోన్‌ నంబర్లను సేకరించారు.

*కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం క్యాసం పల్లి గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసుల దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, 16 కోళ్లు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 14 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

*జైపూర్ చెక్ పోస్టు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామం, ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బాణాల సురేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వదిలేశాడు. పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దమ్మపేట పోలీసులు యువకుడిపై పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించినందుకు యువకుడి తల్లిదండ్రులు, నాన్నమ్మపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

*ప్యారీస్‌ కొత్వాల్‌ బజార్‌లోని ఓ దుకాణంలో నిల్వ వుంచిన 4,050 కిలోల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసు లు తెలిపారు. ప్యారీస్‌ ప్రాంతం నుంచి రేషన్‌ బియ్యం తరలిస్తున్న ట్లు అందిన సమాచారంతో కొత్వాల్‌ బజార్‌ పోలీసులు ఆదివారం ఆ ప్రాంతంలో ఉన్న దుకాణాలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో వరదాముత్తయ్య వీధిలో 50 కిలోల బరువుతో 59 బస్తాల్లో ఉంచిన రేషన్‌ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో భగవతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రాంతం నుంచి ఓ వాహనంలో లోడ్‌ చేసిన 50 కిలోల బరువు కలిగిన 22 రేషన్‌ బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకొని అంతోని, అజిత్‌లను అరెస్ట్‌ చేశారు.

*హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి గేమ్స్ పేరుతో రోడ్లపై యువత హంగామా సృష్టిస్తోంది. ఈ క్రమంలో రాత్రి 1 నుండి 3 వరకు పోలీసుల దాడులు చేపట్టారు. స్నూకర్ పార్లర్స్‌పై మూకుమ్మడి రైడ్స్ నిర్వహించారు. ఈక్రమంలో మీర్ చౌక్‌లో 21, మొఘల్‌పురలో 27, భవాని నగర్‌లో 11… మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

*హైదరాబాద్ నగరంలోని దుండిగల్‌ గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా కొర్లకుంట గ్రామానికి చెందిన స్వామి(34)గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమబంగా నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిఘా పెట్టిన వారు.. ముగ్గురు నిందితలను అరెస్టు చేశారు.శస్త్రచికిత్సల్లో నొప్పిని నివారించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న నిందితులను.. విశాఖ టాస్కుఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 వేల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖరగ్పూర్‌లో ఒక బాక్సు ఇంజెక్షన్లు రూ.1300కు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో రూ.2వేలకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.విశాఖలో విద్యార్థులు, యువత మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల దందా సాగుతోందని.. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి లీలామహల్ జంక్షన్లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టినట్లు చెప్పారు. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన అనుపమ అధికారి, కౌశిక్ చౌధురి అనే ఇద్దరితోపాటు.. భీమిలిలో ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

*మంత్రి సురేశ్ మా పొలం ఆక్రమించారు”:స్పందనలో మహిళ పిర్యాదు
మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఇవాళ స్పందన కార్యక్రమం నిర్వహించారు.దీనికి కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ కలెక్టర్‌ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.
”మంత్రికి చెందిన జార్జ్‌ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మాకు మూడెకరాల భూమి ఉంది. ఆ పొలాన్ని మంత్రి సురేశ్‌ ఆక్రమించారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. మీరైనా న్యాయం చేయండి” అని కలెక్టర్‌కు ఆ మహిళ విన్నవించారు.

*విశాఖ జిల్లాలో భారీగా మత్తు ఇంజెక్షన్లు పట్టివేత 4 బాక్స్ ల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెస్ట్ బెంగాల్కు చెందిన ఇద్దరు అరెస్ట్ రూ.1300కి బాక్స్ కొనుగోలు చేసి రూ.6 వేలకు అమ్మకం లీలామహల్, భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్ల విక్రయం యువత మత్తుకోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడి

*మద్యం తాగడం వల్ల మనిషి ప్రాణాలు నెమ్మదిగా హరిస్తుంది అందరికీ తెలిసిందే. అయితే మద్యం మత్తు మాత్రం క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది.అలాంటి ఘటన మంచిర్యాలలో జరిగింది.. మద్యం మత్తులో నీళ్లు అనుకుని యాసిడ్ ను కలుపుకుని తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్ల హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు… గతనెల 18న మంచినీరు అనుకుని యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ ను మద్యంలో కలుపుకుని తాగాడు.దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యలు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతి చెందినట్లు తెలిపారు… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

*మంచిర్యాల జిల్లా జైపూర్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్‌ఫోస్ట్‌ సమీపంలో ఓ బైక్‎ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

*లారీలో తరలిస్తున్న 800 కిలోల గంజాయిని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సరుకు ఏపీలోని రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చేరాల్సి ఉంది. దీనిపై ఉప్పందుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. శంషాబాద్‌లో కాపుకాచారు. 32 బస్తాల్లో 800 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును గుర్తించి, సరుకును స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన లారీ డ్రైవర్‌ ఖుషీ మహమ్మద్‌, క్లీనర్‌ సోనూసింగ్‌లను అరెస్టు చేశారు. యూపీలోని బులందర్‌షహర్‌కు చెందిన సికందర్‌కు ఈ సరుకు చేరాల్సి ఉందని..ఒడిసాకు చెందిన సోమూ అలియాస్‌ భగ్వాన్‌, యూపీలోని మథురకు చెందిన బిజేందర్‌సింగ్‌లు ఈ సరుకు తరలింపు వెనక ఉన్నారని నిందితులిద్దరూ తదుపరి దర్యాప్తులో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురు నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

*జైపూర్‌ మండలం ఇందారం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ రామకృష్ణ, స్థానికుల వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన చందా మారుతి (42)- స్వప్న(40) దంపతులు. మంచిర్యాలలోని గౌతమినగర్‌లో నివాసముంటూ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కాగా ఆదివారం పెద్దపల్లిలో మారుతి సోదరి ఇంట్లో జరిగిన సారె కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి మంచిర్యాల వైపు వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనం.. అదే మార్గంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీని దాటే క్రమంలో అదుపుతప్పి లారీ చక్రాల కింద పడింది. దీంతో ఇద్దరి తల భాగాలు నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మారుతి వేలాల ఈవో రమేష్‌ సమీప బంధువులుగా గుర్తించారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్‌ఐ వివరించారు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ రాజు వెంటనే ప్రమాదస్థలికి తరలివచ్చారు.మృతులిద్దరికి కారు, బస్సుల్లో ప్రయాణం సాగించడం అలవాటు లేకపోవడంతో.. ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చిన ద్విచక్రవాహనం మీదనే వెళ్తారని బంధువులు పేర్కొన్నారు.

* ముళ్ల పొదల్లో దాచి ఉంచిన 24 ఎర్ర చందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధనం చేసుకున్నారు. అట్లూరు గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు సమాచారం అందడంతో, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అట్లూరుతో పాటు మరో మూడు గ్రామాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో ఆరుగురిని అదుపులోని తీసుకుని విచారణ చేస్తున్న ట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ జరుగుతోందని ఎస్పై నాగ చిరంజీవి తెలిపారు.

* దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామం, ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బాణాల సురేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వదిలేశాడు. పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దమ్మపేట పోలీసులు యువకుడిపై పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించినందుకు యువకుడి తల్లిదండ్రులు, నాన్నమ్మపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

*కాకినాడ రూరల్‌ మండలం ఇంద్రపాలెంలో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన అన్నామల చంద్రశేఖర్‌(48) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు బాలిక తల్లి ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని ఎస్‌ఐ మౌనిక తెలిపారు. రెండునెలలుగా బాలికను లైంగిక వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదులో తెలిపిందని, కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆమె చెప్పారు.

*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని మృతిపై రేప్‌ కేసు నమోదు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదివారం తెలిపారు. ఈ కేసును దిశ డీఎస్పీ శ్రీనివాసులుకు బదిలీ చేసినట్టు వెల్లడించారు. గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపాన ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన షెడ్డులో ఈ నెల 5న ఉరికి వేలాడుతూ విద్యార్థిని విగతజీవిగా కనిపించింది. పోలీసులు హత్య కేసుగా నమోదుచేశారు. అయితే విద్యార్థిని మృతిపై ఆందోళనలు తలెత్తాయి. గ్యాంగ్‌రేప్‌ చేశారని బంధువులు ఆరోపించారు. దీంతో రేప్‌ కేసుగా నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని దిశా డీఎస్పీని ఆదేశించారు. రెండు వారాల్లోపు దర్యాప్తు పూర్తిచేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. సోమవారం దిశా డీఎస్పీ గోరంట్లకు చేరుకుని, మల్లాపల్లి సమీపాన నిందితుడు సాదిక్‌కు చెందిన పొలంలోని షెడ్డు వద్ద వివరాలు సేకరించినట్టు తెలిసింది.

*తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి-వీరవల్లి టోల్‌గేట్‌ సిబ్బందిపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అనుచరులు దాడి చేశారు. ఆదివారం ఉదయం 10గంటలకు మేకా శేషుబాబు తన అనుచరులతో వీఐపీ మార్గంలో టోల్‌గేట్‌ దాటుతుండగా టోల్‌గేట్‌ సిబ్బంది వీఐపీ స్టిక్కర్‌ 2017 డిసెంబరు నాటికి కాల పరిమితి అయిపోయిందని, టోల్‌ కట్టవలసిందేనని చెప్పడంతో శేషుబాబు అనుచురులు వీరంగం చేశారు. వీఐపీ స్టిక్కర్‌తో పని లేదని మా నాయకుడు వీఐపీనే అని వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ముగ్గురు టోల్‌ సిబ్బందిపై దాడి చేసి.. ఒకరి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అతడి పెదవి పలిగి రక్తమోడడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసినట్టు టోల్‌ సిబ్బంది తెలిపారు.

*విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకినవలసలో ఇద్దరు పిల్లల కిడ్నాప్‌ కలకలం రేపింది. రెండు గంటల్లోనే పోలీసులు చిన్నారులతో పాటు నిందితురాలిని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంకినవలసలో కొండేటి సరోజిని, రేజేటి ప్రియా ంక కుటుంబాలు ఇరుగుపొరుగునే ఉంటాయి. సరోజిని కుమార్తె సుస్మిత ఆరో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో ఆదివారం ఉదయం ప్రియాంక కుమారుడు తొమ్మిది నెలల ధన్విత్‌ను ఇంటి బయట ఆడిస్తోంది. 11 గంటల సమయంలో పిల్లలిద్దరూ కనిపించలేదు. అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు బాడంగి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని వెంపడాపు గంగ ఇంటికి రెండ్రోజుల క్రితం వచ్చిన విజయవాడకు చెందిన గొగ్గిలాపు శోభపై అనుమానం ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమె సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రాజాంలో ఉన్నట్టు గుర్తించి, పిల్లలతో పాటు శోభను అదుపులోకి తీసుకున్నారు.

* అప్పుల బాధతో రాష్ట్రంలో ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి (36) అనే రైతు అప్పుల బాధ భరించలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హనుమంతరెడ్డి తనకున్న రెండెకరాల పొలంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అందుకోసం రూ.10లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది, ఆదివారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. గుంటూరు జిల్లా పాత పొన్నూరు 20వ వార్డుకు చెందిన ఉడతా శ్రీనివాసరావు (55)కు వల్లభరావుపాలెం గ్రామంలో తనకున్న ఎకరంతో పాటు మరో రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగులో ఏటా నష్టాలు రావడంతో పాటు గత ఖరీఫ్‌, రబీ పంటలు వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో శ్రీనివాసరావు శనివారం ఎలుకల మందు తిని పెద్ద ఇటుకంపాడు గ్రామం వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందాడు.

* ఈత సరదా ప్రాణం తీసింది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. ఆదివారం కర్నూలు జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామానికి చెందిన గుంటెప్ప, జయమ్మలకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు లక్ష్మన్న(12) గ్రామంలోని పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సెలవులు కావటంతో మిత్రులలో కలిసి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. బావిలో ఈత కొడుతూ పూడికలో ఇరుక్కుని మరణించాడు. కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన ఈడిగ ఆంజనేయులు, గీత దంపతుల కుమారుడు మర్రిస్వామి (14) 8వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఆదివారం తుంగభద్ర నదికి ఈతకు వెళ్లాడు. బురదలో కాలు ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికులకు తోటి విద్యార్థులు తెలపడంతో మర్రిస్వామిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.

*చెరువు మట్టి అమ్మకాల కోసం ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా కరప మండలం యండమూరు గ్రామ పంచాయతీ చెరువులో మట్టి పూడికతీతకు ఇటీవల పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ సర్పంచ్‌, వైసీపీ సానుభూతిపరుడు మారెళ్ల శ్రీనివాసరావు (శివ) ఈ నెల 3న చెరువు మట్టిని విక్రయిస్తుండగా స్థానిక వైసీపీ నేతలు అడ్డుకుని, ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఫిర్యాదుచేశారు. వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ (వైస్‌ ఎంపీపీ) బొమ్మితి వీరరాఘవులు అదే చెరువు మట్టిని అమ్ముకోవడానికి ఆదివారం ప్రయత్నించాడు. అప్పటికే మట్టి అమ్మకాలను అడ్డుకున్నారన్న కక్షతో ఉన్న శివ పంచాయతీ అనుమతి లేకుండా మట్టి ఎలా పట్టుకెళ్తారని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకోగా.. వైస్‌ ఎంపీపీ, సర్పంచ్‌ గాయపడగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రి, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

*కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం క్యాసం పల్లి గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసుల దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, 16 కోళ్లు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 14 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

*లక్షెట్టిపేటలో విషాదం చోటు చేసుకుంది. అన్న గుండెపోటుతో మరణించడాన్ని భరించలేక తమ్ముడూ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుండెపోటుతో అన్నదమ్ములు భాస్కర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌ మృతి చెందారు. తొలుత గుండెపోటుతో అన్న భాస్కర్‌గౌడ్(46) మృతి చెందగా.. విలపిస్తూ తమ్ముడు శ్రీనివాస్‌గౌడ్‌(44) మృతి చెందాడు.

*జైపూర్ చెక్ పోస్టు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామం, ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బాణాల సురేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వదిలేశాడు. పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దమ్మపేట పోలీసులు యువకుడిపై పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించినందుకు యువకుడి తల్లిదండ్రులు, నాన్నమ్మపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

*గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ స్రవంతిరాయ్‌ కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు. ఆదివారం ఉదయం తెనాలి బస్టాండ్‌ ప్రాంతంలో ఎస్‌ఐ జె.శ్రీనివాస్‌ తన సిబ్బందితో వాహనంలో గస్తీ నిర్వహిస్తున్నారు. పోలీసు వాహనాన్ని చూసి బిహార్‌కు చెందిన గౌతమ్‌కుమార్‌ (27), కరుణే్‌షకుమార్‌ (27) ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఉత్కర్ష్‌ (30) పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులు పరిశీలించగా 26 కేజీల గంజాయి దొరికింది. విచారించగా విశాఖకు చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు. ఎన్‌డీపీ చట్టం కింద వారిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.

*ఉక్రెయిన్‌కు చెందిన లుహాన్స్క్‌ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్‌ భవనంపై జరిగిన బాంబుదాడిలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు సమాచారం.దాడి జరిగిన సమయంలో షెల్టర్‌లో దాదాపు 90 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లుహాన్స్క్‌ ప్రాంతా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్‌ అధిపతి సెర్హీ హేడె మాట్లాడుతూ.. దాడి తర్వాత శిథిలాల నుంచి 30 మందిని రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. శిథిలాల కింద మరో 60 మంది వరకూ ఉండొచ్చని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శిథిలాలను తొలగిస్తామని పేర్కొన్నారు. వీటికింద ఉన్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు.రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబును జార విడిచింది. దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయాంలో ఈ దాడి జరిగింది. అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి.బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు 1.6 బిలియన్‌ డాలర్ల సైనిక సాయం..బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు మరో 1.6 బిలియన్‌ డాలర్ల సైనిక సాయం అందనుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది. వర్చువల్‌ జీ-7 సదస్సుకు ముందు ఈ సాయం ప్రకటించారు. జీ-7 సదస్సుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హాజరు కానున్నారు. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధం తర్వాత బ్రిటన్‌ ఈ స్థాయిలో కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. గత వారం ఉక్రెయిన్‌కు 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం చేస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చారు.

*విశాఖ జిల్లాలో భారీగా మత్తు ఇంజెక్షన్లు పట్టివేత 4 బాక్స్ ల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెస్ట్ బెంగాల్కు చెందిన ఇద్దరు అరెస్ట్ రూ.1300కి బాక్స్ కొనుగోలు చేసి రూ.6 వేలకు అమ్మకం లీలామహల్, భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్ల విక్రయం యువత మత్తుకోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడి

*శ్రీ సత్య సాయిజిల్లా:కనగానపల్లి మండల పరిధిలోని కొండపల్లి గ్రామంలో దారుణం. పాతపాల్యం మమత (35) అను మహిళను రాళ్లతో కొట్టి చంపిన గుర్తు తెలియని దుండగులు.మహిళ ఓంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఘటన.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు…