NRI-NRT

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ మహాకుంభాభిషేకానికి భారీ ఏర్పాట్లు

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ మహాకుంభాభిషేకానికి భారీ ఏర్పాట్లు

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ మహాకుంభాభిషేకాన్ని బుధవారం నుండి ఆదివారం వరకు (మే 11 నుండి 15 వరకు) ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను కొలంబస్‌కు చెంచిన రామకృష్న నారాయణం ఆధ్వర్యంలో 15మంది ఋత్విక్కులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. 400మందికి పైగా స్థానిక ప్రవాస వాలంటీర్లు ఈ ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తున్నారని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కుంభాభిషేక వేడుకలను విజయవంతం చేయవల్సిందిగా ఆయన కోరారు. పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసినట్లు మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని తెలిపారు.

For More Details, please visit: https://www.hindutemplestlouis.org/services/


St. Louis Hindu Temple Chairman – Gangavarapu Rajinikanth