NRI-NRT

కెనడాలో తాకా రంజాన్ వేడుకలు

కెనడా లో తాకా  రంజాన్ వేడుకలు

కెనడా లో తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) May 7, నాడు రంజాన్ పండుగ ఇఫ్తార్ను విందును మిస్సిసాగ నగరంలోని మేపిల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక నందు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కెనడా లోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం,షెరీన్ షాయిరాజ్ వ్యాఖ్యాత లు గా వ్యవహరించారు. మొదటగా కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాల్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మిస్సిసాగ మాల్టన్ నుండి దీపక్ ఆనంద్ ముఖ్య అతిధి గా విచ్చేయడం జరిగింది.
Whats-App-Image-2022-05-09-at-9-35-30-AM-3
దీపక్ రంజాన్ పండుగ విశిష్టత గురించి , టొరంటో లో ని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. తాకా కార్యవర్గం దీపక్ ఆనంద్ ని సత్కరించి మొమెంటో ని అందజేయడం జరిగింది.నాలుగు గంటల పాటు దాదాపు 15 పైగా రంజాన్ పాటలు, గజల్స్, గేమ్స్ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగింది.
Whats-App-Image-2022-05-09-at-9-35-30-AM-1
ఈ కార్యక్రమంలో షేక్ సదిఖ్ గజల్స్, రియాజ్ అలీ దుర్యోధన ఏకపాత్రాభినయం, షహీరాజ్, రిచా శర్మ, రీనా శర్మాల సినీ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. జావేద్,ూరి,అఫ్రిన్, షెరీన్, ముంతాజ్, జహా గార్లు రంజాన్ ప్రార్థన, క్విజ్,మరియు విశిష్టతను వివరించారు.తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరి,ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, మాజీ ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ గార్లు తాకా వ్యవస్థాపకత, మరియు తాకా చేస్తున్న కార్యక్రమాలు వివరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Whats-App-Image-2022-05-09-at-9-35-30-AM-4
ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డుఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన మరియు ఇతర వాలంటీర్లు అందరిని తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.చివరిగా మాజీ ట్రస్టీ చైర్మన్ బాషా షైక్ గారు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, దాతలకు, అతిధులకు ఇఛ్చిన వందన సమర్పణ తో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.
Whats-App-Image-2022-05-09-at-9-35-30-AM
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM-1
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM-2
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM-3
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM-4
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM-5
Whats-App-Image-2022-05-09-at-9-35-31-AM