Movies

పల్లెటూరి అమ్మాయిగా..

పల్లెటూరి అమ్మాయిగా..

‘జాతి రత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్రలో యువతరం హృదయాల్ని దోచుకుంది హైదరాబాదీ సుందరి ఫరియా అబ్దుల్లా. ‘బంగార్రాజు’ చిత్రంలో ప్రత్యేకగీతంలో నర్తించి ఆకట్టుకుంంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రవితేజ సరసన ‘రావణాసుర’ అనే చిత్రంలో నటిస్తున్నది. తాజాగా ఈ భామ తమిళంలో అరంగేట్రం చేయబోతున్నది. ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని సరసన ఫరియా అబ్దుల్లా ఓ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సుసీంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఫరియా పాత్ర సాగుతుందని..తన పాత్రలోని కొత్తదనం నచ్చి ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. తమిళ చిత్రసీమలో ఈ సినిమా తనకు శుభారంభాన్నిస్తుందనే విశ్వాసంతో ఉంది ఫరియా అబ్దుల్లా.