Movies

తల్లి కాబోతున్న హీరోయిన్‌ నమిత.. బేబీ బంప్‌ ఫోటో వైరల్‌

తల్లి కాబోతున్న హీరోయిన్‌ నమిత.. బేబీ బంప్‌ ఫోటో వైరల్‌

ప్రముఖ హీరోయిన్‌ నమిత తల్లికాబోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌ ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. అలాగే తన మాతృత్వపు అనుభూతల గురించి పోస్ట్‌లో తెలిపింది. ‘మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. ఎన్నోరోజులుగా మాతృత్వ అనుభూతి కోసం ఎదురుచూశా. ఇప్పుడు నా చిన్నారి కిక్స్‌ కొత్త అనుభూతినిస్తున్నాయి. ఈ ఫీలింగ్‌ ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్‌’ అంటూ నమిత పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా, నమిత సొంతం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంకటేష్‌ సరసన ‘జెమిని’ మూవీలో రవితేజతో ‘ఒకరాజు, ఒకరాణి’, ప్రభాస్‌తో ‘బిల్లా’ బాలకృష్ణతో ‘సింహా’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినా.. తమిళంలో మాత్రం ఎక్కువ సినిమాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. 2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది. వివాహానంతరం కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది.