Movies

ఏడాదిన్నర అభ్యాసం

ఏడాదిన్నర అభ్యాసం

ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి బాలీవుడ్ చిన్నది అలియాభట్ ఒక్కొక్కటిగా ఒక్కో సిత్రాన్ని పంచుకుంటున్నది. చేసింది చిన్నపాత్రే అయినా అది కీలకమైనది కావడంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఏడాదిన్నరపాటు ప్రాక్టీసు చేసిందట . “ షూటింగ్ ఆరంభం అను కుంటుండగా లాక్డౌన్లోకి వెళ్ళాముకదా దాంతో నేనా సన్నివేశాన్ని ఏడాదిన్నరపాటు నేర్చు కుంటూనే వున్నా. కరోనా వల్ల పదేపదే వాయిదా పడుతుంటే ఇలా చేయాల్సివచ్చింది. అలాగే జుట్టుకు రంగులు చాలాసార్లు మార్చాల్సివచ్చింది. ఇక , ఇటువంటి భారీ ప్రచారంచేయడం కూడా ఇదే తొలిసారి ” అని చెప్పింది.